Annamalai: బీజేపీ అధ్యక్షుడి రేసులో లేను.. అన్నామలై కీలక వ్యాఖ్యలు

ABN, Publish Date - Apr 04 , 2025 | 06:01 PM

వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొత్తులపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు.

Annamalai: బీజేపీ అధ్యక్షుడి రేసులో లేను.. అన్నామలై కీలక వ్యాఖ్యలు

చెన్నై: బీజేపీ జాతీయ అధ్యక్షుడి ఎన్నిక కోసం వివిధ రాష్ట్రాల్లో నూతన అధ్యక్షుల నియామకాలు చురుకుగా జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే తమిళనాడు రాష్ట్ర అధ్యక్షుడి గురించి ఈనెల 9న ప్రకటన విడుదలయ్యే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతం ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూడా ఉన్న కె.అన్నామలై (Annamalai) కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంటుందని, తాను నాయకత్వ రేసులో లేనని చెప్పారు.

ప్లీజ్‌.. అన్నామలైని మార్చొద్దు


''తమిళనాడు బీజేపీలో ఎలాంటి పోటీ లేదు. మేము ఏకగ్రీవంగా నాయకుడిని ఎన్నుకుంటాం. నాయకత్వ రేసులో నేను పోటీ పడను'' అని చెప్పారు. 2011 కర్ణాటక బ్యాచ్‌కు చెందిన మాజీ ఐపీఎస్ అధికారి అయిన అన్నామలై 2020 ఆగస్టులో బీజేపీ చేరారు. కేవలం పది నెలల్లోనే ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.


వచ్చే ఏడాది తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగనుండటంతో పొత్తులపై కేంద్రంలో చర్చలు జరుగుతున్నాయి. అన్నాడీఎంకే చీఫ్ ఎడప్పాడి కె పళనిస్వామి ఇటీవల ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్‌షాను కలిశారు. ఈ నేపథ్యంలో అన్నాడీఎంకే-బీజేపీ పొత్తు ఉంటుందనే సంకేతాలు వెలువడ్డాయి. అయితే అన్నామలై విషయంలో అన్నాడీఎంకేకు కొన్ని అభ్యంతరాలు ఉన్నాయని, ఆయన స్థానంలో మరొకరిని పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకునే అవకాశాలున్నాయని కొద్దిరోజులుగా ప్రచారం జరుగుతోంది. తాను పార్టీ కార్యకర్తగా అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని అన్నామలై చెబుతున్నారు. ఈ క్రమంలో ఈ నెల 7న అన్నామలై ఢిల్లీ వెళ్లి పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాతో భేటీ అవుతారని తెలుస్తోంది.


ఇవి కూడా చదవండి..

Waqf Bill: వక్ఫ్ బిల్లుపై సుప్రీంకోర్టులో కాంగ్రెస్ ఎంపీ పిటిషన్

NEET Row: స్టాలిన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ.. నీట్ వ్యతిరేక బిల్లును నిరాకరించిన రాష్ట్రపతి

PM Modi: భద్రతా వలయంలో రామేశ్వరం..

For National News And Telugu News

Updated Date - Apr 04 , 2025 | 06:04 PM