Share News

Iran currency: 10 లక్షల ఇరాన్‌ రియాళ్లకు ఒక్క డాలర్‌

ABN , Publish Date - Apr 06 , 2025 | 02:25 AM

ఇరాన్ కరెన్సీ రియాల్‌ విలువ రికార్డు స్థాయిలో పడిపోయి, ఒక్క డాలర్‌కు 10 లక్షల 43 వేల రియాల్‌లుగా మారింది. టెహ్రాన్‌లోని కరెన్సీ మార్పిడి కేంద్రాల్లో డిజిటల్‌ బోర్డులను ఆఫ్‌ చేసి, ట్రేడింగ్‌ నిలిపివేశారు.

Iran currency: 10 లక్షల ఇరాన్‌ రియాళ్లకు ఒక్క డాలర్‌

టెహ్రాన్‌, ఏప్రిల్‌ 5: మామూలుగా ఒక్క డాలర్‌కు మన కరెన్సీ ఎంత వస్తుంది. ఇప్పటి లెక్క ప్రకారం సుమారు 86 రూపాయలు. కానీ ఒక్క డాలర్‌కు ఏకంగా పది లక్షలకుపైనే అయితే!? ఇరాన్‌ కరెన్సీ రియాల్‌. శనివారం అంతర్జాతీయ మార్కెట్లో ఒక డాలర్‌కు రికార్డు స్థాయిలో 10 లక్షల 43 వేల రియాల్‌లకు విలువ పడిపోయింది. ఈ దెబ్బకు ఇరాన్‌ రాజధాని టెహ్రాన్‌లోని కరెన్సీ మార్పిడి కేంద్రమైన ఫిర్దౌసీ స్ట్రీట్‌లో ట్రేడర్లు కరెన్సీ మార్పిడి విలువల డిజిటల్‌ బోర్డులను ఆఫ్‌ చేసేశారు. అమెరికా ఆంక్షల నేపథ్యంలో ఇరాన్‌ కరెన్సీ విలువ వేగంగా పడిపోతోంది.

Updated Date - Apr 06 , 2025 | 02:26 AM