Chhattisgarh: 26 మంది నక్సలైట్లు లొంగుబాటు
ABN , Publish Date - Apr 07 , 2025 | 06:41 PM
తాజా లొంగుబాటులతో 2022 జూన్ నుంచి ఇంతవరకూ దంతేవాడలో ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ల సంఖ్య 953కు పెరిగింది. వీరిలో 224 మందిపై రివార్డు ఉంది.

దంతేవాడ: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు మరో గట్టి దెబ్బ తగిలింది. వచ్చే ఏడాది మార్చిలోగా దేశంలో మావోయిస్టులను పూర్తిగా ఏరివేస్తామని కేంద్ర హోం శాఖ అమిత్‌షా పదేపదే చేస్తున్న హెచ్చరికలు, రాష్ట్ర ప్రభుత్వ పునరావాసాల చర్యలతో దంతేవాడలో 26 మంది మావోయిస్టులు సోమవారంనాడు లొంగిపోయారు. లొంగిపోయిన వారిలో రివార్డులు ప్రకటించిన పలువురు మావోయిస్టులు కూడా ఉన్నారు.
Badlapur Encounter: బద్లాపూర్ ఎన్‌కౌంటర్ కేసులో మంబై హైకోర్టు సంచలన తీర్పు
కొద్ది నెలలుగా భద్రతా బలగాలకు, నక్సల్స్‌కు మధ్య పలు ఎన్‌కౌంటర్లు చోటుచేసుకున్నాయి. అయితే క్రమంగా నక్సల్స్‌లో మార్పు కనిపిస్తోంది. లొంగిపోవడానికి ఐచ్ఛికంగా ముందుకు వస్తున్నారు. తాజాగా 26 మంది నక్సలైట్లు లొంగిపోవడంపై దంతేవాడ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గౌరవ్ రాయ్ మాట్లాడుతూ, పోలీస్ సీనియర్ అధికారులు, సీఆర్‌పీఎఫ్ అధికారుల ముందు వీరంతా లొంగిపోయినట్టు చెప్పారు. అడవుల్లో ఎదుర్కొంటున్న ఇబ్బందులు, అంతర్గత విభేదాలు, మావోయిస్టు సిద్ధాంతాలపై భ్రమలు తొలగిపోవడం వంటివి ఇందుకు కారణాలుగా వారు చెప్పినట్టు తెలిపారు. లొంగిపోయిన వారంతా జన్మిలీషియా, రివల్యూషనరీ పార్టీ కమిటీ (ఆర్‌సీసీ), మావోయిస్ట్ జనతన సర్కార్ విభాగాలు, దండకారణ్య ఆదివాసి కిసాన్ మజ్దూర్ సంఘటన్ (డీఏకేఎంఎస్), చేతనా నాట్యమండలి (సీఎన్ఎం)కి చెందిన వారని వివరించారు. లొంగిపోయిన మావోయిస్టులలో రాజేష్ కశ్యప్‌పై రూ.3 లక్షలు, కోసా మాద్విపై రూ.1, ఛోటు కుంజంపై రూ.50 వేలు రివార్డు ఉందని అధికారులు తెలిపారు.
కాగా, తాజా లొంగుబాటులతో 2022 జూన్ నుంచి ఇంతవరకూ దంతేవాడలో ఆయుధాలు విడిచిపెట్టి జనజీవన స్రవంతిలో కలిసిన నక్సలైట్ల సంఖ్య 953కు పెరిగింది. వీరిలో 224 మందిపై రివార్డు ఉంది. ఒక్క 2024లోనే బస్తర్ ప్రాంతం నుంచి 792 మంది నక్సలైట్లు లొంగిపోయారు. బస్తర్‌లో దంతేవాడతో సహా ఏడు జిల్లాలు ఉన్నాయి.
ఇవి కూడా చదవండి..
Indigo flight: గాలిలో ఉండగానే మహిళ మృతి.. విమానం ఎమర్జెన్సీ ల్యాండింగ్
Mary Kom: 20 ఏళ్ల బంధానికి ముగింపు.. విడాకులు తీసుకోబోతున్న మేరీ కోమ్
Waqf Act in Supreme Court: వక్ఫ్ చట్టంపై సుప్రీం విచారణ.. కీలక వ్యాఖ్యలు చేసిన ధర్మాసనం
For National News And Telugu News