Share News

China tariffs: దెబ్బకు దెబ్బ కొట్టిన చైనా.. అగ్రరాజ్యంతో ఢీ అంటే ఢీ

ABN , Publish Date - Apr 09 , 2025 | 07:06 PM

నువ్వెంతంటే, నువ్వెంతంటూ అమెరికా, చైనాలు ట్రేడ్ టారిఫ్స్ పోటీ పోటీగా పెంచుకుపోతున్నాయి. తాజాగా చైనా మరోసారి సుంకం పెంచడంతో ఇక వచ్చేయండంటూ ట్రంప్.. కంపెనీలకు గ్రాండ్ వెల్ కం చెబుతున్నారు.

China tariffs: దెబ్బకు దెబ్బ కొట్టిన చైనా.. అగ్రరాజ్యంతో ఢీ అంటే ఢీ
America China

China - America Tariff Fight: అసలు తగ్గేదే లేదంటూ అగ్ర రాజ్యంకు షాకు మీద షాకులిస్తోంది డ్రాగన్ కంట్రీ చైనా. తమ దేశ ఉత్పత్తులపై అమెరికా మరింత ఎక్కువగా 104 శాతం టారిఫ్స్ విధిస్తూ ప్రకటన చేసిన వేళ చైనా మరో సారి తన సుంకాల్ని పెంచుతున్నట్టు ప్రకటించింది. ఇకపై మరింత ఎక్కువగా అమెరికా ఉత్పత్తులపై 84 శాతం సుంకాలు విధిస్తామని ప్రకటించింది. దీంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మొదలు పెట్టిన సుంకాల యుద్ధాన్ని చైనా కూడా అదే స్థాయిలో ప్రతిఘటిస్తున్నట్లైంది.

తాజా సుంకాల లెక్కల ప్రకారం చైనా నుంచి వచ్చే వస్తువులపై ట్రంప్‌ ప్రభుత్వం 104 శాతం సుంకం విధించగా, అమెరికా ఉత్పత్తులపై చైనా 84 శాతం సుంకం విధిస్తుంది. ఏప్రిల్‌ 10వ తేదీ నుంచి ఈ సుంకాలు అమల్లోకి వస్తాయని కూడా చైనా ఆర్థిక మంత్రిత్వ శాఖ ప్రకటించింది. కాగా, ప్రపంచ దేశాలన్నింటిపై ట్రంప్ మొదటిసారి విధించిన సుంకాలు చైనాకు ఆగ్రహాన్ని రప్పించాయి. దీంతో అమెరికా నుంచి దిగుమతి అయ్యే వస్తువులపై 34 శాతం అదనపు సుంకం విధించాలని చైనా నిర్ణయించింది.

దీంతో ఖంగుతిన్న ట్రంప్‌, ఏప్రిల్‌ 8లోగా చైనా తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలన్నారు. లేకుంటే అదనంగా మరో 50 శాతం ప్రతీకార సుంకం విధిస్తానన్నారు. అయితే, చైనా అమెరికాను కేర్ చేయకపోవడంతో ట్రంప్.. తాను చెప్పినట్లుగానే చేశారు. గతంలో విధించిన 54 శాతానికి అదనంగా 50 శాతం అంటే మొత్తంగా 104 శాతం సుంకం విధించారు. దీంతో చైనా ప్రతిగా మరో 50 శాతం సుంకాలను పెంచుతున్నట్లు ప్రకటించడంతో అది ఇప్పుడు 84 శాతమైంది. ఈ సుంకాల అంకెలు ఇంకెక్కడికి వెళతాయో చూడాలి.


Trump China Tariffs: చైనాపై ట్రంప్‌ బాదుడు 104 శాతానికి!

Saif Ali Khan Stabbing Case: సైఫ్ అలీఖాన్‌పై దాడి కేసులో కీలక పరిణామం..

Read Latest Telangana News And Telugu News

Updated Date - Apr 09 , 2025 | 07:07 PM