Share News

Swimming Pools: స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొడుతున్నారా.. మీ కళ్లు ఇక అంతే..

ABN , Publish Date - Apr 07 , 2025 | 07:58 AM

Swimming Pools: ఎండాకాలం వచ్చిందంటే చాలు నగరాల్లోని చాలా మంది స్విమ్మింగ్ పూల్స్‌కు క్యూ కడుతుంటారు. గంటలు, గంటలు నీళ్లలోనే గడిపేస్తుంటారు. ఇలా చేయటం వల్ల కళ్లు ప్రమాదంలో పడతాయని డాక్టర్లు చెబుతున్నారు. కంటి ఇన్‌ఫెక్షన్లు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు.

Swimming Pools: స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొడుతున్నారా.. మీ కళ్లు ఇక అంతే..
Eye Infection

ఏప్రిల్ మొదలైన నాటినుంచి ఎండలు విపరీతంగా పెరిగిపోయాయి. బయటకు వెళ్లాలంటే భయపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎండలు 40 డిగ్రీలు పైనే ఉంటున్నాయి. కొంతమంది జనం ఎండలు తట్టుకోలేక శరీరాన్ని చల్లబరిచే వాటి కోసం ఎగబడుతున్నారు. ఈ నేపథ్యంలోనే పుచ్చ కాయలకు, టెంకాయలకు గిరాకీ బాగా పెరిగిపోయింది. మరికొంత మంది ఈతను ఆశ్రయిస్తున్నారు. పల్లెటూళ్లలో ఉండేవారి సంగతి పక్కన పెడితే.. పట్టణాలు, నగరాల్లో ఉండేవారు స్విమ్మింగ్ పూల్స్‌కు వెళుతున్నారు. గంటలు, గంటలు నీళ్లలోంచి బయటకు రావటం లేదు. అయితే, ఇలా స్విమ్మింగ్ పూల్స్‌లో ఈత కొట్టడం.. అది కూడా గంటల తరబడి ఆ నీళ్లలోనే ఉండటం ప్రమాదకరమని డాక్టర్లు చెబుతున్నారు.


కళ్ల సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చెన్నైకి చెందిన డాక్టర్ అనుపమ మాట్లాడుతూ.. ‘ స్విమ్మింగ్ పూల్‌లోని నీళ్లు శుభ్రంగా ఉండేందుకు అందులో పెద్ద మొత్తంలో క్లోరీన్ కలుపుతారు. ఆ క్లోరీన్ వల్ల కంటి ఇన్‌ఫెక్షన్‌లు వచ్చే అవకాశం ఉంది. దీన్నే స్విమ్మర్స్ ఐస్ అని అంటారు. క్లోరోమైన్ అనే కెమికల్ కంటి సమస్యలు తెస్తుంది. ఆ కెమికల్ మన చెమట, యూరిన్, చర్మపు పొట్టు, ఆయిల్ లేక ఇతర కాస్మోటిక్స్‌తో కలిసినపుడు రియాక్షన్ జరుగుతుంది. కళ్లు ఎర్రగా మారటం.. వాపు రావటం.. కళ్లను ఎవరో పిన్నుతో గుచ్చుతున్నట్లు నొప్పి రావటం.. కళ్లు సరిగా కనిపించకపోవటం.. కళ్లలోంచి విపరీతంగా నీళ్లు కారటం వంటి సమస్యలు వస్తాయి. కళ్లను అదే పనిగా రుద్దితే సమస్య మరింత పెరిగే అవకాశం ఉంది.


కార్నియా దెబ్బ తినే అవకాశం కూడా ఉంది. ఇలాంటి టైంలో కళ్లలోకి బ్యాక్టీరియా ప్రవేశించి కంజక్టివిటీస్ వచ్చే అవకాశం ఉంది. దీన్ని డాక్టర్ల చికిత్సతో మాత్రమే నయం చేయగలము. స్విమ్మింగ్ పూల్‌లో ఈత కొట్టినా కళ్లకు ఏమీ కాకుండా ఉండాలంటే.. స్విమ్మింగ్ కంటి అద్దాలు వేసుకోండి. గంటలు, గంటలు నీటిలో ఈత కొట్టకండి. స్విమ్మింగ్ పూల్స్ ఓనర్లు నీళ్లలో క్లోరీన్‌ను తగిన మోతాదులోనే వేయాలి. ఈత కొట్టే ముందు.. తర్వాత కూడా శుభ్రంగా స్నానం చేయాలి. కాంటాక్ట్ లెన్స్ తీసేయాలి. కంటి సమస్యలు ఉన్నవారు నీళ్లలోకి దిగకపోవటమే మంచిది. ఒక వేళ కళ్లలో దురదగా ఉంటే వాటిని అదే పనిగా రుద్దకండి. కళ్లకు సర్జరీ చేసుకున్న తర్వాత స్విమ్మింగ్ పూల్‌కు అస్సలు వెళ్లకండి’ అని అన్నారు.


ఇవి కూడా చదవండి:

Bhadrachalam: భద్రాద్రి రామయ్యకు మహా పట్టాభిషేకం

Saharanpur Tragedy: ప్రియురాలి కోసం ప్రాణం తీసుకున్నాడు.. ఆమెకు కన్నీళ్లు మిగిల్చాడు..

Updated Date - Apr 07 , 2025 | 07:58 AM