Hyderabad: పాత కక్షలతో వ్యక్తి దారుణ హత్య
ABN, Publish Date - Jan 04 , 2025 | 07:55 AM
పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన శుక్రవారం రాత్రి ఉప్పల్ పోలీస్‌స్టేషన్(Uppal Police Station) పరిధిలోని రామంతాపూర్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామంతాపూర్ బాలకృష్ణనగర్(Ramanthapur Balakrishnanagar) సమీపంలో మూసీకి సమపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.
ఉప్పల్(హైదరాబాద్): పాత కక్షలతో ఓ వ్యక్తిని దారుణంగా హత్య చేసిన సంఘటన శుక్రవారం రాత్రి ఉప్పల్ పోలీస్‌స్టేషన్(Uppal Police Station) పరిధిలోని రామంతాపూర్‌లో వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... రామంతాపూర్ బాలకృష్ణనగర్(Ramanthapur Balakrishnanagar) సమీపంలో మూసీకి సమపంలో ఓ వ్యక్తి మృతదేహాన్ని గమనించి స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని వివరాల సేకరించారు. గోల్నాక ప్రాంతానికి చెందిన మహమ్మద్ నబి(30) అనే వ్యక్తి రామంతాపూర్‌లోని ఓ టెంట్ హౌజ్‌లో పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: వణికిస్తున్న చలి.. పటాన్‌చెరులో అత్యల్పం
గుర్తు తెలియని వ్యక్తులు మహమ్మద్ నబిని కత్తితో పొడవడమే కాకుండా బండరాయితో మోది చంపినట్లు, ముఖంపై తీవ్రమైన కత్తి గాట్లు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. ఎక్కడో చంపి మూసీ ప్రాంతంలో పడేసి ఉంటారని అనుమానిస్తున్నారు. అయితే మహ్మద్ నబి గతంలో అంబర్‌పేట్(Amberpet)లో జకీర్ హెస్సేన్ హత్య కేసులో నిందితుడిగా ఉన్నట్లు పోలీసులు చెబుతున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించిన ఉప్పల్ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ఈవార్తను కూడా చదవండి: Nampally Court : అల్లు అర్జున్‌కు ఊరట
ఈవార్తను కూడా చదవండి: ‘మా శవయాత్రకు రండి’ వ్యాఖ్యపై కేసు కొట్టివేయండి: కౌశిక్‌రెడ్డి
ఈవార్తను కూడా చదవండి: West Godavari: ఏపీ యువకుడి దారుణ హత్య
ఈవార్తను కూడా చదవండి: Bus Accident: కేరళలో అయ్యప్ప స్వాముల బస్సు బోల్తా
Read Latest Telangana News and National News
Updated Date - Jan 04 , 2025 | 07:55 AM