Forex vs Credit Card: జీరో ఫారెక్స్ కార్డ్ vs క్రెడిట్ కార్డ్..వీటిలో ఏది బెస్ట్ ఛాయిస్
ABN , Publish Date - Apr 14 , 2025 | 02:50 PM
ప్రపంచాన్ని చుట్టేయాలనే ఆసక్తి చాలా మందిలో ఉంటుంది. కొందరికి అది ఒక కల, మరికొంత మందికి అది జీవనశైలి. ఈ క్రమంలో ప్రతి వారం, ప్రతి నెలా కొత్త టూర్లు ప్లాన్ చేసే ప్రయాణ ప్రియులు, స్మార్ట్‌గా ఖర్చులు నియంత్రించుకోవడం ఎలా అనే విషయాలను ఇప్పుడు చూద్దాం.

అనేక మందికి కొత్త ప్రయాణాలు చేయాలని ఆసక్తి ఉంటుంది. మరికొంత మంది ఎక్కువగా ప్రతి వారం లేదా నెలకోసారి టూర్ల కోసం వెళుతుంటారు. ఇలాంటి ప్రయాణికుల కోసం మార్కెట్లో రెండు రకాల ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో జీరో ఫారెక్స్ కార్డులు, క్రెడిట్ కార్డులు కలవు. అయితే ఈ రెండింటినీ విశ్లేషించి, మీ ప్రయాణ విధానానికి ఏది సరిపోతుందో ఇక్కడ తెలుసుకుందాం. వీటి ద్వారా మీ ప్రయాణాల ఖర్చుల్లో తగ్గింపులను పొందవచ్చు. ముఖ్యంగా చెల్లింపుల విషయంలో సరైన ఎంపిక చేసుకోవడం వల్ల మీ ఖర్చులను నివారించుకోవచ్చు.
1. కరెన్సీ మార్పిడి ఛార్జీలు
జీరో ఫారెక్స్ కార్డులు: ప్రీ లోడ్ చేసే ఈ కార్డులు మీ మారకపు రేటును ముందుగానే లాక్ చేస్తాయి. అంటే, మీరు కార్డు లోడ్ చేస్తున్న సమయంలో ఉన్న రేటే వాడతారు. తరువాత ఎలాంటి మారకపు మార్కప్ ఉండదు. ఇది మారుతున్న మారకపు విలువల వల్ల వచ్చే భారం నుంచి కాపాడుతుంది.
క్రెడిట్ కార్డులు: వీటిపై సాధారణంగా 3% నుంచి 5% వరకు విదేశీ మారకపు మార్కప్ ఉంటుంది. అంటే ప్రతీ లావాదేవీపై అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. డైనమిక్ కరెన్సీ కన్వర్షన్ ఛార్జీలు కూడా ఉండొచ్చు
2. ATM ఉపసంహరణ రుసుములు
ఫారెక్స్ కార్డులు: బ్యాంక్ లేదా కార్డు ప్రొవైడర్‌ను బట్టి, ఒక్కో లావాదేవీకి $2 నుంచి $5 వరకు మాత్రమే ఛార్జ్ చేస్తారు. కొన్నిసార్లు, ఇది మినిమమ్ రుసుముగా కూడా ఉండవచ్చు
క్రెడిట్ కార్డులు: కనీసం 2-3% నగదు ప్రాసెసింగ్ ఫీజుతో పాటు, తక్షణ వడ్డీ చార్జీలు కూడా వస్తాయి. అంటే, మీరు ATM నుంచి డబ్బు తీసుకున్న రోజే వడ్డీ మొదలవుతుంది. ఇది చాలాసార్లు ఖరీదైన వ్యవహారంగా మారుతుంది.
3. ఊహించని ఖర్చులు
ఫారెక్స్ కార్డులు: వీటిలో సాధారణంగా హిడెన్ ఛార్జీలు తక్కువగా ఉంటాయి. అయితే, కార్డును ఎక్కువ కాలం వాడకపోతే కొన్ని బ్యాంకులు ఇతర ఫీజులను విధించవచ్చు
క్రెడిట్ కార్డులు: వార్షిక రుసుములు, ఆలస్య చెల్లింపు పెనాల్టీలు, అంతర్జాతీయ లావాదేవీలకు అదనపు ఛార్జీలు ఉన్నాయి. ఇవన్నీ కలిపి ఖర్చులను పెంచుతాయి
4. భద్రత & మోసం రక్షణ
ఫారెక్స్ కార్డులు: ఇవి ప్రీపెయిడ్ కార్డులు కాబట్టి, మీరు లోడ్ చేసిన మొత్తాన్ని వాడతారు. బ్యాంక్ అకౌంట్‌కు లింక్ చేయబడదు. అంటే, ఎవరికైనా మీ కార్డు దొరికినా పెద్దగా నష్టం ఉండదు
క్రెడిట్ కార్డులు: మోసం జరిగినప్పుడు ఛార్జ్ బ్యాక్ చేసే అవకాశాలు ఉన్నాయి. కానీ, కార్డు దొంగతనం అయితే భారీ నష్టాలకు దారితీయవచ్చు
5. ఏది ఉచితం, ఏది ఖరీదైనది
ఫారెక్స్ కార్డులు: ప్రీ లోడెడ్ కాబట్టి వడ్డీ అనే ప్రసక్తే లేదు. మీరు ఎంత లోడ్ చేస్తారో అంత వరకే వాడతారు
క్రెడిట్ కార్డులు: చెల్లింపులు సకాలంలో చేయకపోతే 30% నుంచి 42% వార్షిక వడ్డీ వర్తిస్తుంది. ఇది మించితే ఖర్చు పెరిగే ఛాన్సుంది.
6. సౌలభ్యం
ఫారెక్స్ కార్డులు: చాలా అంతర్జాతీయ రిటైలర్లు అంగీకరిస్తారు. కానీ హోటల్ రిజర్వేషన్‌లు లేదా కార్ రెంటల్‌లకు సెక్యూరిటీ డిపాజిట్ అవసరం. ఇవి ఎప్పుడూ ఉపయోగకరంగా ఉండకపోవచ్చు
క్రెడిట్ కార్డులు: ఎక్కడైనా పనిచేస్తాయి. హోటళ్ళు, ఫ్లైట్ బుకింగ్‌లు, లాస్ట్ మినిట్ షాపింగ్ అన్నింటికీ ఓకే. మీరు ఎలాంటి అడ్డంకి లేకుండా ప్రయాణించాలనుకుంటే ఇవి బెస్ట్ ఛాయిస్
7. రివార్డులు & ప్రయోజనాలు
ఫారెక్స్ కార్డులు: బేసిక్ ట్రాన్సాక్షన్‌కి మాత్రమే. దీనిలో రివార్డ్స్, క్యాష్‌బ్యాక్ వంటివి చాలా తక్కువ
క్రెడిట్ కార్డులు: క్యాష్ బ్యాక్, మైళ్ళు, ప్రయాణ బీమా, ఎయిర్‌పోర్ట్ లాంజ్ యాక్సెస్ వంటి అనేక ప్రయోజనాలు ఉంటాయి. దీన్ని వాడుతూ మీరు భవిష్యత్తు ప్రయాణాల కోసం పాయింట్లు పెంచుకుని వినియోగించుకోవచ్చు.
ఇవి కూడా చదవండి:
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..
Read More Business News and Latest Telugu News