Share News

Lemon Grass Tea: బీపీ, షుగర్ ఉన్నవాళ్లు లెమన్ గ్రాస్ టీ తాగవచ్చా..

ABN , Publish Date - Apr 10 , 2025 | 04:58 PM

Lemon Grass Tea Benefits and Side Effects: పాలతో తయారుచేసే సాధారణ టీ, గ్రీన్ టీల కంటే నిమ్మ గడ్డితో చేసే టీని సహజ హెర్బల్ పానీయంగా పరిగణిస్తారు ఆరోగ్య నిపుణులు. కెఫీన్ లేని లెమన్ గ్రాస్ టీ తాగితే లెక్కలేనన్ని ఉపయోగాలు. మరి, బీపీ లేదా షుగర్ ఉన్నవారికి ఈ టీ తాగితే ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి. తాగొచ్చా.. తాగకూడదా..

Lemon Grass Tea: బీపీ, షుగర్ ఉన్నవాళ్లు లెమన్ గ్రాస్ టీ తాగవచ్చా..
Lemon Grass Tea Benefits and Side Effects

Lemon Grass Tea Benefits and Side Effects: ఈ రోజుల్లో ఆరోగ్యం, ఫిట్‌నెస్ గురించి శ్రద్ధ తీసుకునే వారి సంఖ్య పెరుగుతోంది. తినే, తాగే ప్రతి పదార్థం గురించి అవగాహన పెంచుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. ముఖ్యంగా సోషల్ మీడియా ద్వారా ఇన్‌ఫ్లూయెన్సర్లు చెప్పే టిప్స్ ఆచరణలో పెడుతున్నారు. అలా ఈ మధ్య ఫుడ్ అండ్ హెల్త్ వ్లోగర్స్ వల్ల లెమన్ గ్రాస్ టీ బాగా ట్రెండ్ అయింది. కెఫీన్ అసలే లేని ఈ హెర్బల్ టీ వల్ల బరువు ఆరోగ్యానికి మేలు చేకూరుస్తుందనేది వాస్తవమే. అయినప్పటికీ నిమ్మగడ్డితో చేసిన టీ అందరికీ ఇది సురక్షితమా.. కాదా.. అని కచ్చితంగా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది.


నిమ్మగడ్డి టీ ఉపయోగాలు

వేగంగా బరువు తగ్గేందుకు, జీర్ణక్రియ మెరుగుపర్చేందుకు లెమన్ గ్రాస్ టీలోని ఔషధ గుణాలు ఎంతో ఉపయోగపడుతాయి. ఇది తాగిన వెంటనే ఉత్సాహం వస్తుంది. డీ హెడ్రేషన్ సమస్య తొలగిపోతుంది. ఒత్తిడి తగ్గిపోయి హుషారుగా ఉంటారు. నిమ్మగడ్డిలోని విటమిన్ రోగనిరోగధశక్తిని పెంచి ఏ వ్యాధులు రాకుండా కాపాడుతుంది. ఇందులోని యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణాలు కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయపడతాయి. టిటాక్సిఫైయింగ్ గుణాల వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడి కాంతివంతంగా కనిపిస్తారు.


లెమన్ గ్రాస్ టీ అందరికీ సరిపడకపోవచ్చు. అది తెలియక సోషల్ మీడియాలో చూసి ఆలోచించకుండానే లెమన్ గ్రాస్ టీ తాగడం ప్రారంభిస్తే అది ఆరోగ్యానికి హానికరంగా మారవచ్చు. ముఖ్యంగా ఈ వ్యక్తులు దీన్ని తాగకూడదు.

1. ప్రెగ్నెన్సీ

గర్భిణీ స్త్రీలు లెమన్ గ్రాస్ టీ తాగితే గర్భాశయ సంకోచించి హానికరం కావచ్చు. రక్తపోటులో మార్పులు రావచ్చు. కాబట్టి, గర్భిణీ స్త్రీలు నిమ్మకాయ టీని నివారించాలి లేదా వైద్యుడిని సంప్రదించిన తర్వాత మాత్రమే దానిని తీసుకోవాలి. అలాగే పిల్లలకు పాలిచ్చే స్త్రీలు కూడా ఈ టీ తాగకూడదు.


2. తక్కువ రక్తపోటు

లెమన్‌గ్రాస్ టీ తాగితే శరీరంలోని మలినాలు మూత్ర విసర్జన ద్వారా తొలగిపోతాయి. ఇది శరీరం నుంచి అదనపు నీరు, సోడియంను బయటకు పంపడంలో సహాయపడుతుంది. కానీ, ఈ టీ డయాబెటిస్ ఉన్నవారికి ప్రమాదకరం. ఎందుకంటే ఇది రక్తపోటును మరింత తగ్గిస్తుంది. బలహీనత, తల తిరగడం, మూర్ఛ వంటి సమస్యలను కలిగిస్తుంది.


3. కిడ్నీ, కాలేయ సమస్యలు ఉన్నవారు

లెమన్‌గ్రాస్ టీ శరీరాన్ని డీటాక్సిఫైయింగ్ చేయడంలో సహాయపడుతుంది. అప్పటికే మూత్రపిండాలు లేదా కాలేయ సంబంధిత సమస్యలు ఉన్నవారికి మాత్రంఇది హానికరం.


4. మెడిసిన్స్

ఏవైనా వ్యాధులకు మందులు వాడుతున్నట్లయితే నిమ్మగడ్డితో చేసిన టీ తాగకపోవడమే మంచిది. ముఖ్యంగా మీరు మధుమేహం, రక్తపోటు, రక్తం పలుచబరిచే మందులు లేదా మూత్రపిండాలకు సంబంధించిన మందులు తీసుకుంటుంటే.. అది వాటి ప్రభావాన్ని తగ్గించవచ్చు లేదా పెంచవచ్చు. కాబట్టి, వైద్యుడి సలహా లేకుండా దీనిని తీసుకోకూడదు.


5. అలెర్జీలు

కొంతమందికి నిమ్మగడ్డి అలెర్జీ కావచ్చు. చర్మంపై దద్దుర్లు, దురద, వాపు, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది లేదా మరేదైనా అలెర్జీ సమస్యలు ఎదురైతే వెంటనే ఈ టీ తీసుకోవడం మానేయండి.


Read Also: Mouth Ulcer Tips: ఈ చిట్కాలతో.. ఒక్క పూటలోనే నోటి పూత సమస్య పరార్..

Summer Health Tips: ఈ హెల్తీ డ్రింక్‌తో 5 అద్భుతమైన

Kidney Stones: ఈ మొక్కతో కిడ్నీలో రాళ్లు కరిగిపోవాల్సిందే

Updated Date - Apr 10 , 2025 | 05:00 PM