Trump Exempts: మరో గుడ్ న్యూస్ చెప్పిన ట్రంప్.. వీటన్నింటికీ నో టారిఫ్స్
ABN , Publish Date - Apr 12 , 2025 | 09:38 PM
అమెరికా అధ్యక్షుడు ట్రంప్ తాజా ప్రకటనతో చాలా వరకూ దిగొచ్చినట్లైంది. తాజాగా రెసిప్రోకల్ టారిఫ్స్ ను 90 రోజుల పాటు పాజ్ చేసిన అమెరికా అధ్యక్షుడు ఇప్పుడు స్మార్ట్ ఫోన్లు.. ల్యాప్ టాప్ లు..

Trump Exempts Reciprocal Tariffs: అమెరికా అధ్యక్షడు డోనాల్డ్ ట్రంప్ మరో గుడ్ న్యూస్ వినిపించారు. రెసిప్రోకల్ టారిఫ్స్ బాదుడు నుంచి కొన్ని వస్తువులకు మినహాయింపులిచ్చారు. ఇందులో స్మార్ట్ ఫోన్‌లు, ల్యాప్‌టాప్ కంప్యూటర్లు, హార్డ్ డ్రైవ్‌లు, కంప్యూటర్ ప్రాసెసర్‌లు, మెమరీ చిప్‌లు తదితరాలు ఉన్నాయి. ఈ వినియోగదారులకు చాలా ఉపశమనాన్ని కలిగించే వార్త.లేదంటే, తరచూ కొనుగోలు చేసే ఈ వస్తువుల ధరలు తారాస్థాయికి చేరితే ఆ ఆర్థిక భారాన్ని సాధారణ ప్రజానీకం మోయలేదు. ట్రంప్ తాజా నిర్ణయం ఆపిల్ ఇంక్, శామ్‌సంగ్ ఎలక్ట్రానిక్స్ వంటి ఎలక్ట్రానిక్స్ దిగ్గజాలకు భారీ ప్రయోజనం చేకూరుస్తుంది.
అత్యంత ఉపయుక్తమైన పైన ఉదహరించిన వస్తువులు సాధారణంగా USలో తయారీ లేదు. ఒక వేళ ట్రంప్ చెప్పినట్టు దేశీయ తయారీని ఏర్పాటు చేద్దామా అంటే దానికి కొన్నేళ్లు పడుతుంది.ఒక వేళ టారిఫ్స్ పైన ట్రంప్ వెనక్కి తగ్గకపోతే అమెరికన్ల ఆగ్రహాన్ని చవిచూడాల్సి వస్తుంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ట్రంప్ ఈ తాజా నిర్ణయం తీసుకున్నట్టు అర్థమవుతోంది. కాగా, ట్రంప్ ఇటీవల ప్రకటించిన రెసిప్రోకల్ టారిఫ్స్ 90 రోజుల పాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, 10 శాతం బేస్ లైన్ గ్లోబుల్ సుంకాలు మాత్రం యధాతథంగా ఉంటాయని ట్రంప్ ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. అయితే, చైనాతో సహా అన్ని దేశాల దిగుమతులపై ఇప్పుడు పూర్తి మినహాయింపునివ్వడం ముఖ్యంగా యాపిల్ సంస్థతోపాటు గ్లోబల్ మార్కెట్స్ కు పెద్ద పాజిటివ్ న్యూస్ అనే చెప్పాలి.
ఈ వార్తలు కూడా చదవండి:
Viral Video: లేడి ఎస్సైతో అలాంటి పనా.. నీకుందిలే అంటూ నెటిజన్లు ఫైర్..
Tokay Gecko: ఇవేం బల్లులు రా నాయనా.. ఒక్కటి అమ్మేస్తే చాలు హైదరాబాద్‌లో ఇల్లు కొనేయెుచ్చు..
Inter Sudent Passed Away: షాకింగ్ న్యూస్.. పరీక్షల్లో తప్పానని ఇంటర్ విద్యార్థి ఆత్మహత్య..