ఈ వారం వివిధ కార్యక్రమాలు 18-02-2025
ABN , Publish Date - Feb 17 , 2025 | 12:17 AM
పల్లా కవితా పురస్కారం, పెన్నా సాహిత్య పురస్కారం, అనువాద నవలల ఆవిష్కరణ, వట్టికోట నవలపై సదస్సు, వేటకథలపై సదస్సు, కొలకలూరి పురస్కారాల ఫలితాలు...

పల్లా కవితా పురస్కారం
‘పల్లా జాతీయ కవితా పురస్కారం- 2025’ కోసం తెలుగు కవులు తమ కవితా సంపుటాలను పంపగోరుతున్నాం. ఉత్తమ కవితా సంపుటి కవికి రూ.7500 నగదు బహుమతి, ప్రశంసా పత్రం, జ్ఞాపిక, శాలువాతో సత్కారం ఉంటుంది. మీ వచన కవితా సంపుటాలు మూడు కాపీలను మార్చి 15లోపు చిరునామా: పల్లా కృష్ణ, CSSR & SRRM డిగ్రీ పీజీ కళాశాల, 13–-522, రెడ్డి కాలనీ, కమలాపురం – 516289, వైఎస్ఆర్ కడప జిల్లా, ఆంధ్రప్రదేశ్‌కు పంపాలి. ఫోన్: 9985193868.
పల్లా కృష్ణ
పెన్నా సాహిత్య పురస్కారం
పెన్నా రచయితల సంఘం, నెల్లూరు ఇచ్చే పెన్నా సాహిత్య పురస్కారానికి జనవరి 2023 నుంచి డిసెంబర్ 2024 వరకు ముద్రితమైన కవితా సంపుటాలు మూడు కాపీలను మార్చ్ 31 లోగా పంపాల్సిన చిరునామా: గోవిందరాజు సుభద్రాదేవి, ఇం.నెం.26–15–494, స్నేహా నగర్, కొండాయపాలెం రోడ్, నెల్లూరు – 524004. వివరాలకు ఫోన్: 9848627158.
పెన్నా రచయితల సంఘం
అనువాద నవలల ఆవిష్కరణ
చింతపట్ల సుదర్శన్ అనువాదం చేసిన ముల్క్‌రాజ్ ఆనంద్ ‘-అంటరానివాడు’, ఆర్.కె. నారాయణ్ ‘మాల్గుడి’ నవలల- ఆవిష్కరణ సభ ఫిబ్రవరి 17 సా.6 గంటలకు రవీంద్రభారతి, హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ పుస్తకాలను ఎస్.ఎమ్. ప్రాణ్‌రావు, ఆర్.వి రామారావు ఆవిష్కరి స్తారు. అధ్యక్షత కవి యాకూబ్. మామిడి హరికృష్ణ, కె.పి. అశోక్ కుమార్, ఏనుగు నరసింహారెడ్డి, కె. ఆనందాచారి, కొండపల్లి నీహారిణి ప్రసంగిస్తారు.
పాలపిట్ట బుక్స్
వట్టికోట నవలపై సదస్సు
తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో వట్టికోట ఆళ్వారు స్వామి ‘ప్రజల మనిషి’ నవల పై ‘అజరామర అక్షరం’ పేరిట పరామర్శ సదస్సు ఫిబ్రవరి 23 ఉ.10గంటలకు కరీంనగర్ ఫిలిం భవన్‌లో జరుగుతుంది. ప్రధాన వక్త సంగిశెట్టి శ్రీనివాస్. నగు నూరి శేఖర్, అన్నవరం దేవేం దర్, గాజోజు నాగభూ షణం ఇతర వక్తలుగా ప్రసంగిస్తారు.
సి. వి. కుమార్
వేటకథలపై సదస్సు
సాహిత్య అకాడెమీ–-స్ఫూర్తి సాహితీ సమాఖ్య, యానాం సంయుక్త నిర్వహణలో ‘వేట కథలు’ సదస్సు ఫిబ్రవరి 23 తేదీ ఉ.10గంటల నుంచి సర్వశిక్షా అభియాన్ సమావేశ మందిరం, హైస్కూల్ రోడ్, యానాంలో జరుగుతుంది. స్వాగతం చింతకింది శ్రీనివాసరావు, అధ్యక్షోపన్యాసం సి. మృణాళిని, ముఖ్య అతిథి ఆర్. మునిస్వామి, గౌరవ అతిథి దాట్ల దేవదానం రాజు. అల్లం శేషగిరిరావు కథలపై వాసి రెడ్డి నవీన్, జె.పి. వైద్య కథలపై అవధానుల మణిబాబు, పతంజలి కథలపై జె. నీరజ, పూసపాటి కృష్ణరాజు కథలపై మందలపర్తి కిషోర్, ఇతర రచయితలు రాసిన వేట కథలపై అద్దేపల్లి ప్రభు ప్రసంగిస్తారు.
సాహిత్య అకాడెమీ
కొలకలూరి పురస్కారాల ఫలితాలు
కొలకలూరి భాగీరథీ కవితా పురస్కారానికి జూకంటి జగన్నాథం (‘ఒక కప్పు చాయ్ – నాలుగు మెసేజ్‌లు’), కొలకలూరి విశ్రాంతమ్మ నాటక పురస్కా రానికి టేకుమళ్ళ వెకంటప్పయ్య (‘స్వర్గాదపి గరీ యసీ’), కొలకలూరి రామయ్య పరిశోధన పురస్కారా నికి గడ్డం మోహన్ రావు (‘చిందోళ్ళ చరిత్ర, సంస్కృతి –సాహిత్యం’) ఎంపికయ్యారు. వీరు ఒక్కొకరూ రూ.15 వేల నగదు బహుమతితో సత్కారాన్ని అందుకుం టారు. ఈ కార్యక్రమం ఫిబ్రవరి 26న పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం, నాంపల్లి, హైదరాబాద్‌లో జరుగుతుంది.
కొలకలూరి ఇనాక్
Minister Nara Lokesh: ప్రయాగ్ రాజ్‌కు మంత్రి నారా లోకేశ్.. షెడ్యూల్ ఇదే..
Road Accident: దారుణం.. నిర్లక్ష్యంగా బస్సు నడిపిన డ్రైవర్.. చివరికి బాలుడి పరిస్థితి..