Share News

Sanatan Vedic Nation : సనాతన వైదిక దేశమే లక్ష్యం

ABN , Publish Date - Jan 27 , 2025 | 05:08 AM

భారత్‌ను సనాతన వైదిక దేశంగా మార్చడమే లక్ష్యమని పేర్కొంటూ ఆదివారం ఇక్కడ ముగిసిన ధర్మ్‌ సంవాద్‌ సమావేశంలో తీర్మానించారు. కుంభమేళా సందర్భంగా ఇక్కడ శ్రీపంచ దశాహ్నం జున అఖాడా ఆధ్వర్యంలో స్వామి నరేంద్ర నాథ్‌ సరస్వతి అఽధ్యక్షతన రెండు రోజుల పాటు ఈ

Sanatan Vedic Nation : సనాతన వైదిక దేశమే లక్ష్యం

ధర్మ్‌ సంవాద్‌లో తీర్మానం

మహాకుంభ్‌నగర్‌, జనవరి 26: భారత్‌ను సనాతన వైదిక దేశంగా మార్చడమే లక్ష్యమని పేర్కొంటూ ఆదివారం ఇక్కడ ముగిసిన ధర్మ్‌ సంవాద్‌ సమావేశంలో తీర్మానించారు. కుంభమేళా సందర్భంగా ఇక్కడ శ్రీపంచ దశాహ్నం జున అఖాడా ఆధ్వర్యంలో స్వామి నరేంద్ర నాథ్‌ సరస్వతి అధ్యక్షతన రెండు రోజుల పాటు ఈ సమావేశం జరిగింది. ఇస్లామిక్‌ జిహాద్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా హిందువులపై దాడులు జరుగుతుండడాన్ని ఈ సమావేశం ఖండించింది. వక్ఫ్‌ బోర్డును తక్షణమే రద్దు చేయాలని డిమాండు చేసింది. సనాతన ధర్మ పరిరక్షణకు పోరాటం చేస్తున్న ఘాజియాబాద్‌లోని దన్సాదేవి మందిర ప్రధాన అర్చకుడు, మహామండలేశ్వర్‌ యతి నరసింగానంద్‌ గిరికి మద్దతు తెలుపుతున్నట్టు ప్రకటించింది.

Updated Date - Jan 27 , 2025 | 05:08 AM