Share News

Recharge Offer: రూ. 108కే మంత్లీ రీఛార్జ్.. డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాల్స్ కూడా..

ABN , Publish Date - Feb 27 , 2025 | 04:07 PM

ప్రభుత్వ రంగంలోని టెలికాం సంస్థ BSNL ప్రైవేటు కంపెనీలైన జియో, ఎయిర్ టెల్ వంటి సంస్థలకు గట్టి పోటీ ఇస్తోంది. ఈ క్రమంలో వినియోగదారుల కోసం అతి తక్కువ ధరల్లో ప్లాన్లను ప్రవేశపెడుతూ ఆకట్టుకుంటోంది. ఈ క్రమంలోనే ఇటివల ప్రవేశపెట్టిన రూ.108 ప్లాన్ గురించి తెలుసుకుందాం.

Recharge Offer: రూ. 108కే మంత్లీ రీఛార్జ్.. డేటాతోపాటు అన్ లిమిటెడ్ కాల్స్ కూడా..
rs 108 Recharge plan

ప్రైవేట్ టెలికాం కంపెనీలు రీఛార్జ్ ధరలను పెంచిన తర్వాత టెలికాం మార్కెట్లో యూజర్ల ధోరణి క్రమంగా మారిపోయింది. ఈ క్రమంలో ప్రత్యామ్నాయ ప్లాన్ల గురించి ప్రజలు వెతకడం ప్రారంభించారు. అదే సమయంలో ప్రభుత్వ యాజమాన్యంలోని టెలికాం కంపెనీ బీఎస్ఎన్ఎల్(BSNL) యూజర్లకు అద్భుతమైన ప్లాన్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. దీంతో గత కొన్ని నెలల్లో అనేక మంది యూజర్లు ప్రైవేట్ నెట్ వర్క్‌ల నుంచి దీనివైపు ఆసక్తిచూపిస్తున్నారు. ఈ క్రమంలో ఇటివల ప్రవేశపెట్టిన రూ.108 రీఛార్జ్ ప్లాన్ గురించి ఇక్కడ తెలుసుకుందాం.


ప్లాన్ వ్యవధి..

BSNL రూ. 108 ప్లాన్‌ వినియోగదారులకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఈ ప్లాన్ 28 రోజులపాటు చెల్లుబాటు అవుతుంది. ఈ ప్లాన్ కింద వినియోగదారులు 28 రోజుల పాటు ఏ నెట్‌వర్క్‌కైనా అపరిమిత కాలింగ్‌ సౌకర్యాన్ని పొందుతారు. దీంతోపాటు ఈ ప్లాన్‌లో 28GB డేటా కూడా అందించబడుతుంది. అంటే వినియోగదారులు రోజుకు 1GB డేటాను పొందవచ్చు. ఇది ఇంటర్నెట్ ఉపయోగించే వారికి అనుకూలంగా ఉంటుంది. అంతేకాదు ఈ ప్యాకేజీలో 28 రోజుల వ్యవధిలో వినియోగదారులు 500 SMSలను కూడా పొందుతారు. దీని ద్వారా అవసరమైన సమయంలో మెసేజులు పంపించుకోవడానికి ఉపయోగపడుతుంది.


29 లక్షల మంది..

రూ. 108 ప్లాన్ ప్రస్తుత మార్కెట్ పరిస్థితుల్లో వినియోగదారులకు అత్యంత బెస్ట్ రీఛార్జ్ ప్లాన్ అని చెప్పవచ్చు. ఎందుకంటే ఇంత తక్కువ ధరల్లో మార్కెట్లో ఏ ఇతర కంపెనీలు కూడా ఇలాంటి సౌకర్యాలను అందించడం లేదు. ఇది కాల్స్ మాట్లాడుకునే వారితోపాటు డేటా ఉపయోగించుకునే వారికి కూడా సౌలభ్యంగా ఉంటుంది.

ఇప్పటికే జూలై 2024లో ప్రకటించిన అధిక రీఛార్జ్ ఖర్చుల నుంచి దాదాపు 29 లక్షలకుపైగా వినియోగదారులు ఉపశమనం పొందారు. అంటే ప్రైవేటు నెట్ వర్క్ ల నుంచి ప్రభుత్వ యాజమాన్యంలోని బీఎస్ఎన్ఎల్‌కు మారిపోయారు. వినియోగదారుల కోసం ఈ కంపెనీలో తక్కువ ధరల్లో ప్లాన్‌లు ఉన్న నేపథ్యంలో అనేక మంది BSNLకు షిఫ్ట్ అవుతున్నారు.


ఇవి కూడా చదవండి:

Instagram: ఇన్‌స్టాగ్రామ్‌లో హింసాత్మక కంటెంట్.. యూజర్ల ఫిర్యాదులు, అసలేమైంది..


Bank Holidays: మార్చి 2025లో బ్యాంకు సెలవులు.. ఈసారి ఎన్ని రోజులంటే..

Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్

Read More Business News and Latest Telugu News

Updated Date - Feb 27 , 2025 | 04:08 PM