Viral News: ఎగిరే ట్యాక్సీలు వచ్చేశాయ్.. కానీ పైలట్‌లేకుండానే ప్రయాణం..
ABN, Publish Date - Apr 01 , 2025 | 09:26 PM
ప్రస్తుత కాలంలో ట్రాన్స్‌పోర్ట్ రంగంలో అనేక మార్పులు వస్తున్నాయి. బైకులు, కార్లు, ట్యాక్సీల వినియోగం పెరిగినప్పటికీ, సాంకేతికత అభివృద్ధితో కొత్త ట్రెండ్ ప్రారంభమవుతుంది. ఈ క్రమంలోనే చైనా EHang సంస్థ పైలెట్ లేని ఫ్లైట్ ట్యాక్సీలను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

ప్రస్తుతం బైక్, కార్ల ట్యాక్సీ ట్రెండ్ నడుస్తోంది. కానీ వీటికి చెక్ పెడుతూ కొత్తగా ఫ్లైట్ ట్యాక్సీలు కూడా అందుబాటులోకి వచ్చేశాయి. చైనా EHang సంస్థ రూపొందించిన EH216S పైలెట్ లేని ఫ్లైట్ ట్యాక్సీలను పర్యాటక ప్రయాణం కోసం వాణిజ్యంగా ప్రారంభించడానికి అక్కడి ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ క్రమంలో గ్వాంగ్‌జౌ, హెఫీ నగరాల మధ్య ఈ పర్యాటక ఎగిరే టాక్సీలను వినియోగించనున్నారు. ప్రస్తుతం ఎగిరే ఈ ట్యాక్సీలు జీపీఎస్, ఆటోనమస్ సిస్టమ్ ద్వారా పనిచేస్తాయి.
పైలట్ లేకుండా ప్రయాణం ఎలా సాధ్యం..
ఈ eVTOL వాహనాలు 100% స్వయంప్రతిపత్తి (autonomous)గా పనిచేస్తాయి. పైలట్ అవసరం లేకుండా, ఇవి ప్రీసెట్ మార్గాలపై అనువైన వేగంతో ఎగురతాయి. మనుషులు ఇవి నడపడం అవసరం లేకుండా, టెక్నాలజీ ద్వారా పూర్తిగా నియంత్రించబడతాయి. ఈ ప్రయాణం చాలా సులభం, సురక్షితంగా ఉంటుంది. సీసీటీవీ కెమెరాలు, 5G సిగ్నల్స్, అలర్ట్ సిస్టమ్స్ ద్వారా వీటిని పూర్తిగా ట్రాక్ చేయవచ్చు.
టిక్కెట్లు ఎలా కొనాలి
ఈ ట్యా్క్సీలు పైలట్ లేకుండా పర్యాటక సేవలకు అనుకూలంగా మారినప్పటికీ, 5G సిగ్నల్ ఆధారంగా టిక్కెట్లు కొనుగోలు చేయవచ్చు. మీరు చైనా గ్వాంగ్‌జౌ లేదా హెఫీ ప్రాంతాల్లో వీటి సేవలను ఉపయోగించాలనుకుంటే, టిక్కెట్లు సులభంగా EHang సంస్థ, HeYi Aviation భాగస్వామ్యంతో ఆన్‌లైన్ ద్వారా లేదా అక్కడికే వెళ్లి కొనుగోలు చేయవచ్చు. ఈ EH216 S ట్యాక్సీలు స్వయంచాలకంగా 5G ద్వారా, అనుకూల మార్గాలపై ప్రయాణిస్తాయి. ఇవి తక్కువ ఎత్తులో, సునాయాసంగా, పర్యాటకులకు గమ్య స్థానాలకు చేర్చుతాయి. 16 ప్రొపెల్లర్‌లు ఉంచిన ఈ విమానాలు, వాయు రవాణాలో అందరికీ కొత్త అనుభవాన్ని అందిస్తాయి.
సీసీటీవీ నిఘాలో..
గ్వాంగ్‌జౌ నగరంలో మీరు గగనతలాన్ని చూస్తూ పర్యాటకాలు, ప్రసిద్ధ ప్రాంతాలను చూడవచ్చు. చైనాలో EHang సంస్థ 2017లో తన ప్రయోగాలను మొదలుపెట్టింది. 2020లో ఈ వాహనాలు మొదటిసారిగా గగనతలంలోకి వచ్చాయి. ఇప్పుడు EHang సంస్థ సివిల్ ఏవియేషన్ ద్వారా పరిపూర్ణ ధృవీకరణ పొందినందున, వీటిని ఇప్పుడు మరింత విస్తృతంగా ఉపయోగించడం సాధ్యం అవుతుంది. ఇవి సీసీటీవీ కెమెరాలు, GPS, ఆటోమేటెడ్ సిస్టమ్ ఆధారంగా నిరంతరం పర్యవేక్షణలో ఉంటాయి. అలాగే ఇవి తక్కువ ఎత్తులో పని చేయడం వలన ప్రాణాంతక ప్రమాదాల ప్రభావం తక్కువగా ఉంటుందని చెబుతున్నారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: భారత ఉత్పత్తులకు అమెరికాలో వాత..చుక్క, ముక్కపై ట్రంప్ ఫోకస్..
Business Idea: మహిళలకు బెస్ట్..లక్ష పెట్టుబడితో వ్యాపారం, నెలకు రూ.3 లక్షల ఆదాయం..
New Tax Rules: ఏప్రిల్ 1 నుంచి మారనున్న రూల్స్ ఇవే.. తెలుసుకుంటే మీకే లాభం..
Income Tax Changes: ఏప్రిల్ 1 నుంచి వచ్చే కొత్త పన్ను రేట్లు తెలుసుకోండి..మనీ సేవ్ చేసుకోండి..
Read More Business News and Latest Telugu News
Updated Date - Apr 01 , 2025 | 09:26 PM