Hyderabad: మహిళ ఆత్మహత్యాయత్నం.. కాపాడిన పోలీసులు
ABN, Publish Date - Jan 16 , 2025 | 08:32 AM
కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రైల్వేట్రాక్(Railway track)పై పడుకొని ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ మహిళలను బాలానగర్ పోలీసులు(Balanagar Police) రక్షించారు.
హైదరాబాద్: కుటుంబ కలహాలతో మనస్తాపం చెంది రైల్వేట్రాక్(Railway track)పై పడుకొని ఆత్మహత్యకు సిద్ధపడిన ఓ మహిళలను బాలానగర్ పోలీసులు(Balanagar Police) రక్షించారు. ఈ ఘటన బాలానగర్ పోలీస్ స్టేషన్ పరిధి ఫిరోజ్‌గూడ రైల్వేస్టేషన్‌లో మంగళవారం చోటు చేసుకుం ది. వివరాల్లోకి వెళ్తే... బాలానగర్ పోలీస్ స్టేషన్(Balanagar Police Station) పరిధి రాజూ కాలనీలో నివాసముండే మంగమ్మ(45) కుటుంబ కలహాలతో మనస్తాపానికి గురైంది.
ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: మద్యం మత్తులో విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి..
మంగళవారం ఇంట్లో చెప్పకుండా ఫిరోజ్‌గూడ రైల్వే స్టేషన్(Ferozguda Railway Station)కు చేరుకొని పట్టాలపై పడుకొని రైలు కోసం వేచి చూడసాగింది. గమనించిన స్టేషన్ సిబ్బంది వెంటనే బాలానగర్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పెట్రో మొబైల్-1 పోలీస్ కానిస్టేబుళ్లు రవీందర్, సుధాకర్‌రెడ్డి(Ravinder, Sudhakar Reddy) సమయ స్పూర్తితో వ్యవహరించి మహిళకు సర్ది చెప్పి ఆమె కుటుంబ సభ్యులను పిలిపించి అప్పగించారు. తగిన సమయంలో స్పందించి మహిళ ప్రాణాలు కాపాడిన కానిస్టేబుళ్లను బాలానగర్ సీఐ నర్సింహ్మరాజు అభినందించారు.
ఈవార్తను కూడా చదవండి: యువతిని రక్షించబోయి హత్యకు గురయ్యాడా?!
ఈవార్తను కూడా చదవండి: KTR: అరెస్టు చేస్తారా?
ఈవార్తను కూడా చదవండి: పుప్పాలగూడలో జంట హత్యల కలకలం
ఈవార్తను కూడా చదవండి: పవర్‌ప్లాంటు స్ర్కాప్ కుంభకోణంపై నీలినీడలు !
Read Latest Telangana News and National News
Updated Date - Jan 16 , 2025 | 08:32 AM