ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: జైలులో పరిచయం.. స్నేహంగా మారి.. చివరకు ఎటు దారితీసిందంటే..

ABN, Publish Date - Jan 11 , 2025 | 10:55 AM

గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ నేరస్థులు జైలులో పరిచయం అయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చి ముఠాగా ఏర్పడి పకడ్బందీగా గంజాయి రవాణా, విక్రయాలు చేస్తున్న నలుగురు నిందితులను, నలుగురు గంజాయి కొనుగోలుదారులను ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ, హయత్‌నగర్‌ పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు.

- గంజాయి దందా చేస్తున్న ముఠా అరెస్ట్‌

హైదరాబాద్‌ సిటీ: గంజాయి విక్రయిస్తూ పట్టుబడ్డ నేరస్థులు జైలులో పరిచయం అయ్యారు. జైలు నుంచి బయటికి వచ్చి ముఠాగా ఏర్పడి పకడ్బందీగా గంజాయి రవాణా, విక్రయాలు చేస్తున్న నలుగురు నిందితులను, నలుగురు గంజాయి కొనుగోలుదారులను ఎల్బీనగర్‌ ఎస్‌ఓటీ, హయత్‌నగర్‌ పోలీసులు కలిసి అరెస్ట్‌ చేశారు. అబ్దుల్లాపూర్‌మెట్‌(Abdullapurmet) మండలం కుత్బుల్లాపూర్‌ గ్రామానికి చెందిన నాయని శ్యాం(22) హయత్‌నగర్‌ అమన్‌గల్‌ బస్తీలో ఉంటూ పాల వ్యాపారం చేస్తున్నాడు. కొంతకాలంగా గంజాయి తాగడానికి అలవాటుపడ్డ ఇతడు ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు,

ఈ వార్తను కూడా చదవండి: Republic Day: రిపబ్లిక్‌ డే పరేడ్‌కు 31 మంది అతిథులు


ధూల్‌పేటలో గంజాయి కొని అధిక ధరలకు విక్రయించేవాడు. ఇలా ఈజీ మనీకి అలవాటుపడి గంజాయి విక్రయిస్తున్న శ్యాంను అబ్దుల్లాపూర్‌మెట్‌ పోలీసులు అరెస్ట్‌ చేసి, జైలుకు పంపారు. గంజాయి విక్రయాలు చేస్తున్న మహబూబ్‌బాద్‌(Mahabubabad)కు చెందిన కందుకూరి చందు అలియాస్‌ ప్రేమ్‌చంద్‌(18)ను కూడా పోలీసులు అరెస్ట్‌ చేశారు. వీరిద్దరూ జైలులో పరిచయం అయ్యారు. బెయిల్‌పై బయటకు వచ్చిన తర్వాత డిగ్రీ చదువుతున్న బుర్రా రాజేష్ కుమార్‌ అలియాస్‌ రాము(20), బాలాపూర్‌కు చెందిన చిత్రం ఉదయ్‌కిరణ్‌(20)తో కలిసి ముఠాగా ఏర్పడ్డారు.


వీరంతా గంజాయి సేవించడానికి అలవాటుపడడంతో ధూల్‌పేట(Dhulpet) నుంచి గంజాయి కొనుగోలు చేసి, తాగడంతోపాటు హయత్‌నగర్‌ ప్రాంతంలో కస్టమర్లకు అధిక ధరలకు విక్రయించేవారు. వీరికి ఒడిషా మల్కాన్‌గిరి ప్రాంతానికి చెందిన గంజాయి విక్రేత అర్జున్‌తో పరిచయం అయింది. దాంతో వీరు ఒడిషా వెళ్లి తక్కువ ధరకే గంజాయి కొనుగోలు చేయడం ప్రారంభించారు. ఒడిషాలో కిలో గంజాయి రూ.మూడువేలకు కొనుగోలు చేసి, వాటిని 100 గ్రాముల ప్యాకెట్‌లుగా మార్చి ఒక్కో ప్యాకెట్‌ రూ. రెండువేలకు విక్రయిస్తున్నారు.


వీరి వద్దనుంచి దసరామొని రాఘవేందర్‌, జోగు వరుణ్‌కుమార్‌, గుడిమల్ల మహేష్‌, మర్రి అఖిల్‌రాజ్‌లు కొనుగోలు చేస్తున్నారు. డిసెంబర్‌ 30న ఒడిషా వెళ్లిన శ్యాం 7కిలోల గంజాయి కొనుగోలు చేశాడు. వాటిని చిన్న ప్యాకెట్లలో మార్చి విక్రయించడం ప్రారంభించాడు. ఎస్‌ఓటీ, హయత్‌నగర్‌ పోలీసులు హయత్‌నగర్‌ జీ స్కూల్‌ వెనుకవైపు గంజాయి విక్రయిస్తుండగా పట్టుకున్నారు. వారి వద్ద నుంచి 4.50కిలోల గంజాయి, మూడు బైకులు, 6 మొబైల్‌ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 10:55 AM