Water Bottle Car: కారులో వాటర్ బాటిల్ ఉంచుతున్నారా.. అవి తాగితే ఏమవుతుందో తెలిస్తే..
ABN , Publish Date - Apr 15 , 2025 | 06:02 PM
Bottled Water In Summer Car: కారులో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది సౌకర్యం కోసం నీళ్ల బాటిల్ పెట్టుకుంటూ ఉంటారు. ప్రయాణం పూర్తయిన తర్వాత వాటి గురించి పెద్దగా పట్టించుకోరు. మరుసటి మళ్లీ కారులో ట్రావెల్ చేసేటప్పుడు దాహమేస్తే అదే బాటిళ్లో నీరు తాగుతారు. ఇంతకీ వాటిని తాగలా.. పారవేయాలా..

Car Safety Tips For Summer: మీరు ఎప్పుడైనా రోడ్డు ప్రయాణం కోసం కారులో నీళ్ల బాటిల్ పెట్టి దాని గురించి మర్చిపోయారా.. లేదా, మీరు ప్రతిరోజూ కారు ప్రయాణం చేసేవారైతే కారులో "అత్యవసర పరిస్థితిలో" తాగేందుకని వాటర్ బాటిల్‌ను నిల్వ ఉంచారా.. ఆ తరువాత అది ఏ సీటు కిందో కనిపిస్తే తాగుతున్నారా.. ఇది మీకు సాధారణంగానే అనిపించవచ్చు. కానీ, అసలు నిజం తెలిస్తే ఆశ్చర్యపోకుండా ఉండలేరు. ఇంతకీ కారులో నిల్వ ఉంచిన వాటర్ బాటిల్ నీళ్లు ఎన్నాళ్లు తాగాలి.. అసలు అలా కారులో పెట్టుకోవచ్చా.. ఈ నీళ్ళు తాగేందుకు సురక్షితమైనవా? కాదా?
కారులో వాటర్ బాటిల్ పెడితే ఏమవుతుంది..
వేడి కారులో వాటర్ బాటిల్ అలాగే వదిలేసి మళ్లీ డ్రైవ్ చేసేటప్పుడు తాగే అలవాటు చాలామందికి ఉంటుంది. ఇది సురక్షితమేనా? సింపుల్ గా చెప్పాలంటే కాదు. ఎందుకంటే ప్లాస్టిక్ వాటర్ బాటిల్ ఎక్కువసేపు కారులో ఉండే వేడికి గురైతే హానికరమైన ప్లాస్టిక్ కణాలు కరిగి నీటిలోకి విడుదలవుతాయి. ఎన్విరాన్‌మెంటల్ సైన్స్ అండ్ టెక్నాలజీ అధ్యయనం ప్రకారం ఒక లీటర్ నీళ్ల బాటిళ్లో ట్రిలియన్ల కొద్దీ ప్లాస్టిక్ నానోపార్టికల్స్ నీటిలోకి విడుదలవుతాయి. ఈ రసాయనాలు హార్మోన్ల సమతుల్యతకు ఆటంకం కలిగించి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తాయి. మరో సమస్య కూడా ఉంది. అదే బాక్టీరియా పెరుగుదల. అందుకే చాలాసార్లు వేడి ప్రదేశాల్లో ఉంచిన నీళ్ల బాటిళ్ల నీళ్లను సిప్ చేయగానే చేదుగా ఉంటాయి. తాగేందుకు అసహ్యకరంగా అనిపిస్తాయి. వేడి వాతావరణంలో ఈ సూక్ష్మజీవులు మరింత వృద్ధిచెందుతాయి. ఈ నీటిని తాగితే కడుపులో అసౌకర్యం, జీర్ణ సమస్యలు, దీర్ఘకాలిక అనారోగ్యాలు రావచ్చు.
ఇలాంటి పరిస్థితుల్లో, ముఖ్యంగా వేసవిలో రోజంతా హైడ్రేటెడ్ గా ఉండేందుకు కొన్ని మార్గాలు..
1. ప్లాస్టిక్ బాటిల్ వాడటానికి బదులుగా ఇన్సులేటెడ్ బాటిల్ తీసుకెళ్లండి. స్టెయిన్‌లెస్ స్టీల్ లేదా ఇన్సులేటెడ్ వాటర్ బాటిల్ కొనండి. ఇందులో బయట వేడితో సంబంధం లేకుండా నీరు చల్లగా, తాగేందుకు సురక్షితంగా ఉంటుంది.
2. మీరు నీరు తాగడం మర్చిపోతుంటారని భావిస్తే ఫోన్‌లో రిమైండర్‌లను సెట్ చేసుకోండి లేదా హైడ్రేషన్-ట్రాకింగ్ యాప్‌ని ఉపయోగించండి. ఈ చిన్న టిప్స్ మీరు హైడ్రేటెడ్‌గా ఉండటానికి, డీహైడ్రేషన్ సంబంధిత అలసటను నివారించడానికి సహాయపడతాయి.
3. సాధారణ నీటిని తాగడానికి బదులుగా సహజ పదార్ధాలతో చేసిన పానీయాలు తాగేందుకు ప్రయత్నించండి. రుచికరంగా ఉండటానికి నిమ్మకాయ , పుదీనా, దోసకాయ లేదా బెర్రీలు జోడించి తాగండి. అప్పుడు నీరు మరింత ఎక్కువగా తాగాలని అనిపిస్తుంది.
4.దాహం వేస్తోంది అంటే మీరు ఇప్పటికే డీహైడ్రేషన్ కు గురయ్యారని అర్థం. ఆ సిగ్నల్ కోసం వేచి ఉండటానికి బదులుగా క్రమం తప్పకుండా నీరు తాగడం అలవాటు చేసుకోండి. ప్రతి 30 నిమిషాలకు అర గ్లాసు నీరు తాగాలనే నియమం విధించుకుంటే రోజంతా హైడ్రేటెడ్ గా ఉంటారు.
5. పనివేళల్లో, ప్రయాణాల్లో లేదా ఇంట్లో ఉన్నా ఎల్లప్పుడూ నీటి బాటిల్‌ను చేతికి అందేంత దూరంలో పెట్టుకోండి. నీటిని అందుబాటులో ఉంచుకోవడం వల్ల రోజంతా తాగడం సులభం అవుతుంది. మీ శరీరం సహజంగా డీటాక్సిఫికేషన్ ప్రక్రియకు మద్దతు ఇస్తుంది.
6. హైడ్రేషన్ అంటే కేవలం నీరు తాగడం మాత్రమే కాదు. నీరు అధికంగా ఉండే ఆహారాన్ని చేర్చుకోవడం ద్వారా మీరు హైడ్రేటెడ్ గా ఉండవచ్చు. పుచ్చకాయ , దోసకాయ, నారింజ, స్ట్రాబెర్రీ వంటి పండ్లు, తాజా కూరగాయలను తినండి. ఇవి అవసరమైన విటమిన్లు, ఖనిజాలను అందించి శరీరంలో హైడ్రేషన్ స్థాయిలను నిర్వహించడానికి సహాయపడతాయి.
Oily Skin Tips: జిడ్డు చర్మం బాధిస్తోందా.. ఉదయాన్నే ఇలా చేస్తే కొత్త మెరుపు మీ సొంతం..
Summer Fruits: సమ్మర్‌లో ప్రతిరోజూ ఈ 7 పండ్లు తినండి.