Israel: ఇజ్రాయెల్ అమానుష చర్య.. చిన్నారులు తినే ఆహారాన్ని అడ్డుకున్న ఆర్మీ..
ABN , Publish Date - Mar 02 , 2025 | 07:04 PM
Israel: ఇజ్రాయెల్ మరోసారి తన అమానుషత్వాన్ని ప్రదర్శించింది. గాజా స్ట్రిప్‌లో అర్థంతరంగా సహాయ సరఫరాలను నిలిపివేసింది. ఇప్పటికే నరకాన్ని అనుభవిస్తున్న ఆ ప్రజలకు ఒక్క రొట్టె, తాగునీరు కూడా దొరకనీయకుండా అన్ని మార్గాలను మూసివేసింది. వారిపై రాకెట్లతో దాడి చేయడమే కాకుండా.. ఆహారం, ఔషధం లాంటి మానవతా అవసరాలను కూడా నిరాకరించడం ఏమిటి.. ఇదేనా మానవత్వం..

Israel: ఇజ్రాయెల్ తన తీరును సమర్థించుకునేందుకు ఎలాంటి వివరణ ఇవ్వలేదు. కానీ వారి ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తోంది – "హమాస్ కాల్పుల విరమణ ఒప్పందాన్ని పొడిగించకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయి" అంటూ బెదిరించింది. అంటే, నరహత్యకు మరొక రూపం. సహాయాన్ని నిలిపివేయడం ద్వారా లక్షల మంది నిరాశ్రయులను మరింత మృత్యువాత పడేలా చేయాలన్న దురుద్దేశం ఏ మనిషికైనా జీర్ణించుకోలేనిది. హమాస్ ఈ చర్యను ఖండించింది. ఇదొక చౌకబారు వ్యూహం అని ఆరోపించింది. నిజమే, ఇజ్రాయెల్ చేస్తున్నది మానవతా విరుద్ధ చర్య. ఇది యుద్ధ నేరమే. కాల్పుల విరమణపై హమాస్ ఒప్పందం పక్కదారి పట్టిందని ఇజ్రాయెల్ ఆరోపించినా, నిజంగా ఒప్పందాన్ని కేవలం రాజకీయం కోసం వాడుకునేది ఎవరో ప్రపంచానికి తెలుసు.
నీచమైన ఆలోచనతో.. మానవత్వం మరిచి..
శనివారంతో మొదటి దశ కాల్పుల విరమణ ముగిసింది. ఇందులో మానవతా సహాయం పెరిగింది. కానీ ఇప్పుడు మళ్లీ ఆ సహాయాన్ని నిలిపివేయడం ఎలాంటి నీచమైన ఆలోచన? ఒకవైపు మానవత్వాన్ని నాశనం చేస్తూ, మరోవైపు రాజకీయం ఆడితే, ఆఖరికి ఎవరికీ మేలు జరుగుతుంది? ఇజ్రాయెల్‌కు మానవత్వం మిగిలి ఉంటే, ఇప్పటికైనా తన తీరును మార్చుకోవాలి.
అమెరికా మధ్యవర్తిత్వం కోసం ప్రయత్నించినా.. ఇజ్రాయెల్ తీరులో మార్పు లేదు. ఒప్పందాలను వ్యర్థం చేస్తూ, ప్రజలను మరింత అవమానానికి గురిచేస్తూ, యుద్ధం పేరుతో పసిపిల్లల భవిష్యత్తును కాలరాస్తూ సాగుతోంది. ప్రపంచం ఈ దారుణాన్ని ఎంతకాలం మౌనంగా చూస్తూ ఉండాలి..
Read Also : Elon Musk : 14వ బిడ్డకు తండ్రి అయిన మస్క్.. ఇంత మంది ఎందుకంటే.. సమాధానమిదే..
Carrots : పచ్చి క్యారెట్లు vs వండిన క్యారెట్లు.. ఎలా తింటే ఎక్కువ మేలు..
Korean Bamboo Salt: ఈ ఉప్పు ధర కిలో రూ.30 వేలు.. ఎప్పుడైనా టేస్ట్ చేశారా