Share News

ఎంత మంచి మనసో.. పుట్టిన రోజు నాడు లక్షల రూపాయలు దానం

ABN , Publish Date - Apr 09 , 2025 | 08:37 AM

తమ స్టేటస్ చూపించుకోవడం కోసం బర్త్ డే వేడుకల పేరు మీద లక్షల రూపాయలు ఖర్చు చేసేవారు సమాజంలో బోలేడు మంది ఉన్నారు. కొందరు మాత్రమే పుట్టిన రోజు నాడు ఇతరులకు సాయం చేయాలని ఆలోచిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఈ కోవలోకే వస్తాడు. పుట్టిన రోజు నాడు లక్షల రూపాయలు దానం చేయబోతున్నట్లు ప్రకటించాడు. ఆ వివరాలు..

ఎంత మంచి మనసో.. పుట్టిన రోజు నాడు లక్షల రూపాయలు దానం
Thomas J Henry

ఒకప్పటి సంగతి ఏమో కానీ.. నేటి కాలంలో మాత్రం ప్రతి వేడుక ప్రెస్టీజ్ సింబల్‌గా మారింది. ఒకరిని చూసి ఒకరు లగ్జరీ వేడుకల నిర్వహిస్తున్నారు. ఒకప్పుడు పుట్టినరోజు వేడుకలంటే.. పిల్లలకైతే కొత్త బట్టలు, స్కూల్లో చాక్లెట్లు పంచడం.. మహా అయితే కేక్ కట్టింగ్. ఇక పెద్దల విషయానికి వస్తే.. అసలు బర్త్ డే వేడుకలు అంటే అంత ఆసక్తి చూపకపోయేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. చిన్నాపెద్దా తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎంతో ఘనంగా బర్త్ డే సెలబ్రేట్ చేసుకునేందుకు ఆసక్తి చూసుతున్నారు. అందుకోసం భారీగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు. ఎక్కడో కొందరు మాత్రమే పుట్టిన రోజు నాడు తమ గురించి కాకుండా పక్క వారి గురించి ఆలోచిస్తారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే వ్యక్తి కూడా ఆ కోవకు చెందినవాడే. తన పుట్టిన రోజు సందర్భంగా లక్షల రూపాయలు దానం చేసేందుకు నిర్ణయం తీసుకున్నాడు. అది కూడా అపరిచితులకు. ఆ వివరాలు..


అమెరికా, టెక్సాస్‌కు చెందిన థామస్ జే హెన్రీ అనే ఓ లాయర్.. గొప్పమనసు చాటుకున్నాడు. తన పుట్టిన రోజు సందర్భంగా.. ఇద్దరు అపరిచిత వ్యక్తులకు 1 లక్ష డాలర్లు మన కరెన్సీలో చెప్పాలంటే.. 86,37,825 రూపాయలు బహుమతిగా అందించి.. వారి ముఖాల్లో చిరు నవ్వులు పూయించాలని నిర్ణయం తీసుకున్నాడు.. అపరిచిత వ్యక్తులకు ఇంత భారీ మొత్తంలో డబ్బు ఇచ్చేందుకు ముందుకు రావడంపై ఒక్కరు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా హెన్రీ తన ఇన్‌స్టాలో చేసిన పోస్ట్‌లు వైరల్‌గా మారాయి. "ఈ రోజు థామస్ హెన్రీ బర్త్ డే. ప్రతి ఏటా పుట్టిన రోజు నాడు పార్టీ చేసుకుంటున్నాను. ఆ వెలుగుజిలుగుల మీద ఆసక్తి తగ్గింది. అందుకే ఈ ఏడాది సరికొత్త నిర్ణయం తీసుకున్నాను. ఈసారి నా బర్త్ డే సందర్భంగా టెక్సాస్ ప్రజలు బహుమతి గెలవవచ్చు. అందుకోసం నేను టీజేహెచ్ మిలియన్ డాలర్ గివ్‌అవే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నాను" అని చెప్పుకొచ్చాడు.


"ఈ కార్యక్రమం ఏప్రిల్ 7 నుంచి ప్రారంభం అవుతుంది. ప్రతి వారం ఓ ఐదుగురిని సెలక్ట్ చేసి ఒక్కొక్కరికి 5 వేల డాలర్ల చొప్పున.. 25 వేల డాలర్లు బహుమతిగా ఇస్తాం. ఇక డిసెంబర్‌లో రెండు భారీ బహుమానాలు ప్రకటిస్తాం. ఇద్దరు లక్కీ విన్నర్స్‌కు చెరొక లక్ష డాలర్లు బహుమతిగా అందిస్తాను. ఈ కార్యక్రమంలో పాల్గొనే వారందరికి ధన్యవాదాలు. నన్ను ఫాలో చేసే వారికి థాంక్స్ చెప్పడం కోసం ఈ మార్గాన్ని ఎంచుకున్నాను. మమ్మల్ని నమ్మండి.. మద్దతు తెలపండి. ఇప్పుడు మీ తరుణం వచ్చింది.. సమాజానికి తిరిగి ఇవ్వండి" అని తన ఇన్‌స్టాలో పోస్ట్ చేశాడు. ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది.

Updated Date - Apr 09 , 2025 | 08:37 AM