Share News

Illegal immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ బంపరాఫర్..

ABN , Publish Date - Apr 16 , 2025 | 09:53 AM

అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా వారికి ఓ బంపర్ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే స్వచ్ఛందంగా అమెరికా వీడి తమ స్వదేశానికి వెళ్లిపోతారో..

Illegal immigrants: అక్రమ వలసదారులకు ట్రంప్ బంపరాఫర్..

అక్రమ వలసదారులను దేశం నుంచి పంపించేందుకు ఇన్నాళ్లూ కఠిన నిబంధనలు అమలు చేస్తూ వచ్చిన అమెరికా ప్రభుత్వం.. తాజాగా వారికి ఓ బంపర్ఆఫర్ ఇచ్చింది. ఎవరైతే స్వచ్ఛందంగా అమెరికా వీడి తమ స్వదేశానికి వెళ్లిపోతారో.. వారికి విమాన టికెట్లతో పాటూ కొంత ఆర్థిక సాయం కూడా చేయబోతున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఓ టీవీకి ఇచ్చిన ఇంటర్వూలో పేర్కొన్నారు. హంతకులను అమెరికా నుంచి బయటికి పంపించడంపై దృష్టి సారించినట్లు చెప్పారు.


అమెరికాలోని (America) వలసదారులపై డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) మాట్లాడుతూ దేశం విడిచివెళ్లేవారికి విమాన ఛార్జీలు, స్టైఫండ్‌ను (Airfare, stipend) అందిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా యాంకర్ ట్రంప్‌కు ఓ వీడియో చూపించారు. ఓ వ్యక్తి 20 ఏళ్ల క్రితం చట్టవిరుద్ధంగా అమెరికాకు వచ్చాడని, ప్రస్తుతం అతికి పిల్లలు కూడా ఉన్నారని ఆ వీడియో సారాంశం. తాను ఓటు వేయలేకపోయినా, తాను ట్రంప్‌కు మద్ధతు ఇచ్చేవాడినని ఆ వ్యక్తి తెలిపారు. ఈ వీడియో చూసిన ట్రంప్.. ఇలాంటి వ్యక్తిని తమ దేశంలో ఉంచుకోవాలని అనుకున్నట్లు చెప్పారు. ఇలాంటి వారి వల్ల ఎలాంటి ప్రమాదం ఉండదని కూడా చెప్పారు. వలసదారులను దేశం నుంచి పంపించడమే తమ ప్రథమ లక్ష్యమని, అయితే వారు ఉండడానికి అర్హులని తేలితే.. తిరిగి వెనక్కి తీసుకురావడానికి కూడా అనుమతి ఇస్తామని హామీ ఇచ్చారు.


స్వీయ బహిష్కరణకు తుది ఉత్తర్వులు పొంది కూడా 30 రోజులు దాటి అమెరికాలో నివసిస్తున్న వారికి (Illegal immigrants) రోజుకు 998 డాలర్లు జరిమానాగా విధిస్తామని అమెరికా ప్రభుత్వం హెచ్చరించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా స్వీయ బహిష్కరణ వల్ల కలిగే ప్రయోజనాలను అధికారులు వివరించారు. స్వతహాగా దేశాన్ని విడిచిపెట్టి వెళ్లడం వెళ్లాలనేకునే వారికి సాయం అందిస్తామని చెప్పారు. తమ దేశాలకు వెళ్లే క్రమంలో చార్జీలను భరించలేకపోతే.. సబ్సిడీ విమాన సర్వీసుకు కూడా అర్హులవుతారని అధికారులు పేర్కొన్నారు.

Updated Date - Apr 16 , 2025 | 10:03 AM