Microwave Care: ఓవెన్ క్లీన్ చేసేటప్పుడు కామన్‌గా చేసే 5 తప్పులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
ABN , Publish Date - Apr 08 , 2025 | 03:00 PM
How to Clean Microwave: మైక్రోవేవ్ ఓవెన్ దీర్ఘకాలం పనిచేయాలంటే దాన్ని శుభ్రం చేసేటప్పుడు జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. కానీ, క్లీన్ చేసే సమయంలో దాదాపు చాలా మంది ఈ 5 తప్పులూ చేస్తుంటారు. మరి, సురక్షితమైన క్లీనింగ్ ప్రాసెస్ ఏవో తెలుసుకోండి.

Microwave Oven Cleaning Tips: ఈ రోజుల్లో దాదాపు ప్రతి ఇంట్లో మైక్రోవేవ్ ఓవెన్లను ఉపయోగిస్తున్నారు. దీని సహాయంతో చాలా పనులు తేలికగా పూర్తవుతాయి. పిజ్జా, బర్గర్లు, కుకీలు మొదలైన వాటిని తినడానికి బయటకు వెళ్లాల్సిన అవసరం లేకుండా ఓవెన్ల ద్వారా ఇంట్లోనే వీటిని తయారు చేసుకోవచ్చు. ఇవేకాక ఆహారం, టీ వేడి చేయడానికి, పాపడ్, బంగాళాదుంపలు, చిలగడదుంపలు మొదలైన వాటిని కాల్చడానికి కూడా ఓవెన్లను వాడుతున్నారు. ఇలా వివిధ రకాల అవసరాల కోసం ఎక్కువసేపు ఉపయోగించినపుడు మైక్రోవేవ్ ఓవెన్ ఆహార పదార్థాల వాసనతో నిండిపోతుంది. మురికిగా కూడా తయారవుతుంది. అలాగని వెంటనే శుభ్రం చేయకూడదు. కొంత సమయం తర్వాతే శుభ్రం చేయాలి. ఓవెన్ క్లీన్ చేసేటప్పుడు అందరూ సాధారణంగా చేసే 5 తప్పులేవో తెలుసుకుందాం.
మైక్రోవేవ్‌ను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం అవసరం. లేకపోతే దానిలో బ్యాక్టీరియా పెరిగే ప్రమాదం ఎక్కువ. కొంతమంది మైక్రోవేవ్‌ను శుభ్రపరిచేటప్పుడు ఈ 5 తప్పులు చేస్తారు. తెలియక చేసే ఈ పొరపాట్ల వల్ల ఓవెన్ దెబ్బతింటుంది. మైక్రోవేవ్ మంచి కండీషనల్లో ఉండాలన్నా.. ఎక్కువ కాలం పనిచేయాలన్నా శుభ్రం చేసేటప్పుడు ఈ జాగ్రత్తలు తీసుకోండి.
1. ఎక్కువ నీరు
తరచుగా ప్రజలు మైక్రోవేవ్‌ను నీటిలో గుడ్డను నానబెట్టి శుభ్రం చేస్తారు. కానీ అలా చేయడం పూర్తిగా తప్పు. ఇది మీ మైక్రోవేవ్ పనితీరును ప్రభావితం చేస్తుంది. దాని లోపలి భాగాలలోకి నీరు చేరితే ఓవెన్ దెబ్బతినే ప్రమాదం పెరుగుతుంది. కాబట్టి, నీటికి బదులుగా మైక్రోఫైబర్ వస్త్రాన్ని తడిపి ఆవిరి లేదా లిక్విడ్ క్లీనర్ వాడి శుభ్రం చేయండి.
2. ప్లగ్
ఎల్లప్పుడూ మైక్రోవేవ్‌ను ఆఫ్ చేసి దాని ప్లగ్‌ను తీసివేసిన తర్వాత శుభ్రం చేయాలని గుర్తుంచుకోండి. ఈ పద్ధతి పాటిస్తే ఓవెన్లోని ఏ భాగం దెబ్బతినదు. విద్యుత్ షాక్‌కు గురయ్యే ప్రమాదం కూడా ఉండదు.
3. కఠినమైన రసాయనాలు
మైక్రోవేవ్ శుభ్రం చేయడానికి ఎప్పుడూ కఠినమైన రసాయనాలను ఉపయోగించవద్దు. మార్కెట్లో అనేక రకాల కఠినమైన రసాయనాలు, బ్లీచ్‌లు అందుబాటులో ఉన్నాయి. వాటిని శుభ్రపరచడానికి వాడితే ఓవెన్లోని లోపలి పూత దెబ్బతింటుంది. సింపుల్‌గా వెనిగర్, బేకింగ్ సోడా, పటిక మొదలైన సహజ క్లీనర్‌లను ఉపయోగించండి.
4. గట్టిగా రుద్దవద్దు
మైక్రోవేవ్‌ను శుభ్రం చేసేటప్పుడు గాజు లేదా దానిలోని ఏదైనా చిన్న భాగాలను ఎక్కువ ఒత్తిడితో శుభ్రం చేయకూడదని గుర్తుంచుకోండి. ఇలా గట్టిగా రుద్దితే వాటిపై ఒత్తిడి పెరిగి విరిగిపోతాయి. అందుకే చేతితో సున్నితంగా శుభ్రం చేయండి.
5. శుభ్రం చేసిన వెంటనే వాడొద్దు
ఓవెన్ శుభ్రం చేసిన వెంటనే ఉపయోగించవద్దు. ఇలా చేస్తే దాని లోపల ఉండే తేమ, మనం క్లీనింగ్ కోసం వాడిన లిక్విడ్ లేదా రసాయనాలు ఆహారంలో కలిసిపోయి వాసన వేస్తాయి. అంతేకాకుండా, తేమ కారణంగా షార్ట్ సర్క్యూట్ ప్రమాదం వల్ల మంటలు రేగే అవకాశముంది.
Read Also: AC Safety Precautions: సమ్మర్‌లో ఏసీ వాడకంలో
Vastu Tips for Bedroom: ఈ రంగు బెడ్ షీట్ మీద
Bhagavad Gita Lesson: ఈ 4 విషయాలపై అవగాహన ఉంటే.. జీవితం సుఖమయం..