ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఎన్నికలు+ -

ఆధ్యాత్మికం+ -

వెబ్ స్టోరీస్+ -

Anna University: అత్యాచారం కేసులో కొనసాగుతున్న దర్యాప్తు

ABN, Publish Date - Jan 05 , 2025 | 01:38 PM

స్థానిక గిండిలోని అన్నా వర్సిటీ(Anna University)లో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో రెండో వ్యక్తి ప్రమేయముందని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నావర్సిటీలో బీఈ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థిని రాత్రిపూట తన ప్రియుడితో కలిసి ఆ ప్రాంగణంలో వుండగా, ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే.

- రాజకీయం చేయొద్దు: ఎంపీ కనిమొళి

- అవాస్తవాల ప్రసారం: రాష్ట్ర ప్రభుత్వం

చెన్నై: స్థానిక గిండిలోని అన్నా వర్సిటీ(Anna University)లో విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన కేసులో రెండో వ్యక్తి ప్రమేయముందని పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నావర్సిటీలో బీఈ సెకండియర్‌ చదువుతున్న విద్యార్థిని రాత్రిపూట తన ప్రియుడితో కలిసి ఆ ప్రాంగణంలో వుండగా, ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడిన విషయం తెలిసిందే. ఈ కేసులో జ్ఞానశేఖరన్‌ అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేగాక నిందితుడి నుంచి సెల్‌ఫోన్‌ను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఈ కేసు దర్యాప్తుకు హైకోర్టు ప్రత్యేక సిట్‌ను ఏర్పాటు చేసింది. ఈ దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. జ్ఞానశేఖరన్‌ సెల్‌ ఫోన్‌ డేటాను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. కాగా ఈ అత్యాచార ఘటనలో రెండో వ్యక్తి ప్రమేయం కూడా వున్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

ఈ వార్తను కూడా చదవండి: Chennai: రాష్ట్రంలో అప్రకటిత ఎమర్జెన్సీ..


అత్యాచారంపై రాజకీయాలా?

అన్నావర్సిటీ విద్యార్థిని అత్యాచార వ్యవహారాన్ని రాజకీయంగా చూడరాదని డీఎంకే ఎంపీ కనిమొళి(DMK MP Kanimozhi) ప్రతిపక్ష పార్టీలను కోరారు. ఆమె శనివారం మీడియాతో మాట్లాడుతూ... అత్యాచార కేసులో పోలీసులు తక్షణ చర్యలు చేపట్టి నిందితుడిని అరెస్టు చేశారని, ప్రస్తుతం కోర్టులో ఉన్న ఈ కేసులో నిందితుడికి కఠిన శిక్షపడితేనే బాధితురాలికి న్యాయం జరుగుతుందన్నారు.

అత్యాచార ఘటనను అన్ని పార్టీలు ఖండించాయని, తాను కూడా ట్విట్టర్లో ఖండించినట్లు తెలిపారు. నిందితుడ్ని అరెస్టు చేసిన తర్వాత కూడా ప్రతి పక్షాలు రాజకీయ లబ్ధి కోసం రాష్ట్రప్రభుత్వంపై బురద చల్లే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఎఫ్‌ఐఆర్‌ విడుదలకు రాష్ట్రప్రభుత్వంపై నిందమోపారని, కానీ సాంకేతిక లోపమే దీనికి కారణమని జాతీయ సమాచార కేంద్రం కూడా స్పష్టం చేసిందని కనిమొళి తెలిపారు.


అవాస్తవాల ప్రసారం వద్దు

స్థానిక గిండి అన్నా వర్శిటీ ప్రాంగణంలో ఇంజనీరింగ్‌ విద్యార్థినిపై జరిగిన అత్యాచార వ్యవహారంలో అవాస్తవాలు ప్రసారం చేయరాదని రాష్ట్ర ప్రభుత్వం సామాజిక మాధ్యమాలకు స్పష్టం చేసింది. శనివారం రాత్రి ఈ మేరకు సచివాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. మద్రాసు హైకోర్టు ఉత్తర్వుల మేరకు అన్నా వర్శిటీ విద్యార్థినిపై జరిగిన వేధింపుల కేసు దర్యాప్తు నిమిత్తం ప్రభుత్వం సిట్‌ను నియమించిందని, ఈ ప్రత్యేక దర్యాప్తు కమిటీ ప్రస్తుతం విచారణ వేగవంతం చేసిందని, విచారణకు సంబంధించిన ఎలాంటి వివరాలు సిట్‌ ప్రకటించలేదని పేర్కొంది.


అయినప్పటికీ, సామాజిక మాధ్యమాల్లో సిట్‌ దర్యాప్తు గురించిన అంశాలు ప్రసారమవుతున్నాయని, అత్యాచార వ్యవహారంలో తిరుప్పూర్‌కు చెందిన ఓ వ్యక్తికి సంబంధాలున్నట్లు సిట్‌ తెలిపినట్లు వస్తున్న వార్తల్లో ఎలాంటి ఆధారాలు లేవని తెలిపింది. ఇలాంటి అవాస్తవాలు ప్రసారం, పోస్ట్‌ చేసే సంస్థలకు చర్యలు చేపడతామని ప్రభుత్వం హెచ్చరించింది. కాగా, ఇలాంటి హెచ్చరికలను డీజీపీ కార్యాలయం కూడా జారీ చేయడం గమనార్హం.


ఈవార్తను కూడా చదవండి: ‘తెలుగు‘లో చదివితే ఉద్యోగాలు రావన్నది అపోహే

ఈవార్తను కూడా చదవండి: KTR: కేంద్రంలో చక్రం తిప్పుతాం

ఈవార్తను కూడా చదవండి: DK Aruna: చట్టసభల్లో మహిళల సంఖ్య పెరగాలి

ఈవార్తను కూడా చదవండి: ఖమ్మం అభివృద్ధిపై మంత్రి తుమ్మల కీలక నిర్ణయాలు

Read Latest Telangana News and National News

Updated Date - Jan 05 , 2025 | 01:38 PM