P Chidambaram: ఎకనామిక్స్ స్టూడెంట్‌ను అడిగినా చెబుతుంది.. నిధులపై మోదీకి చిదంబరం కౌంటర్

ABN, Publish Date - Apr 06 , 2025 | 09:47 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు రామేశ్వరంలోని పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడులో మౌలిక సదుపాయాల కల్పనకు గత పదేళ్లలో భారీగా నిధులిచ్చామని చెప్పారు. 2014 కంటే ముందుతో పోల్చుకుంటే గత పదేళ్లలో తమిళనాడు అభివృద్ధికి మూడు రెట్లు అధికంగా నిధులిచ్చామన్నారు.

P Chidambaram: ఎకనామిక్స్ స్టూడెంట్‌ను అడిగినా చెబుతుంది.. నిధులపై మోదీకి చిదంబరం కౌంటర్

చెన్నై: తమిళనాడుకు కేంద్ర నిధుల కేటాయింపులు పెంచామంటూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) చెప్పడాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత, కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి పి.చిదంబరం (P Chidambaram) తోసిపుచ్చారు. మోదీ మాటలు తప్పుదారి పట్టించేలా ఉన్నాయని, వార్షిక నిధుల పెంపు అనేది రొటీన్‌గా జరిగే ప్రక్రియేనని, ఆ విషయం ఎకనామిక్స్ తొలి సంవత్సరం విద్యార్థినిని అడిగినా చెబుతుందని అన్నారు.

PM Modi: పాంబన్ బ్రిడ్జితో శరవేగంగా వాణిజ్యం, పర్యాటకాభివృద్ధి: మోదీ


ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారంనాడు రామేశ్వరంలోని పాంబన్ బ్రిడ్జి ప్రారంభోత్సవం సందర్భంగా తమిళనాడులో మౌలిక సదుపాయాల కల్పనకు గత పదేళ్లలో భారీగా నిధులిచ్చామని చెప్పారు. 2014 కంటే ముందుతో పోల్చుకుంటే గత పదేళ్లలో తమిళనాడు అభివృద్ధికి మూడు రెట్లు అధికంగా నిధులిచ్చామన్నారు. అయితే మోదీ వాదనను చిదంబరం తిప్పికొట్టారు. నిధుల కేటాయింపుల్లో ఏటా పెరుగుదల అనేది సహజ ప్రక్రియ అని, ఎకమానిక్స్ మొదటి తరగతి విద్యార్థినిని అడిగినా ఆ విషయం చెబుతుందని అన్నారు.


''కాలం గడిచే కొద్దీ వార్షిక కేటాయింపులు పెరుగుతుంటాయి. అయితే జీడీపీ నిష్పత్తికి అనుగుణంగా కేటాయింపులు చేశారా, ప్రభుత్వ మొత్తం వ్యయంకు అనుగుణంగా కేటాయింపులు జరగాయా అన్నదే అసలు విషయం. 2004-14 కంటే 2014-2024లో తమిళనాడు ఎక్కువ కేటాయింపులు జరిపామని ప్రధానమంత్రి నుంచి కేంద్రం మంత్రులు వరకూ అంతా పదేపదే ఏకరవుపెడుతున్నారు. తమిళనాడులో రైల్వే ప్రాజెక్టులకు ఏడు రెట్లు అధికంగా నిధులు ఇచ్చామంటున్నారు. తొలిసంవత్సరం ఎకనామిక్స్ విద్యార్థినిని ఒకసారి అడిగి చూడండి. ఆర్థిక కొలమానాలు గత సంవత్సరం కంటే ఎప్పుడూ ఎక్కువగానే ఉంటాయని ఆమె చెబుతుంది. గతంలో కంటే ఇప్పుడు డీజీపీ సైజు పెరిగింది. కేంద్ర బడ్జెట్ సైజు కూడా ప్రతి సంవత్సరం గత సంవత్సరం కంటే పెరుగుతుంది. ప్రభుత్వ వ్యయం కూడా గత సంవత్సరంతో పోలిస్తే ఎప్పుడూ పెరుగుతుంటుంది. అంకెలపరంగా చెప్పినప్పుడు ఎక్కువగానే ఉండొచ్చు. కానీ, జీడీపీ, మొత్తం వ్యయంకు తగ్గట్టుగా ఉందా అనేదే అసలు విషయం అవుతుంది'' అని చిదంబరం వివరించారు. కాగా, డీఎంకే ప్రభుత్వం సైతం ఇటీవల కేంద్రంపై విమర్శలు గుప్పించింది. నూతన విద్యావిధానంతో తాము విభేదిస్తు్న్నందువల్లే తమిళనాడుకు రావాల్సిన రూ.2,000 కోట్ల నిధులను కేంద్రం నిలిపివేసిందని ఆరోపించింది.


ఇవి కూడా చదవండి..

MK Stalin: ముందే చెప్పానన్న స్టాలిన్... పీఎం వస్తే ఇదేం మర్యాదని నిలదీసిన బీజేపీ

Pamban Bridge: పాంబన్ వంతెనను ప్రారంభించిన మోదీ

Roller Coaster Tragedyl: మరికొన్ని నెలల్లో పెళ్లి.. సరదా ప్రాణం తీసింది

Indian Air Force: నాలుగు రోజుల్లోనే ఎయిర్ ఫోర్స్‌కు మరో పెద్ద దెబ్బ

For National News And Telugu News

Updated Date - Apr 06 , 2025 | 09:51 PM