ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Train Accident: రైల్వే ట్రాక్‌పై కూర్చుని పబ్‌జీ ఆడిన కుర్రాళ్లు.. రైలు ఢీకొని ముగ్గురు..

ABN, Publish Date - Jan 03 , 2025 | 10:33 AM

ముగ్గురు యువకుల వింత చేష్టలు చివరకు వారి ప్రాణాలకే ముప్పు తెచ్చాయి. రైల్వే ట్రాక్‌పై కూర్చుని గేమ్ ఆడాలని అనుకున్నారు. అదే క్రమంలో ట్రైన్ రావడంతో ముగ్గురు యువకులు అక్కడికక్కడే మరణించారు. ఆ విశేషాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.

PUBG Railway Track accident

బీహార్‌(Bihar)లో రైలు ఢీకొని ముగ్గురు యువకులు మృతి (Railway Accident) చెందారు. ఈ ఘటన బెట్టియా జిల్లా ముఫాసిల్ పోలీస్ స్టేషన్ పరిధి మాన్సా తోలా రాయల్ స్కూల్ సమీపంలో చోటుచేసుకుంది. ఇక వివరాల్లోకి వెళితే నర్కటియాగంజ్ ముజఫర్‌పూర్ రైల్వే సెక్షన్‌లో ముగ్గురు యువకులు రైలు ట్రాక్‌పై కూర్చొని PUBG గేమ్ ఆడుతున్నారు. అదే క్రమంలో వేగంగా వచ్చిన రైలు ఢీకొనడంతో ముగ్గురు యువకులు మరణించారు. అయితే ట్రైన్ వస్తున్న సమయంలో ఆ యువకులు చెవుల్లో హెడ్‌ఫోన్స్ పెట్టుకుని గేమ్ ఆడుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.


మృతుల్లో

సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరణించిన యువకుల్లో రైల్వే గుమ్టిమన్షా తోలా నివాసి మహ్మద్ అలీ కుమారుడు ఫుర్కాన్ అలీ, మన్షా తోలా గ్రామానికి చెందిన మహ్మద్ తుంటున్ కుమారుడు సమీర్ ఆలం, మూడవ వ్యక్తి హబీబుల్లా ఆలంగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే వారి కుటుంబ సభ్యుల్లో రోదనలు మిన్నంటాయి. కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు.


ప్రాథమిక దర్యాప్తులో..

ప్రమాదం జరిగిన తర్వాత వందలాది మంది స్థానికులు ఘటనా స్థలానికి చేరుకుని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులు వారి పిల్లల మృతదేహాలను అంత్యక్రియల నిమిత్తం స్వగ్రామాలకు తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సదర్ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ (SDPO) వివేక్ దీప్, రైల్వే పోలీసులు ప్రమాద పరిస్థితులను పరిశీలించారు. ప్రమాదం వాస్తవ పరిస్థితులను తెలుసుకోవడానికి బాధితుల కుటుంబ సభ్యుల నుంచి కూడా వాంగ్మూలాలు తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకులు మొబైల్‌లో గేమ్‌లు ఆడుతున్నట్లు ప్రాథమిక దర్యాప్తులో వెల్లడైంది. రైల్వే ట్రాక్‌పై కూర్చొని ఫోన్‌లు చూస్తున్న క్రమంలో ప్రమాదం జరిగిందని ఎస్‌డీపీఓ వివేక్‌ దీప్‌ తెలిపారు.


పోలీసుల సూచన

ఈ ప్రమాదం నేపథ్యంలో పిల్లల గేమింగ్ అలవాట్ల విషయాన్ని వారి తల్లిదండ్రులు పర్యవేక్షించాలని పోలీసులు కోరారు. యువకులు వారి ఫోన్లలో ఎలాంటి యాప్స్ ఉపయోగిస్తున్నారనే విషయాలను పరిశీలించాలన్నారు. దీంతోపాటు భవిష్యత్తులో ఇటువంటి దుర్ఘటనలను నివారించడానికి బహిరంగ ప్రదేశాల్లో ఫోన్ల వినియోగంపై అప్రమత్తంగా ఉండాలన్నారు. ఇలాంటి గేమ్స్ లేదా ప్రమాదాల గురించి త్వరలో అవగాహన కల్పిస్తామని అధికారులు తెలిపారు. ఈ క్రమంలో రైల్వే ట్రాక్‌లపై ఎలాంటి అజాగ్రత్తలకు పాల్పడవద్దని అధికారులు, రైల్వే పోలీసులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అయితే ఈ ప్రమాదం విషయంలో మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి మరి.


ఇవి కూడా చదవండి:

Tax Relief: పన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్.. 87A పన్ను మినహాయింపు క్లెయిమ్ చేసుకునే ఛాన్స్


రిలయన్స్‌ జియో రూ.40,000 కోట్ల ఐపీఓ!


Personal Finance: జస్ట్ నెలకు రూ. 3500 సేవ్ చేస్తే.. రూ. 2 కోట్లు మీ సొంతం..

Investment Tips: రూ. 20 వేల శాలరీ వ్యక్తి.. ఇలా రూ. 6 కోట్లు సంపాదించుకోవచ్చు..


Personal Finance: రూ. 10 వేల పొదుపుతో రూ. 7 కోట్ల సంపాదన.. ఎలాగో తెలుసా..

Read More Business News and Latest Telugu News

Updated Date - Jan 03 , 2025 | 10:54 AM