Share News

Vehicle Ban: ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ వాహనాలపై నిషేధం

ABN , Publish Date - Apr 09 , 2025 | 11:46 AM

రాష్ట్ర ప్రభుత్వం వాహనాదారులకు షాకిచ్చింది. పలు వాహనాలపై నిషేధం విధిస్తూ నిర్ణయం తీసుకుంది. త్వరలోనే ఇది అమల్లోకి రానుంది. ఇంతకు ఏ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.. అందుకు గల కారణాలు ఏంటి అంటే..

Vehicle Ban: ప్రభుత్వం సంచలన నిర్ణయం..ఆ వాహనాలపై నిషేధం
Vehicle Ban

ఢిల్లీ: వాహనదారుల గుండె గుబేల్మనే వార్త ఇది. వారికి భారీ షాకిచ్చింది ప్రభుత్వం. పెట్రోల్, డిజీల్‌తో నడిచే ద్విచక్ర వాహనాలు, సీఎన్‌జీతో నడిచే ఆటోలపై నిషేధం విధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. త్వరలోనే అనగా వచ్చే ఏడాది(2026) ఆగస్టు 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. ఇంతకు ఈ నిషేధం ఎక్కడ అమలు కానుంది అంటే దేశ రాజధాని ఢిల్లీలో. మరి ప్రభుత్వం ఎందుకు ఇలాంటి నిర్ణయం తీసుకుంది.. అందుకు గల కారణాలు ఏంటి అంటే..

వాయు కాలుష్యంతో తీవ్రంగా ఇబ్బందిపడుతున్న నగరాల్లో ఢిల్లీ ప్రథమ స్థానంలో ఉంది. చలికాలంలో అయితే ఈ సమస్య మరింత పెరుగుతుంది. వాయు కాలుష్య సమస్య పరిష్కారం కోసం ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం అనేక చర్యలు చేపట్టింది. దీనిలో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు అనేక చర్యలు తీసుకుంటుంది. త్వరలోనే ఎలక్ట్రిక్ వెహికల్ పాలసీ 2.0ని అమలు చేసేందుకు రెడీ అవుతోంది. దానిలో భాగంగా కీలక నిర్ణయం తీసుకుంది.


దీని ప్రకారం.. ఆగస్ట్ 15 , 2026 నుంచి ఢిల్లీలో కొత్త సీఎన్‌జీ ఆటోరిక్షాలను రిజిస్టర్ చేయవద్దని ఢిల్లీ ఇంటిగ్రేటెడ్ మల్టీ మోడల్ ట్రాన్సిస్ట్ సిస్టమ్(డీఐఎంటీఎస్), ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్(డీటీసీ) ఆదేశాలు జారీ చేసింది. అలానే ఇప్పటికే ఉన్న సీఎన్‌జీ ఆటోరిక్షాల పర్మిట్లను రెన్యూవల్ చేయవద్దని ఆదేశించింది. అంతేకాక పదేళ్లు దాటిన సీఎన్‌జీ ఆటోరిక్షాలను బ్యాటరీతో నడిచే వాహనాలుగా మార్చాలని సూచించింది. ఆగస్టు 15 తర్వాత కేవలం ఎలక్ట్రిక్ ఆటోరిక్షాలకు మాత్రమే అనుమతి ఉందని ఢిల్లీ ప్రభుత్వం స్పష్టం చేసింది.


అలానే పెట్రోల్, డిజీల్, సీఎన్‌జీతో నడిచే టూవీలర్స్‌పై కూడా నిషేధం విధిస్తూ డీఐఎంటీఎస్, డీటీఎస్ నిర్ణయం తీసుకుంది. 2026, ఆగస్టు 15 నుంచి ఈ నిర్ణయం అమల్లోకి రానుంది. అంతేకాక 2026, ఆగస్టు 15 తర్వాత సరుకు రవాణా కోసం వినియోగించే పెట్రోల్, డిజీల్, సీఎన్‌జీతో నడిచే టూవీలర్స్‌కు సంబంధించి కొత్త రిజిస్ట్రేషన్‌లు చేయడానికి అవకాశం లేదని స్పష్టం చేసింది. ఢిల్లీలో వాయు కాలుష్య నివారణ చర్యల్లో భాగంగానే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని అధికారులు తెలిపారు. కొత్తగా వాహనాలు కొనుగోలు చేద్దామని భావించే వారు ప్రభుత్వ నిర్ణయాల గురించి తెలుసుకుని.. నిర్ణయం తీసుకోవడం ఉత్తమం అంటున్నారు.

ఇవి కూడా చదవండి:

Mariage Viral Video: ఇదెక్కడి వింత ఆచారం.. వధూవరులతో వీళ్లు చేయిస్తున్న పని చూస్తే..

Mohan Babu Family Dispute: మోహన్‌బాబు ఇంటి వద్ద మరోసారి ఉద్రిక్తత

Updated Date - Apr 09 , 2025 | 12:24 PM