Earthquake: భారత్‌లో భారీ భూకంపం..భయాందోళనలో జనం
ABN , Publish Date - Jan 07 , 2025 | 07:38 AM
Earthquake: నేపాల్-టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. లుబుచేకు 93కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు.
నేపాల్-టిబెట్ సరిహద్దులో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్‌పై భూకంప తీవ్రత 7.1గా నమోదైంది. లుబుచేకు 93కి.మీ. దూరంలో భూకంప కేంద్రాన్ని గుర్తించారు. భారత్‌లోని పలు ప్రాంతాల్లోనూ భూప్రకంపనలు వచ్చాయి. ఢిల్లీ - NCR ప్రాంతంలో తీవ్ర ప్రకంపనలు నమోదయ్యాయి. బిహార్‌లోని పాట్నాతో పాటు పలు జిల్లాల్లో ప్రకంపనలు భయాందోళనకు గురిచేశాయి. భారత్, చైనా, నేపాల్, భూటాన్, బంగ్లాదేశ్‌లో భూ ప్రకంపనలు వచ్చాయి. చైనాలో భూకంప తీవ్రత 6.9గా నమోదైంది. భూప్రకంపనలతో జనం భయాందోళనకు గురి అయ్యారు. ఒక్కసారిగా భూకంపం సంభవించడంతో ప్రజలు రోడ్లపైకి పరిగెత్తారు.
ఈ వార్తలు కూడా చదవండి
Nirmala Sitharaman: విశాఖ ఉక్కును విక్రయించొద్దు!
U.S. Snowstorm: అమెరికాలో మంచు తుఫాను బీభత్సం
Read Latest National News and Telugu News