ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Hyderabad: అధిక సంపాదన కోసం అడ్డదారులు.. తుపాకుల విక్రయానికి యత్నం

ABN, Publish Date - Jan 16 , 2025 | 10:10 AM

నగరంలో ఆయుధాలు విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌వోటీ భువనగిరి, జవహర్‌నగర్‌ పోలీసులు(SOT Bhuvanagiri, Jawaharnagar Police) అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి మూడు తుపాకులు, 10 తూటాలను స్వాధీనం చేసుకున్నారు.

- నిందితుడి అరెస్ట్‌.. 3 గన్స్‌, 10 తూటాలు స్వాధీనం

హైదరాబాద్‌ సిటీ: నగరంలో ఆయుధాలు విక్రయించేందుకు యత్నిస్తున్న ఓ వ్యక్తిని ఎస్‌వోటీ భువనగిరి, జవహర్‌నగర్‌ పోలీసులు(SOT Bhuvanagiri, Jawaharnagar Police) అరెస్ట్‌ చేశారు. అతడి నుంచి మూడు తుపాకులు, 10 తూటాలను స్వాధీనం చేసుకున్నారు. బుధవారం నేరేడ్‌మెట్‌(Neredmet)లోని రాచకొండ కమిషనరేట్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీపీ సుధీర్‌బాబు డీసీపీ రమణారెడ్డి, ఏడీసీపీ నర్సింహారెడ్డితో కలిసి వివరాలు వెల్లడించారు.

ఈ వార్తను కూడా చదవండి: Chinese manja: నిషేధమున్నా జోరుగా విక్రయాలు..


ఉత్తరప్రదేశ్‌ ఆఖర్‌(Uttar Pradesh Aakhar) జిల్లా, రాంపూర్‌ బోహా ప్రాంతానికి చెందిన హరేకృష్ణయాదవ్‌(26) ఇంటర్‌ వరకు చదువుకున్నాడు. బతుకుదెరువు కోసం సోదరుడితో కలిసి 2019లో నగరానికి వచ్చాడు. బీబీనగర్‌ ప్రాంతంలో ఉంటూ అక్కడే ఓ సంస్థలో మూడేళ్ల పాటు పనిచేశాడు. ఆదాయం సరిపోకపోవడంతో 2022లో ఉద్యోగం వదిలేసి స్వస్థలానికి వెళ్లిపోయాడు. అక్కడే చిన్న చిన్న పనులు చేసుకుంటున్నాడు. యూపీ, బిహార్‌(UP, Bihar)లో తక్కువ ధరకు లభించే దేశీవాళీ తుపాకులను తీసుకొచ్చి నగరంలో అవసరం ఉన్న వారికి అధిక ధరకు విక్రయించాలని పథకం వేశాడు.


బిహార్‌కు చెందిన ఆయుధ విక్రేత సంపత్‌ యాదవ్‌ను సంప్రదించాడు. అత డి వద్ద తపంచా, రెండు దేశీవాళీ 0.32 ఎంఎం పిస్టళ్లు, 10 బుల్లెట్లు కొనుగోలు చేశాడు. వాటిని నగరానికి తీసుకొచ్చి విక్రయించాలని తిరుగుతున్నాడు. పాత నేరస్థులపై నిఘా పెట్టిన రాచకొండ ఎస్‌ఓటీ సిబ్బంది హరేకృష్ణ యాదవ్‌ ఆయుధాలు విక్రయించే పనిలో ఉన్నట్లు గుర్తించారు. జవహర్‌నగర్‌ అంబేడ్కర్‌నగర్‌లో అ నుమానాస్పదంగా తిరుగుతుండగా అదుపులోకి తీసుకుని రెండు దేశీవాళీ తుపాకులు, తపంచా, 10 బుల్లెట్లు, మొబైల్‌ స్వాధీనం చేసుకున్నామని సీపీ తెలిపారు.


ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!

ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?

ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం

ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్‌ కుంభకోణంపై నీలినీడలు !

Read Latest Telangana News and National News

Updated Date - Jan 16 , 2025 | 10:10 AM