Share News

Shocking: భర్త ఇంటిని అమ్మి ప్రియుడితో పరార్.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. తమిళనాడులో షాకింగ్ ఘటన..

ABN , Publish Date - Feb 06 , 2025 | 02:29 PM

భర్తను మోసం చేసి ప్రియుడితో పారిపోతున్న భార్యలకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ మహిళ తన భర్త కిడ్నీని అమ్మేసి ప్రియుడితో పారిపోయిన ఘటనను మరువకముందే తమిళనాడులో అలాంటిదే మరో ఘోరం చోటు చేసుకుంది.

Shocking: భర్త ఇంటిని అమ్మి ప్రియుడితో పరార్.. ఆత్మహత్య చేసుకున్న భర్త.. తమిళనాడులో షాకింగ్ ఘటన..
Wife cheats Husband

భర్తను మోసం చేసి ప్రియుడితో పారిపోతున్న భార్యలకు సంబంధించిన ఘటనలు ఇటీవలి కాలంలో పెరిగిపోతున్నాయి. ఇటీవల ఓ మహిళ తన భర్త కిడ్నీని అమ్మేసి ప్రియుడితో పారిపోయిన ఘటనను మరువకముందే తమిళనాడు (TamilNadu)లో అలాంటిదే మరో ఘోరం చోటు చేసుకుంది. భర్త (Huband) ఇంటిని అమ్మి తన ప్రియుడితో కలిసి ఓ వివాహిత పారిపోయింది. ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన ఆమె భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. తమిళనాడులోని కన్యాకుమారి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. (Wife cheats Husband)


కన్యాకుమారి జిల్లా విల్లుకురి చెందిన బెంజిమన్ (47) అనే వ్యక్తి సౌదీ అరేబియాలో ఉద్యోగం చేసి డబ్బులు సంపాదిస్తున్నాడు. తమిళనాడులో ఉంటున్న భార్య సునీత (45)కు డబ్బులు పంపించేవాడు. సునీత తన తల్లి ఇంట్లో నివసించేది. సునీత సూచనల మేరకు బెంబిమన్ తన పూర్వీకుల ఇల్లును బెంజమిన్ అమ్మేసి దక్షిణ మణక్కావిళైలో తన భార్య పేరుతో కొత్త ఇల్లు కొనుగోలు చేశాడు. ఇటీవల కొన్ని రోజులుగా ఆ దంపతులు మధ్య గొడవలు జరుగుతున్నాయి. అప్పట్నుంచి ఆమె బెంజిమన్‌కు ఫోన్ చేయడం మానేసింది. ఆమె వివరాలేవీ బెంజిజమన్‌కు తెలియలేదు.


భార్య గురించి తెలుసుకునేందుకు బెంజిమన్ ఇండియాకు వచ్చాడు. అయితే తాను కొత్తగా కొనుగోలు చేసిన ఇంటిని సునీత అమ్మేసినట్టు తెలుసుకుని నివ్వెరపోయాడు. తిరువందికరైకి చెందిన సైజు అనే వ్యక్తితో కలిసి ఆమె ఉంటున్నట్టు తెలుసుకున్నాడు. భార్య చేసిన మోసంపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. భార్య మోసం చేయడంతో తీవ్ర మానసిక వేదనకు గురై విషం తాగి ఆత్మహ్యత చేసుకున్నాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు.

మరిన్ని నేర వార్తలు కోసం క్లిక్ చేయండి..

Updated Date - Feb 06 , 2025 | 02:29 PM