Dehuli Massacre Case: 24 మంది దళితుల హత్య కేసులో కోర్టు కీలక తీర్పు
ABN, Publish Date - Mar 18 , 2025 | 06:55 PM
24 మంది దళితుల హత్య కేసులో 44 సంవత్సరాల తర్వాత మెయిన్‌పురి జిల్లా కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ముగ్గురు నిందితులకు మరణ శిక్ష విధిస్తున్నట్లు ప్రకటించింది.

దాదాపు 44 ఏళ్ల క్రితం జరిగిన 24 మంది దళితుల ఊచకోత కేసులో కోర్టు కీలక తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ముగ్గురికి మరణశిక్ష పడింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు మరణశిక్ష విధించింది జిల్లా కోర్టు. 1981 నవంబర్ 18న దేహులిలో జరిగిన ఈ ఘోర ఘటనలో మొత్తం 24 మంది దళితులు హత్యకు గురయ్యారు. మరణించిన వారిలో ఆరు నెలల, రెండు సంవత్సరాల వయస్సుకన్న పిల్లలు కూడా ఉన్నారు.
ఈ హత్య కేసులో 17 మంది నిందితులుగా ఉన్నారు. అయితే వీరిలో 14 మంది మరణించారు. తాజాగా ఈ కేసు విచారణ జరిపిన కోర్టు రామ్‌సేవక్ (70), కప్తాన్ సింగ్ (60), రాంపాల్ (60) అనే ముగ్గురు నిందితులను దోషిగా తేల్చి, వారికి మరణశిక్షను విధించింది. ఈ శిక్ష మాత్రమే కాదు, కోర్టు అదనంగా రూ.50,000 జరిమానా కూడా విధించింది.
అసలు ఏం జరిగింది..
1981 నవంబర్ 18న, ఉత్తరప్రదేశ్ దేహులి గ్రామంలో నిందితులు పోలీసు యూనిఫాంలో ఉండగా, దళితులను బందిపోట్లుగా మార్చి విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు. వీరిలో 17 మంది పోలీసు యూనిఫాంలో ఉన్న వారే పాలుపంచుకున్నారు. దీనిపై న్యాయవాది రోహిత్ శుక్లా మాట్లాడుతూ, ఈ ఘటన ఒక చారిత్రక మరణహోమంలా ఉందని పేర్కొన్నారు. దేహులిలో దళితులు వ్యవసాయ పనులకు సంబంధించిన పనులు చేసుకునే వారు. వారి జీవనం సాదాసీదాగా సాగిపోతుండగా, ఈ ఘటన జరగడం నేరమైన చర్యగా పేర్కొన్నారు.
చివరకు న్యాయం
ఈ ఘటన కేవలం హత్యగా కాకుండా, ఒక సామాజిక హింసగా కూడా నిలిచిందన్నారు న్యాయవాది. నిందితుల మొత్తం 17 మందిలో, 14 మంది ఇప్పటికే మరణించినట్లు తెలిపిన కోర్టు, మిగిలిన ముగ్గురికి మాత్రం మరణశిక్ష విధించారు. ఈ దళిత హత్యా కేసులో ప్రతి ఒక్కరి పాత్ర కూడా వివిధ కోణాలలో చర్చకు వస్తోంది. దేహులిలో జరిగిన ఈ ఘోర ఘటన తీర్పు ఆలస్యంగా వచ్చినా కూడా చివరకు న్యాయం జరిగిందని పలువురు అంటున్నారు. ఈ కేసులో 1981నాటి హత్యలపై 302 (హత్య), 307 (హత్యాయత్నం), 396 (దోపిడీతో హత్య) సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి.
ఇవి కూడా చదవండి:
BIg Alert: కొత్త ట్రాఫిక్ రూల్స్ తెలుసా..రూ.25 వేల ఫైన్, జైలు శిక్ష కూడా..
Recharge Offer: రూ.199 ప్లాన్ అదుర్స్.. డైలీ 3GB డేటా, అన్ లిమిటెడ్ కాల్స్..
Call Merging Scam: కొత్త రకం మోసం కాల్ మెర్జింగ్ స్కామ్..అలర్ట్ చేసిన కేంద్రం..
PM Surya Ghar Muft Bijli Yojana: రూ. 2 లక్షల వరకు పూచీకత్తు లేకుండా లోన్.. అందుకు ఏం చేయాలంటే..
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Read More Business News and Latest Telugu News
Updated Date - Mar 18 , 2025 | 07:11 PM