Black Vs Red Clay Pot: నల్ల కుండ Vs ఎరుపు కుండ.. ఏ కుండలో నీళ్లు మంచివి..
ABN , Publish Date - Apr 08 , 2025 | 07:28 PM
Black Vs Red Clay Pot: ఎండాకాలంలో ఫ్రిజ్ లో కూల్ చేసిన నీళ్లు తాగడానికి చాలామంది ఇష్టపడరు. అందుకు బదులుగా కుండలో సహజంగా చల్లబడిన నీటిని తాగేందుకు మొగ్గుచూపుతారు. కానీ, ఏ రంగు కుండ మంచిదో అనే సందేహం ఉంటుంది. ఇంతకీ ఎరుపు కుండ లేదా తెలుపు కుండ.. ఏది బెస్ట్.. మీకు తెలుసా..

Best Clay Pot For Cooling Water: వేసవి వచ్చిందంటే చాలు. చల్ల నీళ్ల కోసం తాప్రతయపడతారు. అందరి కళ్లూ ఫ్రిజ్ పైనే ఉంటాయి. కాకపోతే చిల్లింగ్ వాటర్ తాగినా పెద్దగా దాహం తీరినట్టు అనిపించదు. ఎక్కువగా తాగితే వేడి చేసి జలుబు కూడా చేస్తుంది. ఒకసారి ఆలోచించండి. మన పూర్వీకులు ఫ్రిజ్ లేకపోయినా చల్లటి నీరు ఎలా తాగగలిగేవారు. మట్టి కుండల్లోనే కదా.. ఇప్పటికీ ఈ సాంప్రదాయక పద్ధతిని చాలామంది అనుసరిస్తున్నారు. కాకపోతే మట్టి కుండలు వివిధ రకాల రంగుల్లో లభ్యమవుతాయి. ప్రధానంగా ఎరుపు, నలుపు రంగుల్లో. అందువల్ల వీటిలో ఏ రంగు కుండ వాడితే మంచిది.. ఎందులో నీళ్లు వేగంగా చల్లబడతాయని అయోమయానికి గురవుతుంటారు. ఇంతకీ, ఏ రంగు కుండలో నీరు ఆరోగ్యానికి శ్రేయస్కరమైనదో ఈ కథనంలో..
ఏ రంగు కుండ బెస్ట్?
వేసవి ప్రారంభం కావడంతో మట్టి కుండలకు మార్కెట్లో డిమాండ్ పెరిగింది. ఇందులోని నీళ్లు ఫ్రిజ్ నీళ్లలా కాకుండా సహజంగా చల్లబడతాయి కాబట్టి గొంతు సమస్యలు రావు. అదనంగా మట్టిలో ఉండే ఖనిజాలు శరీరానికి అదనపు పోషణ ఇస్తాయి. మట్టిలోని ఆల్కలీన్ స్వభావం వల్ల నీటిలో ఆమ్లతత్వం తగ్గి జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఇదిలా ఉంటే మట్టి కుండల్లో నీరు చల్లబడటానికి వాటి సహజ రంధ్రాలే కారణం. ఈ రంధ్రాల ద్వారా నీరు వెలుపలికి వచ్చి ఆవిరవడం వల్ల కుండలోని నీరు చల్లబడుతుంది. అంతే తప్ప రంగు విషయంలో ఎలాంటి తేడా ఉండదు. ఎరుపు లేదా నలుపు ఏ కుండ అయినా సరే దాదాపు ఒకేలా పనిచేస్తాయి. కాకపోతే, వాటి తయారీకి ఉపయోగించిన మట్టి నాణ్యత, రంధ్రాలు ఎంత ఉన్నాయనే దాన్ని బట్టి వేగంగా లేదా నెమ్మదిగా చల్లబడవచ్చు.
నల్ల కుండ: నల్ల కుండలను సాధారణంగా నాణ్యమైన మట్టితో దృఢంగా తయారుచేస్తారు. వీటికి వేడిని గ్రహించే గుణం ఎక్కువ. అందుకే చాలామంది ఈ రంగువే ఎక్కువగా కొంటుంటారు.
ఎరుపు కుండ: ఎరుపు రంగు కుండల్లో మైకా (Mica) కణాలు ఎక్కువగా ఉంటాయని అంటారు. వీటిని ఎర్రబంకమట్టితో తయారుచేస్తారు. అందువల్ల ఇందులోని నీరు ఎక్కువ కాలం చల్లగా ఉంటుంది.
తెలుపు కుండా: ఈ రంగు కుండలు మార్కెట్లో అరుదుగానే కనిపిస్తాయి. కానీ చూసేందుకు అందంగా, ఆకర్షణీయంగా ఉంటాయి. ఇవి కూడా నీటిని చల్లగా ఉంచడంలో సమర్థవంతంగానే పనిచేస్తాయి. పై రెండు రకాలంత గొప్పగా ఏం ఉండదు.
మంచి కుండని ఎలా ఎంచుకోవాలి?
మీ ఇంట్లో నీటి వాడకాన్ని బట్టి కుండ సైజు ఎంచుకోండి. కుండ చూసేందుకు ఎంత ఆకర్షణీయంగా కనిపించినా మట్టి స్వచ్ఛతపై దృష్టి పెట్టండి. ముఖ్యంగా ‘మైకాసియస్ క్లే పాట్’ (Micaceous Clay Pot) చాలా మంచివి. కాబట్టి, కుండ కొనుగోలు చేసేటప్పుడు ఇందులో మైకా కణాలు ఉన్నాయో లేదో అడిగి కనుక్కోండి. ఎక్కువ రంగులు, డిజైన్లు ఉన్నవి తీసుకోకపోవడమే మంచిది. ఎందుకంటే ఇవి కృత్రిమ రసాయనాలతో తయారైనవి అయి ఉండవచ్చు. అలాగే కుండ తీసుకున్న తర్వాత అందులో నీటిని నింపి పరీక్షించండి. నీళ్లు అతిగా కుండ పై భాగంలో కనిపించకపోతే నాణ్యమైనదని అర్థం.
Read Also: Real Ghee vs Fake Ghee: స్వచ్ఛమైన నెయ్యికి, కల్తీ నెయ్యికి తేడాలేంటి.. గుర్తించడమెలా..
Microwave Care: ఓవెన్ క్లీన్ చేసేటప్పుడు కామన్‌గా చేసే 5 తప్పులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు..
Beauty Tips: వేసవిలో ముఖం మెరవాలంటే.. ఇంట్లోనే ఈ