Ice Water: వేసవిలో ఐస్ వాటర్ తెగ తాగేస్తున్నారా.. ఈ 5 సమస్యలు వస్తాయి జాగ్రత్త..
ABN , Publish Date - Apr 10 , 2025 | 05:37 PM
Side Effects Of Drinking Cool Water In Summer: ఎండల వేడి భరించలేక ఫ్రిజ్ లో ఉంచిన చల్లచల్లని ఐస్ వాటర్ తాగుతున్నారా. ఆగండాగండి. అసలే వేసవిలో డీహైడ్రేషన్ సహా ఎన్నెన్నో సమస్యలు. ఈ సమయంలో అదే పనిగా చిల్లింగ్ వాటర్ తాగారో.. మీరు ఈ 5 సమస్యల బారిన పడటం ఖాయం.

Drinking Cool Water In Summer Health Risks: వేసవి కాలం ప్రారంభం కాగానే ప్రజలు చల్లని పదార్థాలు తీసుకోవడం ప్రారంభిస్తారు. మండుతున్న ఎండల్లో తిరిగి తిరిగి అలసిపోయి ఇంటికి రాగానే దాహం తీర్చుకునేందుకు నేరుగా ఫ్రిజ్ దగ్గరికే వెళ్లి రకరకాల పానీయాలు తాగుతారు. ఈ లిస్ట్‌లో చల్లని నీరు, లస్సీ, మజ్జిగ, రసం, కొబ్బరి నీళ్లు ఇలా ఎన్నో ఉంటాయి. ఎన్ని రకాలున్నా ప్రతి ఒక్కరూ దాహం తీర్చుకునేందుకు ఎక్కువగా తాగే పానీయం నీరే కదా. మిగతా కాలాలతో పోలిస్తే ఎండాకాలం తప్పకుండా ఫ్రిజ్ లో ఉంచిన నీళ్లను తాగడానికే ఇష్టపడతారు. ఈ నీరు తాగితే తక్షణమే శరీరం చల్లబడి తాజాదనం వస్తుంది. వేడి నుంచి ఉపశమనం కలుగుతుంది. కానీ, ఇదంతా తాత్కాలికమే. సమ్మర్‌లో ఐస్ వాటర్ తాగితే శరీరం మరింత వేడెక్కి డీ హైడ్రేషన్ సహా ఎన్నో సమస్యలు వస్తాయి.
శరీరాన్ని హైడ్రేటెడ్ గా ఉంచుకోవడానికి రోజుకు కనీసం 8-10 గ్లాసుల నీరు తాగాలి. కానీ కొంతమంది అదేపనిగా ఎండల్లో ఐస్ వాటర్ తాగుతూనే ఉంటారు. ఫ్రిజ్‌లో నుంచి చల్లటి నీరు లేదా ఐస్ తీసుకుని నీటిలో కలుపుకుంటూ ఉంటారు. ఈ నీరు తాగినప్పుడు అద్భుతంగానే అనిపించవచ్చు. కానీ అది మీ ఆరోగ్యానికి చాలా హానికరం. ఫలితంగా మీరు అనేక తీవ్రమైన ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవలసి రావచ్చు. ఐస్ వాటర్ తాగడం వల్ల కలిగే నష్టాలు ఇక్కడ ఉన్నాయి.
జీర్ణక్రియకు హానికరం: ఐస్ వాటర్ తాగడం వల్ల జీర్ణ సమస్యలు వస్తాయి. నిజానికి చల్లటి నీరు జీర్ణం కావడానికి చాలా సమయం పడుతుంది. ఇది ఆహారం జీర్ణమయ్యే ప్రక్రియకు ఆటంకం కలిగిస్తుంది. మీరు తినేటప్పుడు చల్లటి నీరు తీసుకుంటే ఆహారాన్ని జీర్ణం చేయడానికి బదులుగా శరీరం ఆ శక్తిని నీటి ఉష్ణోగ్రతను సాధారణ స్థితికి తెచ్చేందుకు ఉపయోగిస్తుంది. కాబట్టి ఆహారం తినేటప్పుడు ఎప్పుడూ చల్లటి నీరు తాగకూడదు.
గొంతు సమస్యలు: ఐస్ వాటర్ తాగడం వల్ల శరీరం నుంచి ఎక్కువ మొత్తంలో శ్లేష్మం ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గొంతు నొప్పి, కఫం, జలుబు, గొంతు వాపు వంటి సమస్యలు వస్తాయి. శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఎట్టిపరిస్థితుల్లోనూ ఐస్ వాటర్ తాగకూడదు.
తలనొప్పి: ఎండలో తిరిగి ఇంటికి రాగానే ఐస్ వాటర్ తాగడం వల్ల తలనొప్పి వస్తుంది. నిజానికి చల్లటి నీరు తాగడం వల్ల వెన్నెముక నరాలు చల్లబడతాయి. ఇది మెదడును ప్రభావితం చేస్తుంది. దీనివల్ల తలనొప్పి వస్తుంది. సైనస్ సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులు పొరపాటున కూడా ఐస్ వాటర్ తాగకూడదు. ఇది వారి పరిస్థితిని మరింత దిగజారుస్తుంది.
పైల్స్: మీరు ఎక్కువగా ఐస్ వాటర్ తాగుతూ ఉంటే, అది పైల్స్ కు కారణమవుతుంది. తీవ్రమైన చలిలో వస్తువులు గడ్డకట్టడం ప్రారంభిస్తాయి. అదేవిధంగా ఐస్ వాటర్ తాగడం వల్ల మలం గట్టిపడుతుంది. దీనివల్ల పైల్స్ వస్తాయి. ఎక్కువ చల్లటి నీరు తాగడం వల్ల పేగులో గాయాలు కూడా వస్తాయి. దీని కారణంగా మలంలో రక్తం పడటం, కడుపు నొప్పి వంటి సమస్యలను ఎదుర్కొవాల్సి రావచ్చు.
డీహైడ్రేషన్: ఐస్ వాటర్ తాగడం వల్ల డీహైడ్రేషన్ వస్తుందని తెలిస్తే మీరు ఆశ్చర్యపోవచ్చు. బాగా చల్లబడిన నీటిని కొద్దిగా తాగగానే దప్పిక తీరినట్లు అనిపిస్తుంది. ఈ కారణంగా తక్కువ నీరు తాగుతారు. ఇలా మీ శరీరాన్ని మీరే డీహైడ్రేట్ చేసుకున్నట్లు అవుతుంది.
ఐస్ వాటర్ ఆరోగ్యానికి చాలా హాని కలిగిస్తుంది. కాబట్టి వెంటనే ఈ నీళ్లను తాగడం మానేయండి. నీటిని ఎల్లప్పుడూ గది ఉష్ణోగ్రత వద్ద తాగాలి. మీరు వేసవిలో చల్లటి నీరు తాగాలని అనుకుంటూ ఉంటే కుండలో చల్లబరచిన నీటిని తాగండి. ఆరోగ్యంగా ఉంటారు. అంతే కానీ నీటిలో ఐస్ జోడించడం లేదా ఫ్రీజర్‌లో ఉంచిన చల్లటి నీరు తాగడం వంటివి చేయకండి.
Read Also: Mouth Ulcer Tips: ఈ చిట్కాలతో.. ఒక్క పూటలోనే నోటి పూత సమస్య పరార్..
Kidney Stones: ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవాల్సిందే
Tea Effects: టీ తాగిన తర్వాత మీ కడుపు ఉబ్బిపోతుందా.. కారణం ఏమిటో తెలుసుకోండి