Hyderabad: మరీ ఇంత దారుణమా.. అర్ధరాత్రి ఓ వ్యక్తిని చుట్టుముట్టి.. దేవుడా..
ABN, Publish Date - Jan 05 , 2025 | 12:24 PM
తెలంగాణ: మియాపూర్(Miyapur) పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్ పేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు.
హైదరాబాద్: మియాపూర్ (Miyapur) పోలీస్ స్టేషన్ పరిధి హఫీజ్ పేట్‌లో దారుణ ఘటన వెలుగు చూసింది. ఓ వ్యక్తిని గుర్తుతెలియని కొంతమంది దుండగులు దారుణంగా హత్య చేశారు. హఫీజ్ పేట్ రైల్వేస్టేషన్ (Hafizpet Railway Station) సమీపంలో శనివారం అర్ధరాత్రి కొంతమంది ముఠా సభ్యులు ఓ గుర్తుతెలియని వ్యక్తిపై దాడి చేశారు. తీవ్రంగా కొట్టి గాయపరిచారు. అనంతరం బాధితుడి తలపై సిమెంట్ ఇటుకలతో పలుమార్లు మోది కిరాతకంగా హతమార్చారు.
Hyderabad: సంధ్య థియేటర్ ఘటన.. అల్లు అర్జున్‌కు మరోసారి నోటీసులు..
ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఇవాళ(ఆదివారం) ఉదయం మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే మియాపూర్ పోలీసులకు సమాచారం అందించారు. హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్‌తో హత్యకు సంబంధించి పూర్తి ఆధారాలు సేకరిస్తోంది. మృతుడి వయసు 30 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉంటుందని పోలీసులు తెలిపారు.
HYDRA: అక్రమ నిర్మాణాలపై కొరడా ఝుళిపిస్తున్న హైడ్రా..
ఘటనపై కేసు నమోదు చేసిన మియాపూర్ పోలీసుల దర్యాప్తు చేపట్టారు. మృతుడు ఎవరూ, అతడిని ఎందుకు హత్య చేశారనే కోణంలో విచారణ చేపట్టారు. అలాగే దుండగులు ఎవరు, హత్యకు గల కారణాలు ఏంటి? అనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నారు. అలాగే ఘటనకు సంబంధించి స్థానికుల నుంచి పలు వివరాలు సేకస్తున్నారు. హత్యకు సంబంధించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో ఎక్కడైనా రికార్డయ్యాయా? అనే విషయాలను సైతం పరిశీలిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
ఈ వార్తలు కూడా చదవండి:
Chicken Price: తెలుగు రాష్ట్రాల్లో చికెన్ ధరలు ఎలా ఉన్నాయంటే..
Weather Report: ఏపీని వణికిస్తున్న చలిపులి.. పరిస్థితి ఎలా ఉందంటే..
Updated Date - Jan 05 , 2025 | 12:26 PM