Hair Cut: ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. ఇవి తెలుసుకోకపోతే మీ కొంప కొల్లేరే
ABN , Publish Date - Apr 13 , 2025 | 09:05 AM
ఆదివారం హెయిర్ కట్ చేయిస్తున్నారా.. హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం హెయిర్ కట్ చేయించుకోకూడదా. ఉత్తరాది, దక్షిణాది రాష్ట్రాల్లో ఆచారాలు వేర్వేరుగా ఉన్నాయా. అసలు ఆదివారం హెయిర్ కట్ చేయించుకుంటే ఏమవుతుంది.

ఆదివారం వచ్చిందంటే చాలు వ్యక్తిగత పనులపై దృష్టిపెట్టడం సర్వసాధారణం. వారంలో ఐదు నుంచి ఆరు రోజుల పని తర్వాత వచ్చే ఆదివారం ఎన్నో పనులు పెట్టుకుంటారు. ముఖ్యంగా గడ్డం గీసుకోవడం, హెయిర్ కట్ వంటివి ఆదివారం చేయించుకుంటారు. సాధారణంగా మంగళవారం, శుక్రవారం రోజుల్లో ఎక్కువమంది హెయిర్‌కట్ చేయించరు. ఆదివారం చేయించుకోవడానికి ప్రాధాన్యత ఇస్తారు. కారణం ఫ్రీ టైమ్ ఎక్కువుగా ఉండటంతో కంగారు పడకుండా ప్రశాంతంగా చేయించునేందుకు ఆదివారం సెలూన్ షాపులకు వెళ్తుంటారు. కానీ హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారం హెయిర్ కటింగ్ శుభప్రదం కాదట. ముఖ్యంగా దక్షిణ భారతదేశంలో ఈ సంప్రదాయాన్ని తక్కువుగా పాటిస్తారు. ఉత్తర భారతదేశంలో మాత్రం ఈసంప్రదాయాన్ని ఎక్కువుగా పాటిస్తారు. ఆదివారం ఎందుకు హెయిర్‌కట్ చేయించుకోకూడదు. హెయిర్‌కట్‌తో రోజులకు ఏి సంబంధమో ఈ కథనంలో తెలుసుకుందాం.
ఆదివారం ఎందుకు చేయించకూడదు
హిందూ సంప్రదాయం ప్రకారం ఆదివారాన్ని సూర్యభగవానుడికి అంకితం చేస్తారు. అందుకే ఈరోజును భానువారమని కూడా పిలుస్తారు. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం సూర్యుడు ఆరోగ్యం, శక్తి, సంపద గౌరవానికి సంకేతం. దీంతో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం జుట్టు లేదా గోళ్లు కత్తిరించడం వలన సూర్యుడి సానుకూల ప్రభావం తగ్గుతుందని, తద్వారా ఆరోగ్యం లేదా ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశం ఉందట. ఈ విశ్వాసం ఉత్తర భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో ఉంది. ఉత్తరాదిలోని గ్రామీణ ప్రాంతాల్లో ఆదివారం హెయిర్ కట్ చేయించకూడదనే ఆచారాన్ని ఫాలో అవుతారట. జుట్టు కత్తిరించడం వలన సంపద లేదా శక్తి తగ్గిపోవడానికి దారితీస్తుందని కొందరు భావిస్తారు. జుట్టును శరీరంలోని శక్తి కేంద్రంగా చెబుతారు. అందుకే ఆదివారం హెయిర్ ట్‌కు దూరంగా ఉంటారంట.
తెలుగు రాష్ట్రాల్లో
తెలుగు రాష్ట్రాల్లో వ్యక్తి పుట్టనరోజు రోజున, మంగళవారం, శనివారం హెయిర్ కట్‌ను ఎక్కువమంది చేయించరు. అలాగే అమావాస్య, పౌర్ణమి రోజు కూడా కటింగ్ చేయించరు. హెయిర్‌కట్‌తో పాటు ఆదివారం అసలు చేయకూడని మరికొన్ని పనులు ఉన్నాయంట. అవి ఏమిటంటే ఇంటిని ఊడ్చడం, ఆదివారం ఇంటిని ఊడ్చడం, శుభ్రం చేయడం వలన సానుకూల శక్తి తగ్గుతుందని నమ్మకం, కొత్త పనులన ఆదివారం ప్రారంభించడం శుభకరం కాదట. వాస్తవానికి ఈ నమ్మకాలు సాంస్కృతిక, ప్రాంతీయ ఆచారాలపై ఆధారపడి ఉంటాయి. శాస్త్రీయంగా ఆదివారం ఈ పనులు చేయకూడదని ఆధానాలే లేనప్పటికీ ఈ ఆచారాలు మానసిక శాంతి, క్రమశిక్షణ కోసం పాటిస్తారు. సాధారణంగా ఆదివారం రోజు ఎక్కువుగా పనులు పెట్టుకోవడం కంటే విశ్రాంతికి ప్రాధాన్యత ఇస్తే ఆరోగ్యానికి మంచిదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.
ఇవి కూడా చదవండి:
Meta: మెటా మార్క్ జుకర్‌బర్గ్ చైనాతో ఒప్పందం..అమెరికాను మోసం చేశాడా..
SVPNPA Job Openings: హైదరాబాద్ పోలీస్ అకాడమీలో డ్రీమ్ జాబ్స్..మీకు అర్హత ఉందా, అప్లై చేశారా
మరికొన్ని వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Read More Latest Telugu News Click Here