TTD: పరకామణిలో టీటీడీ ఉద్యోగి చేతివాటం..

ABN, Publish Date - Mar 19 , 2025 | 11:15 AM

తిరుమల తిరుపతి దేవస్థానానికి అనుబంధంగా ఉన్న చెన్నై పరకామణిలో ఓ ఉద్యోగి తన చేతివాటాన్ని ప్రదర్శించాడు. భక్తులు సమర్పించే కానుకలపై అతనికి దురాశ పుట్టింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

TTD: పరకామణిలో టీటీడీ ఉద్యోగి చేతివాటం..

- అత్యంత విలువైన డాలర్ల నోట్లను నొక్కేసిన సీనియర్‌ అసిస్టెంట్‌

- వాటి స్థానంలో తక్కువ విలువైన వాటిని చేర్చిన వైనం

- పోలీసులకు అధికారుల ఫిర్యాదు

తిరుమల: చెన్నై శ్రీవారి ఆలయంలో టీటీడీ(TTD) ఉద్యోగే చేతివాటం ప్రదర్శించాడు. దాదాపు రూ.6.74 లక్షల విలువ చేసే విదేశీ కరెన్సీ నోట్లను మాయం చేసినట్టు అధికారులు తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రస్తుతం తిరుమల వైకుంఠం క్యూకాంప్లెక్స్‌లో పనిచేస్తున్న కృష్ణకుమార్‌ చెన్నై శ్రీవారి ఆలయం, సమాచార కేంద్రం సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. గతేడాది అక్టోబరు 6వ తేదీన జరిగిన పరకామణి రిజిస్టర్‌లో కాలం సమస్య ఉందనే కారణంతో 950 విదేశీ కరెన్సీ నోట్లను నమోదు చేయలేదు.

ఈ వార్తను కూడా చదవండి: Electricity Department: విద్యుత్ శాఖ షాకింగ్ డెసిషన్.. వేల కనెక్షన్లు కట్..


తిరిగి తర్వాత పరకామణి లెక్కింపు సమయంలో తిరిగి విదేశీ కరెన్సీ నోట్ల సంఖ్యను నమోదు చేశారు. అయితే గత పరకామణి లెక్కింపు జాబితాను, తాజా జాబితాను పోల్చిచూసినప్పుడు తేడా ఉన్నట్టు అధికారులు గుర్తించారు. నిజానికి 950 నోట్లలో అఽధిక విలువైన డాలర్‌ నోట్లను మార్పిడి చేసి తక్కువ డాలర్‌ నోట్లను ఆస్థానంలో చేర్చినట్టు విజిలెన్స్‌ విచారణలో తేలింది.


నోట్ల సంఖ్య కరెక్ట్‌గానే ఉన్నట్టు చూపించినప్పటికీ విలువను మాత్రం కృష్ణకుమార్‌ తన జేబులో వేసుకున్నట్టు విజిలెన్స్‌ అధికారులు ఫిబ్రవరి నెలలో జరిగిన విచారణలో గుర్తించారు. దాదాపు రూ.6.74 లక్షల కరెన్సీ చోరీ చేసినట్టు తమ నివేదికలో పేర్కొన్నారు. ఈక్రమంలో విజిలెన్స్‌ నివేదిక ఆధారంగా చెన్నై శ్రీవారి ఆలయ ఏఈవో పార్థసారధి ఇటీవల తిరుమల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కాగా, ఇప్పటికే కృష్ణకుమార్‌ను టీటీడీ సస్పెండు చేస్తూ నిర్ణయం తీసుకుంది.


ఈ వార్తలు కూడా చదవండి:

సమాధానాలు చెప్పలేక ప్రశ్నోత్తరాలను ఎత్తేస్తారా?

కేసీఆర్‌కు అసెంబ్లీని ఫేజ్ చేసే దమ్ములేదు

రేవంత్ ప్రభుత్వంలో ఆ స్కీమ్ బాగుంది

పులి సంచారం అంటూ వార్తలు.. నిర్ధారించని అధికారులు

Read Latest Telangana News and National News

Updated Date - Mar 19 , 2025 | 11:16 AM