Share News

‘బిరుదురాజు’ శత జయంతి సదస్సు

ABN , Publish Date - Apr 16 , 2025 | 05:35 AM

తెలుగు జానపద విజ్ఞాన రంగంలో విశేషమైన కృషి చేసిన ఆచార్య బిరుదురాజు రామరాజు పరిశోధకుడిగా, పండితుడిగా, ఆచార్యుడిగా సుప్రసిద్ధుడు. ఆయన శతజయంతి సందర్భంగా ...

‘బిరుదురాజు’ శత జయంతి సదస్సు

తెలుగు జానపద విజ్ఞాన రంగంలో విశేషమైన కృషి చేసిన ఆచార్య బిరుదురాజు రామరాజు పరిశోధకుడిగా, పండితుడిగా, ఆచార్యుడిగా సుప్రసిద్ధుడు. ఆయన శతజయంతి సందర్భంగా ‘ఆచార్య బిరుదురాజు రామరాజు శతజయంతి సదస్సు’ను తెలంగాణ సాహిత్య అకాడమీ సౌజన్యంతో ఏప్రిల్‌ 16న ఖమ్మం ఎస్‌ఆర్‌బిజిఎన్‌ఆర్‌ ప్రభుత్వ ఆర్ట్స్‌, సైన్స్‌ కళాశాల తెలుగు విభాగం ఒకరోజు జాతీయ సదస్సును నిర్వహిస్తున్నది. ఇందులో తెలంగాణ సాహిత్య అకాడమీ కార్యదర్శి డా. నామోజు బాలాచారి, ఆచార్య బన్న అయిలయ్య, డా. గన్నమరాజు గిరిజా మనోహర్‌బాబు, డా. యాకూబ్‌, డా. బి. రాములు, కపిల భారతి, డా. మంథని శంకర్‌, డా. వాహెద్‌, డా. మొహ్మద్‌ జాకీరుల్లా, డా. సీతారాం తదితరులు పాల్గొంటారు. ఈ సదస్సులో పరిశోధనా పత్రాల సమర్పణ, రామరాజు సాహిత్యసేవపై ప్రసంగాలు ఉంటాయి.

– డా. పి. రవికుమార్‌

సదస్సు కన్వీనర్‌

ఈ వార్తలు కూడా చదవండి:

Aghori Srinivas: అఘోరీ శ్రీనివాస్‌పై సంచలన ఆరోపణలు.. తనను పెళ్లి చేసుకున్నాడంటూ..

MLC Kavitha: కాంగ్రెస్ నేతలను హెచ్చరించిన ఎమ్మెల్సీ కవిత.. పింక్ బుక్ పేరు చెప్తూ..

CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డికి తప్పిన ప్రమాదం.. అసలు విషయం ఇదే..

Updated Date - Apr 16 , 2025 | 05:36 AM