ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: కోళ్ల దాణా పేరుతో అల్ర్పాజోలమ్‌ దందా

ABN, Publish Date - Jan 11 , 2025 | 07:39 AM

పౌల్ట్రీ వ్యాపారం ముసుగులో మత్తు పదార్థాలు ఉత్పత్తి చేస్తూ.. కోళ్ల దాణా పేరుతో అల్ర్పాజోలమ్‌ దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు(Telangana Excise Police) రట్టు చేశారు.

- ప్రకాశం జిల్లా దర్శి కేంద్రంగా వ్యాపారం

- తెలంగాణలో పలు ప్రాంతాల్లో అమ్మకం

- ఇద్దరు నిందితుల అరెస్ట్‌

- రూ. 55 లక్షల విలువైన ముడి సరుకు, తయారీ సామగ్రి స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: పౌల్ట్రీ వ్యాపారం ముసుగులో మత్తు పదార్థాలు ఉత్పత్తి చేస్తూ.. కోళ్ల దాణా పేరుతో అల్ర్పాజోలమ్‌ దందా నిర్వహిస్తున్న ముఠా గుట్టును తెలంగాణ ఎక్సైజ్‌ పోలీసులు(Telangana Excise Police) రట్టు చేశారు. ఇద్దరు నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి రూ. 55 లక్షల విలువైన అల్ర్పాజోలమ్‌తోపాటు..తయారీకి వినియోగించే ముడిసరుకు, సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఎక్సైజ్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టర్‌ కమలాసన్‌రెడ్డి శుక్రవారం వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Kite Festival: 13 నుంచి అంతర్జాతీయ కైట్‌ ఫెస్టివల్‌


ఆంధ్రప్రదేశ్‌(Andhra Pradesh) రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శి ఉమామహేశ్వరం ప్రాంతానికి చెందిన రాజశేఖర్‌ రెడ్డి కెమికల్‌ ఇంజనీరింగ్‌ పూర్తి చేశాడు. కొన్నేళ్ల క్రితం హైదరాబాద్‌ వచ్చి స్థిరపడ్డాడు. విలాసవంతమైన జీవితానికి సులువుగా డబ్బులు సంపాదించాలనే లక్ష్యంతో తన గ్రామంలో పౌల్ట్రీ ఫామ్‌ స్థాపించాడు. పౌల్ట్రీ వ్యాపారం ముసుగులో అల్ర్పాజోలమ్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు చేశాడు. గుట్టుగా అల్ర్పాజోలమ్‌(Alprazolam) తయారు చేసి, తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు..


ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. అల్ర్పాజోలమ్‌ దందాపై విశ్వసనీయ సమాచారం అందుకున్న ఎక్సైజ్‌ ఎస్‌టీఎఫ్‌ పోలీసులు కొద్దిరోజులుగా రాజశేఖర్‌రెడ్డి(Rajasekhar Reddy) కదలికలపై నిఘా పెట్టారు. శుక్రవారం అల్ర్పాజోలమ్‌ను కారులో హైదరాబాద్‌(Hyderabad)కు తరలిస్తుండగా శుక్రవారం మిర్యాలగూడ చౌరస్తాలో పట్టుకున్నారు. రాజశేఖర్‌రెడ్డి, అతడి సహాయకుడిని అరెస్ట్‌ చేశారు. దర్శి వెళ్లిన పోలీసులు అక్కడి తయారీ కేంద్రంలో ఉన్న ముడిసరుకు, తయారీ సామగ్రిని సీజ్‌ చేశారు.


ఈవార్తను కూడా చదవండి: Travel Rush: పట్నం బైలెల్లినాదో!

ఈవార్తను కూడా చదవండి: HMDA: మహా అప్పు కావాలి!

ఈవార్తను కూడా చదవండి: నిర్మాణంలోని 11 విల్లాలు నేలమట్టం

ఈవార్తను కూడా చదవండి: నాకు ఆ భూమితో సంబంధం లేదు..

Read Latest Telangana News and National News

Updated Date - Jan 11 , 2025 | 07:39 AM