Hyderabad: తప్పించుకునేందుకు.. గొంతు కోసుకున్న దొంగ
ABN, Publish Date - Jan 14 , 2025 | 06:59 AM
చోరీ కేసులో పట్టుకునేందుకు వచ్చిన కానిస్టేబుల్ నుంచి తప్పించుకునేందుకు ఓ దొంగ బ్లేడుతో గొంతు, చేతులు కోసుకున్న ఉదంతమిది..! ఈ సంఘటన బోరబండ(Borabanda) ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది.
- పరిస్థితి విషమం
హైదరాబాద్: చోరీ కేసులో పట్టుకునేందుకు వచ్చిన కానిస్టేబుల్ నుంచి తప్పించుకునేందుకు ఓ దొంగ బ్లేడుతో గొంతు, చేతులు కోసుకున్న ఉదంతమిది..! ఈ సంఘటన బోరబండ(Borabanda) ఠాణా పరిధిలో వెలుగులోకి వచ్చింది. విశ్వసనీయవర్గాల సమాచారం ప్రకారం.. బోరబండ సైట్-3లో నివసించే థామస్ ఫ్యాబ్రికేషన్ పనులు చేస్తుంటారు. క్రిస్మస్, కొత్తసంవత్సరం సందర్భంగా ఆయన కుటుంబ సభ్యులతో కలిసి జోగిపేటకు వెళ్లారు. ఈనెల 7వ తేదీన తిరిగి వచ్చి చూడగా.. ఇంటి తాళాలు పగులగొట్టి ఉన్నాయి.
ఈ వార్తను కూడా చదవండి: Suicide Case: పోలీసులకు సవాల్‌గా మారిన ముగ్గురు మృతి కేసు
లోనికి వెళ్లి చూడగా.. అల్మారాలో వస్తువులు చిందరవందరగా పడి ఉన్నాయి. చెవి కమ్మలు, మాటీలు, ఉంగరాలు, రూ.50వేలు చోరీ అయినట్లు గుర్తించి, బోరబండ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు.. సీసీటీవీ ఫుటేజీ(CCTV footage)ని పరిశీలించగా.. మహమ్మద్ హాషం అనే దొంగ ఈ చోరీకి పాల్పడ్డట్లు నిర్ధారణ అయ్యింది. తప్పించుకుతిరుగుతున్న హాషంను పట్టుకునేందుకు ప్రత్యేక బృందాలు ఏర్పాటవ్వగా..
క్రైమ్ కానిస్టేబుల్ ఒకరు ఈనెల 12న నిందితుడిని గుర్తించి, అరెస్టు చేసేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య పెనుగులాట జరిగింది. అంతలో హాషం తన జేబులోంచి బ్లేడ్ తీసి.. గొంతు కోసుకున్నాడు. చేతులపైనా కోసుకోవడంతో తీవ్ర రక్తస్రావమైంది. దాంతో సదరు కానిస్టేబుల్ అతణ్ని ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం హాషం పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. దీనిపై వివరణ కోరేందుకు ‘ఆంధ్రజ్యోతి’ యత్నించగా.. పోలీసులు స్పందించడం లేదు.
ఈవార్తను కూడా చదవండి: గాలిపటం ఎగురవేస్తూ విద్యుదాఘాతంతో బాలుడి మృతి
ఈవార్తను కూడా చదవండి: పండుగ నాడు... పోషక శోభ
ఈవార్తను కూడా చదవండి: MLC K Kavitha: పోచారంపై నిప్పులు చెరిగిన కవిత
ఈవార్తను కూడా చదవండి: బోధన్‌లో రెచ్చిపోయిన యువకులు.. మరో వర్గంపై కత్తులతో దాడి..
Read Latest Telangana News and National News
Updated Date - Jan 14 , 2025 | 06:59 AM