Trump Oath Ceremony: ట్రంప్ ప్రమాణ స్వీకారానికి ప్రపంచంలో అత్యంత ధనిక నేతలు హాజరు.. ఎవరెవరంటే..
ABN , Publish Date - Jan 20 , 2025 | 11:55 AM
ఈరోజు డోనాల్డ్ ట్రంప్ అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి అనేక దేశాల నాయకులు హాజరు కానున్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పలువురు బిలయనీర్లు కూడా పాల్గొనబోతున్నారు. ఎవరెవరనేది ఇక్కడ తెలుసుకుందాం.

నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) ప్రమాణ స్వీకార కార్యక్రమానికి (trump oath ceremony) ప్రపంచంలోని అనేక దేశాల నేతలు హాజరు కానున్నారు. దీంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ధనిక వ్యాపారవేత్తలు, టెక్ నిపుణులు కూడా రానున్నారు. ఈ కార్యక్రమానికి ప్రపంచంలో అత్యంత ధనవంతులైన ముగ్గురు టెక్ దిగ్గజాలు హాజరుకానున్నారు. వారిలో ఎలాన్ మస్క్, జెఫ్ బెజోస్, మార్క్ జుకర్‌బర్గ్ ఉన్నారు. వీరితోపాటు భారత సంతతికి చెందిన గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్, ఆపిల్ సీఈఓ టిమ్ కుక్ కూడా కలరు.
హాజరు కానున్న వారిలో
దీంతోపాటు చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, అర్జెంటీనా అధ్యక్షుడు జేవియర్ మిల్లా, ఇటాలియన్ ప్రధాన మంత్రి జార్జియా మెలోని, జర్మనీ ఆల్టర్నేటివ్ ఫర్ జర్మనీ (AfD) పార్టీకి చెందిన టినో శ్రుపాల, బ్రిటన్ పాపులిస్ట్ పార్టీ నాయకుడు నిగెల్ ఫరాజ్ పేర్లు కూడా ఈ లిస్టులో ఉన్నారు. భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ సహా ఇంకా పలువురు ప్రముఖులు ఉన్నారు. ట్రంప్ తొలి పదవీకాలంలో జిన్‌పింగ్ ఆయనకు అతిపెద్ద ప్రత్యర్థి. కానీ చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్‌ను ఆహ్వానించాలనే ట్రంప్ నిర్ణయం చాలా మందిని ఆశ్చర్యపరిచింది. ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు కానున్న వారిలో ఓపెన్ఏఐ సీఈఓ సామ్ ఆల్ట్‌మన్, ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహి కూడా కలరు.
రాజధాని వాషింగ్టన్ డీసీలో..
ఒకప్పుడు ట్రంప్‌ను 'ఆత్మస్నేహితుడు' అని పిలిచిన భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలో పాల్గొనడం లేదు. భారత్ తరఫున జై శంకర్ పాల్గొంటున్నారు. దీంతోపాటు భారత పారిశ్రామికవేత్త ముఖేష్ అంబానీ, ఆయన భార్య నీతా అంబానీ హాజరవుతున్నారు. ఇప్పటికే ట్రంప్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి రెండు రోజుల ముందు, రాజధాని వాషింగ్టన్ డీసీలో వేలాది మంది వచ్చారు. మరోవైపు పదవీ విరమణ చేస్తున్న అధ్యక్షుడు జై బిడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ పాత వేడుక సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తున్నారు. దీనిలో ఓడిపోయిన అభ్యర్థులు విజేతలతో వేదికను పంచుకుంటారు.
మాజీ అధ్యక్షులు కూడా...
మాజీ అధ్యక్షులు బరాక్ ఒబామా, జార్జ్ డబ్ల్యూ. బుష్, బిల్ క్లింటన్ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. తన వీడ్కోలు ప్రసంగంలో అమెరికా కొంతమంది టెక్ బిలియనీర్ల ఆధిపత్యంలో ఉన్న ఒక సామ్రాజ్యం మారవచ్చని బైడెన్ వ్యాఖ్యానించారు. కానీ అక్కడి కార్యాలయం అతిథుల అధికారిక జాబితాను విడుదల చేయలేదు. ఈ జాబితా గురించి ఇంకా చాలా చర్చలు కొనసాగుతున్నాయి. ట్రంప్ వేడుకకు హాజరయ్యే వ్యక్తుల జాబితాలో ప్రపంచంలోని అతిపెద్ద నాయకులు, మిత్రులు, స్నేహితులు, శత్రువులు సహా అనేక మంది ఉన్నట్లు తెలుస్తోంది. కీలకమైన వ్యక్తులు రానున్న నేపథ్యంలో ఈ కార్యక్రమం ఘనంగా ఉంటుందని పలువురు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: ఇండియా టైం ప్రకారం ట్రంప్ ప్రమాణ స్వీకారం ఎప్పుడంటే.. ఈ ఛానెళ్లలో లైవ్..
UNICEF: 2025లో ప్రమాదంలో 47 కోట్ల మంది పిల్లల భవిష్యత్తు.. సేవ్ చేయలేమా..
Investment Tips: 20 ఏళ్లలో రూ. 5 కోట్లు సంపాదించాలంటే.. ఏ స్కీంలో పెట్టుబడి చేయాలి..
Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..
Public Holidays: 2025లో పబ్లిక్ హాలిడేస్ ఎన్ని రోజులో తెలుసా..
Read More International News and Latest Telugu News