Kitchen Knife: కిచెన్ కత్తి పదును తగ్గిందా.. ఈ సింపుల్ టిప్స్‌తో కొత్తగా మార్చేయండి..
ABN , Publish Date - Apr 09 , 2025 | 08:50 PM
Kitchen Knife Sharpening Tips: మీ వంటగదిలో కత్తి పదును తగ్గిపోయి కూరగాయలు కోయడం కష్టంగా మారిందా.. కొత్త కత్తి కొనాలని ఆలోచిస్తున్నారా.. అవసరం లేదు.. ఇంట్లోనే కొన్ని సాధారణ పద్ధతులతో మీ కిచెన్ కత్తిని పదును చేసుకోవచ్చు.

Kitchen Knife Sharpening Tips At Home: ఇంట్లో వంట చేస్తుంటే కత్తి (నైఫ్) చాలా అవసరం. అది బాగా షార్ప్‌గా లేకపోతే కట్ చేయడం కష్టంగా మారుతుంది. కూరగాయలు సరైన షేప్‌లో కట్ కాకపోవచ్చు. తక్కువ సమయంలో కష్టపడకుండా వంట చేసేందుకు కత్తి షార్ప్‌గా ఉండడం చాలా ముఖ్యం. కానీ, కత్తిని రోజూ ఉపయోగించడం వల్ల పదును తగ్గుతుంది. కానీ చింతించకండి, దీన్ని సరిచేయడం చాలా సులభం.కత్తిని పదును చేసే సులభ పద్ధతులుఇంట్లో ఉండే వస్తువులతో కత్తిని పదును చేయడానికి కొన్ని టెక్నిక్‌లు ఇక్కడ ఉన్నాయి.
కత్తి పదును తగ్గిందని ఎలా తెలుస్తుంది?
కూరగాయలు కట్ చేయడం కష్టంగా అనిపించినా.. సమంగా కట్ కాకపోయినా.. నెమ్మదిగా కట్ అవుతున్నా కత్తి పదును తగ్గిందని అర్థం.
కత్తిని ఎన్నిసార్లు పదును పెట్టాలి?
హోమ్ కుక్స్: నెలకు ఒకసారి లేదా రెండుసార్లు
ప్రొఫెషనల్ చెఫ్స్: 10 రోజులకు ఒకసారి
కానీ ఓవర్షార్ప్ చేస్తే కత్తి ఎడ్జ్ డ్యామేజ్ అవుతుంది. జాగ్రత్త!
షార్పెనర్ లేకుండా కత్తిని పదును పెట్టే 4 సులభమైన పద్ధతులు:
సిరామిక్ మగ్ -
కప్పును తలకిందుగా తిప్పండి. కత్తిని 20 డిగ్రీల కోణంలో పట్టుకుని మగ్ దిగువన ఉన్న గరుకు భాగంపై 10-15 సార్లు రుద్దండి.రెండు వైపులా ఇలాగే పదును పెట్టండి. షార్పనింగ్ స్టోన్ లేకపోతే ఇది తాత్కాలికంగా అద్భుతంగా పనిచేస్తుంది.
గార్డెన్ స్టోన్ -
ఇంటి దగ్గర ఉన్న స్మూత్ స్టోన్ తీసుకుని నీళ్లతో తడిపి కత్తిని దానిపై నెమ్మదిగా రుద్దుండి. షార్ప్ అవుతుంది.
ఇంకో కత్తితో
ఒక కత్తితో మరో కత్తి స్పైన్ మీద రుద్దండి. తాత్కాలిక పరిష్కారంగా ఉపయోగపడుతుంది.
షార్పనింగ్ స్టోన్ లేదా సిరామిక్ మగ్ మీ ఇంట్లో ఏది ఉన్నా ఈ టెక్నిక్‌లతో మీ కత్తి కొత్తలా మారుతుంది. ఇక వంట చేయడం మరింత సులభంగా పూర్తవుతుంది.
Read Also: AC Tips: AC శబ్దం చికాకు పెడుతోందా.. కారణాలు, పరిష్కారాలు ఇవిగో..
Dust Cleaning Tips: క్లీన్ చేసిన తర్వాతా వస్తువులపై దుమ్ము కనిపిస్తోందా.. ఈ ట్రిక్‌తో..
Vastu Tips: ఈ వస్తువులు ఇంట్లో ఉంటే ఆర్థిక ఇబ్బందులు