Share News

Hyderabad: ఆ ఇంజెక్షన్‌ వల్లే చనిపోయాడు..

ABN , Publish Date - Apr 16 , 2025 | 10:15 AM

ఆ ఇంజెక్షన్‌ వల్లే తమ వ్యక్తి చనిపోయాడు అతని బంధువులు ఆరోపిస్తున్నారు. ఆయాసంగా ఉందని ఆసుపత్రికి వస్తే రెండురోజులు ఆస్పత్రిలోనే ఉంచుకుని ఆయా చెకప్‏లు చేసి చివరకు ప్రాణమే లేకుండా చేశారని వారు ఆరోపించారు.

Hyderabad: ఆ ఇంజెక్షన్‌ వల్లే చనిపోయాడు..

హైదరాబాద్: ఆస్పత్రిలో చికిత్స నిమిత్తం చేరిన వ్యక్తి మృతి చెందాడు. అక్కడి వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్‌ వికటించడం వల్లే అతడు మృతి చెందాడంటూ బంధువులు ధర్నా చేశారు. కార్వాన్‌ భాంజావాడిలో నివాసం ఉండే ఎల్లయ్య ఆయాసంగా ఉందని లంగర్‌హౌస్‌ హైకేర్‌ ఆస్పత్రి(Langerhouse High Care Hospital)కి చెకప్‌ కోసం మంగళవారం వెళ్లాడు. అక్కడి వైద్యులు ఈసీజీ తీసి 24 గంటలు అబ్జర్వేషన్‌లో ఉంచాలన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Hyderabad: రేటింగ్స్‌, రివ్యూలకు రోజుకు రూ.8 వేలు


city1.jpg

కాసేపటి తర్వాత అతడి ఆరోగ్యం మరింత క్షీణించడంతో తమ వద్ద కార్డియో స్పెషలిస్టు లేరని వేరే ఆస్పత్రికి తీసుకెళ్లాలని రోగి బంధువులకు సూచించారు. అంతలోనే సదరు వ్యక్తి మృతిచెందాడు. దాంతో ఆస్పత్రి ఎదుట మృతుడి బంధువులు ధర్నా నిర్వహించారు. వైద్యులు ఇచ్చిన ఇంజెక్షన్‌ వికటించడం వల్లే ఎల్లయ్య మృతి చెందాడని ఆరోపించారు.


ఈ వార్తలు కూడా చదవండి

చేతనైనంత కాలం చేయాలి పని

సన్న బియ్యం మన బ్రాండ్‌

పార్టీ లైన్‌ దాటొద్దు

అలా అయితే.. రాజకీయాల నుంచి తప్పుకుంటా..

ఫస్ట్ టైం తెలుగులో...

Read Latest Telangana News and National News

Updated Date - Apr 16 , 2025 | 10:15 AM