Donald Trump: అమెరికాలోని విదేశీయులకు స్ట్రాంగ్ వార్నింగ్
ABN , Publish Date - Apr 13 , 2025 | 06:22 PM
Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వివిధ దేశాలపై సుంకాల మోత మోగిస్తున్నారు. మరోవైపు యూఎస్‌లోని విదేశీయులే లక్ష్యంగా మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇప్పటికే సుంకాల కారణంగా విదేశాల నుంచి ట్రంప్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. అలాగే యూఎస్‌లోని విదేశీయులే లక్ష్యంగా తీసుకున్న ఈ నిర్ణయంతో ఆ తీవ్రత మరింత పెరిగే అవకాశముంది.

వాషింగ్టన్, ఏప్రిల్ 14: అమెరికా దేశాధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు చేపట్టిన తర్వాత వరుసగా ఆయన తీసుకొంటున్న నిర్ణయాలపై సర్వత్ర విమర్శలు వెల్లువెత్తుతోన్నాయి. అలాంటి వేళ.. అమెరికా హోం లాండ్ సెక్యూరిటీ ఎక్స్ వేదికగా ఆదివారం కీలక ప్రకటన చేసింది. 30 రోజుల కంటే ఎక్కువ కాలం అమెరికాలో ఉన్న విదేశీయులు తప్పనిసరిగా ప్రభుత్వం వద్ద తమ పేరు నమోదు చేసుకోవాలని సూచించింది. లేకుంటే జరిమానాతోపాటు జైలు శిక్ష సైతం విధిస్తామని హెచ్చరించింది. అయితే ఈ నిర్ణయం హెచ్ 1 బీ లేదా స్టూడెంట్ పర్మిట్ వంటి వీసాలు పొందిన పౌరులకు వర్తించదని పేర్కొంది.
కానీ సరైన అనుమతులు లేకుండా ఉండే విదేశీ పౌరులను నిరోధించడానికి ఈ తరహా చట్టాలను కఠినంగా అమలు చేస్తున్నామని వివరించింది. హెచ్ 1 బీ వీసాపై ఉన్న వ్యక్తి ఉద్యోగం కోల్పోయినప్పటికీ.. పేర్కొన్న వ్యవధి లోపు దేశం విడిచి వెళ్లకపోతే.. ప్రభుత్వం తీసుకొనే నిర్ణయాన్ని ఎదుర్కోవలసి ఉంటుందని తెలిపింది. ఇక అమెరికా సూచించిన అన్ని నియమ నిబంధనలు పాటించాలని హెచ్1 బీ వీసాదారులకు ఆ దేశ హోమ్ లాండ్ సెక్యూరిటీ స్పష్టం చేసింది.
మీరు సొంతంగా అమెరికాను వీడడం ఉత్తమమని ఈ సందర్భంగా స్పష్టం చేసింది. సామాను తీసుకు వెళ్లిపోండి. నగదు సంపాదిస్తే.. దానిని సైతం భద్రంగా తీసుకు వెళ్లండని పేర్కొంది. ఓ వేళ విమాన ప్రయాణానికి టికెట్ ఖర్చు భరించ లేకుంటే.. అందులో రాయితీ ఇచ్చేందుకు తమ ప్రభుత్వం సుముఖంగా ఉందని తెలిపింది.
ఈ నిబంధనలు పాటించకుంటే.. తక్షణమే దేశం నుంచి పంపించేస్తామని స్పష్టం చేసింది. ఇక ఫైనల్ అర్డర్ అందుకొన్న వారు.. ఒక్క రోజు అదనంగా ఉన్నా.. వారి నుంచి భారీగా అపరాధ రుసుం వసూలు చేస్తామని వార్నింగ్ ఇచ్చింది. అలాగే జైలు శిక్ష కూడా విధిస్తామని చెప్పింది. అంతేకాదు.. వారికి భవిష్యత్తులో అమెరికాలో అడుగు పెట్టుకుండా ఉండేలా చర్యలు తీసుకుంటామని చెప్పింది.
ఈ వార్తలు కూడా చదవండి..
IAS Officers Transfer: ఏపీలో పలువురు ఐఏఎస్‌లు బదిలీ
AB Venkateswara Rao: కోడికత్తి శ్రీనుతో ఏబీ వెంకటేశ్వరరావు భేటీ.. వైఎస్ జగన్‌పై సంచలన వ్యాఖ్యలు
Fire Accident: భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవ దహనం..
TTD Board chairman: భూమనపై టీటీడీ బోర్డ్ చైర్మన్ సంచలన వ్యాఖ్యలు
For International News And Telugu News