Chanakya Neeti: ఇలాంటి వాళ్లను నమ్మి ఇంటికి పిలిచారో అంతే..
ABN , Publish Date - Apr 04 , 2025 | 04:31 PM
Chanakya Neeti: మనిషికి మనషే ప్రధాన శత్రువు. కొన్నిస్లారు శత్రువు ఎవరో మనకు తెలుస్తుంది. మరికొన్ని సార్లు శత్రువు.. మిత్రువు రూపంలో పక్కనే ఉన్నా కనుక్కోలేము. ఆచార్య చాణక్యుడు చెప్పిన ప్రకారం.. ఇలాంటి వారితో జాగ్రత్తగా ఉంటే మన జీవితం సాఫీగా సాగుతుంది.

అడవిలో బ్రతికే జంతువులకు శత్రువులు వేరే జాతికి చెందినవే ఉంటాయి. క్రూరమృగాలైనా సరే.. ఒకే జాతికి చెందిన వాటితో ఎంతో సామరస్యంగా జీవిస్తాయి. ఆటవిక న్యాయాన్ని పాటిస్తాయి. కానీ, తెలివైన జంతువైన మనిషికి.. మనిషే శత్రువు. ఓ మనిషి మరో మనిషి సంతోషంగా ఉంటే తట్టుకోలేడు. అవశాశం కల్పించుకుని మరీ అతడ్ని నాశనం చేయడానికి ప్రయత్నిస్తాడు. మనకు మన శత్రువు ఎవరో తెలిస్తే.. వారితో జాగ్రత్తగా ఉండొచ్చు. కానీ, కొన్ని సార్లు మన శత్రువు ఎవరో కూడా తెలీదు. అలాంటి వారిని కనుక్కోవటం కష్టం.. వారినుంచి తప్పించుకోవటం కూడా కష్టమే..
అయితే.. కొన్ని రకాల మనుషుల్ని ఇంటికి పిలవకుండా ఉంటే.. మనకు ఎంతో మేలు జరుగుతుందని ఆచార్య చాణక్యుడు చెప్పాడు. మనం మనతో ఎవరైతే సన్నిహితంగా ఉంటారో.. వాళ్లనే ఇంటికి పిలుస్తాము. ఇంటికి పిలిచే చనువు ఉందంటే వారు మనకు మంచి మిత్రులు అయి ఉంటారు. అలాంటి వారితో స్నేహం చేయకుండా దూరంగా ఉండాలని ఆచార్య చాణక్యుడు అన్నాడు. ఈ కింద చెప్పిన ఐదు రకాల మనుషులకు ఎంత దూరంగా ఉంటే.. మన జీవితం ప్రశాంతంగా ఉంటుంది.
తరచుగా బాధించే వారు
కొంతమంది ఉంటారు. వాళ్లకు ఎదుటి వ్యక్తులను హింసించటమే ఓ పని.. మనల్ని బాధపెట్టేలా మాట్లాడతారు. మనం బాధపడతామని తెలిసినా కూడా పట్టించుకోరు. మన ఫీలింగ్స్‌కు ఎలాంటి విలువ ఉండదు. ఎదుటి వ్యక్తుల్ని బాధ పెట్టి పైశాచిక ఆనందం పొందటమే వారికి ‘అదో తుప్తి’..
అవకాశవాదులు
ఇలాంటి వారితో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీళ్లతో స్నేహం కూడా చాలా ప్రమాదకరం. వీళ్లు మనతో అవసరం ఉన్నవరకే ఉంటారు. తర్వాత మనం కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోరు. వీరు మనల్ని వారి జీవితంలో ఒక అవసరంగా మాత్రమే చూస్తారు.
తెలివెైన మోసగాళ్లు
తెలివెైన మోసగాళ్లను అస్సలు నమ్మకూడదు. వీళ్లతో ఎప్పటికైనా నష్టమే. వీళ్లు మన మెదడుతో ఓ ఆట ఆడుకుంటారు. మనల్ని మ్యానుపులేట్ చేసి, దారుణంగా దెబ్బతీస్తారు. వాళ్ల అవసరాలను బట్టి మనల్ని ఎంతకైనా దిగజారుస్తారు.
నయవంచకులు
మన ముందు ఒకలా.. మనం లేనప్పుడు ఒకలా ప్రవర్తించే వారు పాము కంటే ప్రమాదకరమైన వాళ్లు. మనతో ఎంతో నిజాయితీగా ఉన్నట్లు నటిస్తారు. మనంత మంచోళ్లు లేరు అంటూ పొగుడుతారు. మనం పక్కకు వెళ్లగానే మన గురించి మిగిలిన వారికి చెడుగా చెబుతారు.
నెగిటివ్ గాళ్లు..
వీళ్లకు పాజిటివ్ అనే పదానికి అర్థం కూడా తెలీదు. ప్రతీ చిన్న విషయంలో చెడును వెతుకుతారు. ఎప్పుడూ నెగిటివ్‌గా మాట్లాడుతారు. వాళ్లు కృంగిపోవటమే కాకుండా.. మనల్ని కూడా వెనక్కులాగేస్తారు.
ఇవి కూడా చదవండి:
Donald Trump: డొనాల్డ్ ట్రంప్‌కి మరో దెబ్బ.. అమెరికా వస్తువులపై కూడా 34% సుంకం..
NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి