UP Budget 2025: రైతులకు ఇచ్చిన హామీలు ఏవి.. యూపీ బడ్జెట్‌పై అఖిలేష్ యాదవ్ కీలక వ్యాఖ్యలు..
ABN, Publish Date - Feb 20 , 2025 | 03:39 PM
ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వ బడ్జెట్‌పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ క్రమంలో బీజేపీ రైతులకు ఇచ్చిన హామీలు పెరుగుతున్నాయి కానీ, రైతుల సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయని ఎద్దేవా చేశారు.

ఉత్తర్‌ప్రదేశ్ యోగి ఆదిత్యనాథ్ (yogi adityanath) ప్రభుత్వం 2025-2026 ఆర్థిక సంవత్సరానికి రూ. 8 లక్షల 8 వేల 736 కోట్ల 6 లక్షల బడ్జెట్‌ను (uttarpradesh budget 2025) ఈరోజు సమర్పించింది. ఇది 2024-2025 సంవత్సరపు బడ్జెట్ కంటే 9.8 శాతం ఎక్కువ కావడం విశేషం. అయితే ఈ బడ్జెట్‌పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ (Akhilesh Yadav) కీలక వ్యాఖ్యలు చేశారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి సంబంధించి అనేక హామీలు ఇచ్చినప్పటికీ, అవన్నీ నెరవేరలేదని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు పెరిగిపోతున్నాయి తప్ప, రైతుల సమస్యలు మాత్రం అలాగే ఉంటున్నాయని అఖిలేష్ విమర్శించారు.
ఈ హామీలు ఏవి..
ఈ క్రమంలో రైతుల సంక్షేమం కోసం ఇచ్చిన హామీల గురించి ప్రస్తావించారు అఖిలేష్ యాదవ్. బీజేపీ తన మ్యానిఫెస్టోలో రాబోయే ఐదు సంవత్సరాల్లో రైతులకు నీటిపారుదల కోసం ఉచిత విద్యుత్ అందిస్తామని హామీ ఇచ్చింది. కానీ ఈ హామీ నెరవేర్చలేదని అఖిలేష్ యాదవ్ అన్నారు. మరోవైపు సర్దార్ వల్లభాయ్ పటేల్ వ్యవసాయ మౌలిక సదుపాయాల మిషన్ కోసం రూ. 25 వేల కోట్లను కేటాయించడం. ఈ నిధుల ద్వారా రైతుల మౌలిక సదుపాయాలు మెరుగుపడే అవకాశం ఉన్నప్పటికీ, ఈ హామీ కూడా పూర్తిగా అమలు కాలేదని అఖిలేష్ అన్నారు.
కనీస మద్దతు ధర
అంతేకాదు రైతుల సహాయం కోసం కేంద్ర ప్రభుత్వం టమోటాలు, బంగాళాదుంపలు, ఇతర కూరగాయలకు కనీస మద్దతు ధర (MSP) ఇస్తామని హామీ ఇచ్చింది. ఈ పథకానికి వేల కోట్ల నిధులను కేటాయించామని బీజేపీ ప్రకటించింది. కానీ ఈ పథకం ఇంకా అమల్లోకి రాలేదని అఖిలేష్ గుర్తు చేశారు. అంతేకాదు గత కొన్ని సంవత్సరాలుగా రైతుల సంక్షేమానికి సంబంధించి తీసుకున్న చర్యలు ఆశించిన ఫలితాలను ఇవ్వలేకపోయాయని ఆరోపించారు.
జనాభా పరంగా టాప్..
ఈ క్రమంలో రైతుల సంక్షేమం గురించి మాట్లాడిన బీజేపీ, వారు ఇచ్చిన హామీలను ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు అఖిలేష్. జనాభా పరంగా దేశంలోనే అతిపెద్ద రాష్ట్రం యూపీ. విస్తీర్ణం పరంగా నాల్గో స్థానంలో ఉంది. కానీ తలసరి ఆదాయం పరంగా మాత్రం యూపీ టాప్ 10లో లేదని విమర్శలు చేస్తున్నారు. జనాభా పరంగా దేశంలో చివరి స్థానంలో ఉన్న సిక్కిం, తలసరి వార్షిక ఆదాయం పరంగా మొదటి స్థానంలో ఉందని నివేదికలు చెబుతుండటం విశేషం.
ఇవి కూడా చదవండి:
Deputy CM: డిప్యూటీ సీఎంకు బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News
Updated Date - Feb 20 , 2025 | 03:43 PM