Share News

Helicopter Crash: నదిలో కూలిన హెలికాప్టర్..సీఈఓ ఫ్యామిలీ సహా ఆరుగురు మృతి ..

ABN , Publish Date - Apr 11 , 2025 | 07:55 AM

సీమెన్స్ స్పెయిన్ అధ్యక్షుడు, CEO అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య, ముగ్గురు పిల్లలు కలిసి హెలికాప్టర్‌లో వెళ్తున్నారు. ఆ క్రమంలోనే హెలికాప్టర్‌ ఆకస్మాత్తుగా నదిలో కుప్పకూలింది. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

Helicopter Crash: నదిలో కూలిన హెలికాప్టర్..సీఈఓ ఫ్యామిలీ సహా ఆరుగురు మృతి ..
Helicopter Crashes Hudson River

​అమెరికాలోని న్యూయార్క్ నగరంలో హడ్సన్ నదిలో జరిగిన హెలికాప్టర్ ప్రమాదం విషాదాన్ని నింపింది. గురువారం మధ్యాహ్నం జరిగిన ఈ ఘటనలో ముగ్గురు పిల్లలు సహా ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ప్రమాదంలో స్పెయిన్‌కు చెందిన ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు సభ్యులు, పైలట్ ఉన్నారు. న్యూయార్క్ పోలీస్ కమిషనర్ జెస్సికా టిష్ ప్రకారం, బెల్ 206 మోడల్ హెలికాప్టర్‌ను న్యూయార్క్ హెలికాప్టర్ టూర్స్ నడిపింది.

ప్రమాద వివరాలు

మధ్యాహ్నం 3 గంటలకు డౌన్‌టౌన్ హెలిప్యాడ్ నుంచి బయలుదేరిన ఈ హెలికాప్టర్ హడ్సన్ నది మీదుగా ఉత్తర దిశలో ప్రయాణిస్తోంది. ఆ క్రమంలో జార్జ్ వాషింగ్టన్ వంతెనను సమీపించేటప్పుడు, దక్షిణ దిశలో తిరిగి కొన్ని నిమిషాల తరువాత, అది నదిలో బోల్తా పడి నీటిలో మునిగిపోయింది.​ హెలికాప్టర్ గాల్లో విరిగిపోయినట్లు కనిపించిందని ప్రత్యక్ష సాక్షి అయిన బ్రూస్ వాల్ అన్నారు. దాని వెనుక భాగం, ప్రొపెల్లర్ విడిపోయి కింద పడిపోతున్నాయన్నారు. హెలికాప్టర్ నుంచి విడిపోయిన తర్వాత కూడా ప్రొపెల్లర్ తిరుగుతూనే ఉందన్నారు.​


స్పందించిన డొనాల్డ్ ట్రంప్

అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వీడియోలో ఒక పెద్ద వస్తువు నీటిలో వచ్చి వేగంగా పడిపోయినట్లు కనిపిస్తుంది. కొన్ని సెకన్ల వ్యవధిలోనే హెలికాప్టర్ భాగం కూడా నదిలో పడిపోయినట్లు కనిపించింది. ఆ తరువాత అనేక అత్యవసర పడవలు ఘటనా స్థలానికి చేరుకుని, సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదంపై ప్రపంచవ్యాప్తంగా దిగ్భ్రాంతి వ్యక్తమైంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఈ ప్రమాదంపై విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబ సభ్యులు, సన్నిహితులకు సానుభూతి తెలియజేశారు.​


మృతుల వివరాలు

నివేదికల ప్రకారం హెలికాప్టర్‌లో ఉన్న వారిలో సీమెన్స్ స్పెయిన్ అధ్యక్షుడు, CEO అగస్టిన్ ఎస్కోబార్, ఆయన భార్య ,ముగ్గురు పిల్లలు ఉన్నట్లు తెలుస్తోంది. రవాణా కార్యదర్శి సీన్ డఫీ, అతని బృందం ఈ ప్రమాదంపై దర్యాప్తు ప్రారంభించారని, త్వరలోనే వివరణాత్మక సమాచారాన్ని అందజేస్తామని తెలిపారు.​


ఇవి కూడా చదవండి:

EPFO: పీఎఫ్ ఉద్యోగులకు అలర్ట్..మరింత ఈజీగా UAN నంబర్ పొందే ఛాన్స్..

Gold Price Fluctuations: అసలు గోల్డ్ రేటు ఎందుకు పెరుగుతుంది, ఎందుకు తగ్గుతుంది..కారణాలేంటి

Viral News: తల్లిదండ్రులను కాదని పెళ్లి చేసుకున్నప్పటికీ..తండ్రి కలను నిజం చేసిన కుమార్తె, ఐదేళ్లకు పునఃకలయిక

Read More Business News and Latest Telugu News

Updated Date - Apr 11 , 2025 | 07:55 AM