Mahakumbh-Eknath Shinde: అద్భుతమైన అనుభూతి.. మహాకుంభ్‌ పుణ్యస్నానంపై ఏక్‌నాథ్ షిండే

ABN, Publish Date - Feb 24 , 2025 | 06:43 PM

దేశంలో సనాతన ధర్మం పాటించే 110 కోట్ల మందిలో సగం మందికి పైగా (55) ఇప్పటి వరకూ త్రివేణి సంగమ స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ప్రకటించటింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈనెల 26న మహా శివరాత్రి వరకూ కొనసాగనుంది.

Mahakumbh-Eknath Shinde: అద్భుతమైన అనుభూతి.. మహాకుంభ్‌ పుణ్యస్నానంపై ఏక్‌నాథ్ షిండే

ప్రయాగ్‌రాజ్: ప్రపంచంలోనే అతిపెద్ద ఆధ్యాత్మిక మేళాగా ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళా‌లో మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) కుటుంబసమేతంగా సోమవారంనాడు పాల్గొన్నారు. త్రివేణి సంగమంలో పవిత్రస్నానం ఆచరించారు. మహాకుంభ్‌ పర్యటన అద్భుతమైన అనుభూతిని ఇచ్చిందని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి యోగి సారథ్యంలోని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం చేసిన ఏర్పాట్లను ప్రశంసించారు.

Mahakumbhmela: మహాకుంభమేళాపై సోషల్ మీడియాలో తప్పుదారి పట్టించే కంటెంట్.. కేసులు నమోదు


''ఇదొక అద్భుతమైన అనుభూతి. ఈనేల విశ్వాసాలు, సామరస్యానికి మారుపేరు. ఈరోజు త్రివేణిసంగమంలో మేమంతా పవిత్ర స్నానాలు చేశాం. 144 ఏళ్ల తర్వాత జరుగుతున్న అసలు సిసలైన మహాకుంభ్ ఇది. ఇక్కడ ఏర్పాట్లు చాలా బాగున్నాయి. ముఖ్యమంత్రితో సహా యూపీ ప్రభుత్వం మొత్తం ఎంతో ఇన్వాల్‌మెంట్‌తో పనిచేస్తోంది. మోదీ విజన్‌కు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను'' అని షిండే అన్నారు.


కాగా, దేశంలో సనాతన ధర్మం పాటించే 110 కోట్ల మందిలో సగం మందికి పైగా (55) ఇప్పటి వరకూ త్రివేణి సంగమ స్నానాలు చేశారని యూపీ ప్రభుత్వం ప్రకటించటింది. జనవరి 13న ప్రారంభమైన కుంభమేళా ఈనెల 26న మహా శివరాత్రి వరకూ కొనసాగనుంది. 26న జరిగే చివరి అమృత్‌ స్నానాల నాటికి ఈ సంఖ్య 65 కోట్లు దాటుతుందని ప్రభుత్వం అంచనా వేసింది.


ఇవి కూడా చదవండి..

Thackeray Brothers: దగ్గరవుతున్న థాకరేలు.. పెళ్లి వేడుకలో మళ్లీ కలుసుకున్న సోదరులు

Congress: బీజేపీని ఎలా ఎదుర్కొందాం?

Tamil Nadu: పొల్లాచ్చి రైల్వేస్టేషన్‌లో హిందీ నేమ్‌ బోర్డుకు తారు

మరిన్ని జాతీయ, తెలుగు వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Updated Date - Feb 24 , 2025 | 06:43 PM