BJP: బీజేపీ రాష్ట్ర చీఫ్‌పై కేసు నమోదు.. విషయం ఏంటంటే..
ABN, Publish Date - Mar 25 , 2025 | 11:42 AM
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడుతోపాటు మరో సీనియర్ నేతపై స్థానిక పోలీసులు కేసునమోదు చేశారు. వివరాలిలా ఉన్నాయి. మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, ఆ పార్టీ సీనియర్ నేత హెచ్.రాజాపై సేలం పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ విషయం ఇప్పుడు రాజకీయంగా చర్చనీయావశమైంది.

- మతవిద్వేషాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు
- అన్నామలై, హెచ్.రాజాపై కేసులు
చెన్నై: మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా వాఖ్యలు చేశారంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై(BJP State President Annamalai), ఆ పార్టీ సీనియర్ నేత హెచ్.రాజా(H. Raja)పై సేలం పోలీసులు కేసు నమోదు చేశారు. తిరుప్పరంగుండ్రం పూర్తిగా మురుగన్‌కు చెందినదని, అందువల్ల ఈ ప్రాంతంలోని దర్గా తొలగించాలని 1931లో లండన్ న్యాయస్థానం తీర్పు ఇచ్చిందంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నామలై, హెచ్.రాజా ప్రకటించారని, వారిపై చర్యలు చేపట్టాలని కోరుతూ సేలంకు చెందిన సామాజికవేత్త ప్యూస్ సేలం నగర పోలీస్ కమిషనర్ ప్రవీణ్‌కుమార్(Salem City Police Commissioner Praveen Kumar) కు ఫిర్యాదు చేశారు.
ఈ వార్తను కూడా చదవండి: Rangarajan: నన్ను దాడి నుంచి కాపాడింది తిరుమలేశుడే
దాంతో పోలీసులు విచారణ చేపట్టగా, సోమవారం సైబర్ క్రైం పోలీసులు అన్నామలై, హెచ్.రాజాలపై కేసు నమోదుచేశారు. ఈ విషయమై ప్యూస్ మాట్లాడుతూ... మతవిద్వేషాలు రెచ్చగొట్టేలా అన్నామలై, రాజా అస్యత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. ప్రస్తుతం తిరుప్పరంగుండ్రం కొండ వ్యవహారంపై అసత్య ప్రచారం చేసినందుకు అన్నామలై, రాజాలపై సైబర్ క్రైం పోలీసులు కేసు నమోదుచేశారని తెలిపారు. ఐకమత్యంగా ఉన్న రాష్ట్ర ప్రజల మధ్య మతచిచ్చు పెట్టేలా అన్నామలై వ్యవహారశైలి ఉందని, అతడిపై తగిన చర్యలు చేపట్టాలని ప్యూస్ డిమాండ్ చేశాడు.
ఈ వార్తలు కూడా చదవండి:
టీవీ నటిపై లైంగిక దాడికి యత్నం
పరీక్ష రాయనివ్వకపోతే చావే శరణ్యం
Read Latest Telangana News and National News
Updated Date - Mar 25 , 2025 | 11:42 AM