Hyderabad: 3 తుపాకులకు రూ.6 లక్షలు...
ABN, Publish Date - Feb 07 , 2025 | 09:24 AM
వారం క్రితం గచ్చిబౌలి(Gachibowli)లో పోలీసులపై కాల్పులకు పాల్పడిన మోస్టు క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసులో అతని ఇద్దరు అనుచరులు రవి అలియాస్ రాహుల్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రంజిత్(Ravi alias Rahul, software employee Ranjith)ను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు.

- పోలీసులపై కాల్పుల ఘటనలో విచారణ ముమ్మరం
- ‘బత్తుల’ అనుచరుల అరెస్ట్
- తుపాకుల కొనుగోలుకు సహకరించిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగి
- తుపాకులు అమ్మిన వ్యక్తి కోసం గాలింపు
హైదరాబాద్ సిటీ: వారం క్రితం గచ్చిబౌలి(Gachibowli)లో పోలీసులపై కాల్పులకు పాల్పడిన మోస్టు క్రిమినల్ బత్తుల ప్రభాకర్ కేసులో అతని ఇద్దరు అనుచరులు రవి అలియాస్ రాహుల్, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి రంజిత్(Ravi alias Rahul, software employee Ranjith)ను సైబరాబాద్ పోలీసులు గురువారం అరెస్ట్ చేశారు. వీరిద్దరూ తరచుగా ప్రభాకర్‌తో తిరుగుతూ జల్సాలు చేస్తూ, లగ్జరీ జీవితాన్ని అనుభవించేవారిని పోలీసులు గుర్తించారు.
ఈ వార్తను కూడా చదవండి: Madhapur: పటిష్ట భద్రతకు ప్రైవేట్ సంస్థలు సహకరించాలి..
రంజిత్ సహకారంతోనే..
తుపాకుల కొనుగోలుపై ప్రభాకర్‌ను విచారణ చేయగా.. రంజిత్ సహకారంతోనే బిహార్‌కు వెళ్లి అక్కడ మొత్తం 3 తుపాకులు కొనుగోలు చేసినట్లు తేలింది. వాటి కొనుగోలుకు రెండుసార్లు బిహార్ వెళ్లిన ప్రభాకర్, రంజిత్.. తుపాకుల కోసం రూ. 6లక్షల వరకు ఖర్చు చేసినట్లు తెలిసింది. అయితే, సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేస్తున్న రంజిత్‌కు బిహార్‌లో తుపాకులు అమ్మే అన్సుతో ఎలా పరిచయం ఏర్పడింది..? ఈ అన్సు ఎవరు..? బిహార్‌లో ఉన్న అన్సు వద్దకు ప్రభాకర్‌ను రంజిత్ ఎలా తీసుకెళ్లాడు అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రంజిత్ ఇచ్చిన సమాచారం మేరకు అన్సును పట్టుకోవడానికి సీసీఎస్ ప్రత్యేక టీమ్ బిహార్ వెళ్లినట్లు తెలిసింది.
కాల్పుల సమయంలో రెండు తుపాకులు..
పోలీసులపై కాల్పులకు పాల్పడిన సమయంలో క్రిమినల్ ప్రభాకర్ వద్ద రెండు తుపాకులు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఒకవేళ పోలీసులు ఎదురు కాల్పులకు పాల్పడితే తనను తాను రక్షించుకోవడానికి రెండు తుపాకులు వెంట తెచ్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. అయితే సీసీఎస్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి నిందితుడిని పట్టుకున్న వెంటనే ప్రభాకర్ తన వద్ద ఉన్న తుపాకీతో కానిస్టేబుల్ చాతీపై తుపాకీ పెట్టాడు. రెప్పపాటులో అతని చేయిని కానిస్టేబుల్ మెలితిప్పడంతో బుల్లెట్ కాలి పాదంలోకి దూసుకెళ్లింది. లేదంటే ఆ బుల్లెట్ కానిస్టేబుల్ వెంకట్‌రెడ్డి గుండెను చీల్చేదని పోలీసులు తెలిపారు.
ఐడెంటిటీని గుర్తించకుండా..
క్రిమినల్ ప్రభాకర్ తనకు అవసరమైన సెల్‌ఫోన్, బ్యాంకు ఖాతాలు, ఇతర అవసరాలకు అవసరమైన అన్ని ధ్రువపత్రాలు రవి, రంజిత్‌వే వినియోగించేవాడని పోలీసుల విచారణలో తేలింది. ప్రభాకర్ తన ఐడెంటిటీని ఎక్కడా గుర్తించకుండా ముఖానికి మాస్క్ పెట్టుకునేవాడని, స్కోడా కారును సైతం రంజిత్ పేరుతోనే కొనుగోలు చేశాడని పోలీసుల విచారణలో తేలింది. తానొక బిగ్‌షాట్‌ను అని చెప్పుకునే ప్రభాకర్ విచ్చలవిడిగా డబ్బులు ఖర్చు చేస్తుండటంతో స్నేహితులు సైతం అతను ఏం చెబితే అది చేసేవారు.
ఈవార్తను కూడా చదవండి: Mettuguda: ఇంట్లో తల్లి, తనయుడికి కత్తిపోట్లు
ఈవార్తను కూడా చదవండి: Peddapalli: మొదట పరిషత్ ఎన్నికలకే మొగ్గు
ఈవార్తను కూడా చదవండి: ఆ రోజు నుంచే ప్రభుత్వ పథకాల జాతర
ఈవార్తను కూడా చదవండి: బస్సు టైరు పేలి ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు మృతి
Read Latest Telangana News and National News
Updated Date - Feb 07 , 2025 | 09:24 AM