Share News

Mamata Banerjee: ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ

ABN , Publish Date - Mar 31 , 2025 | 05:22 PM

బీజేపీ విభజన రాజకీయాలు చేస్తోందని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆరోపించారు. కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో సోమవారంనాడు జరిగిన ఈద్ ప్రార్థనల్లో సీఎం పాల్గొన్నారు.

 Mamata Banerjee: ప్రాణత్యాగానికైనా సిద్ధమే: ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ

కోల్‌కతా: బెంగాల్‌లో అల్లర్లను రెచ్చగొట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయని, అలాంటి వారి ఉచ్చులో పడవద్దని పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీ (Mamata Banerjee) పిలుపునిచ్చారు. బెంగాల్ ప్రభుత్వం మైనారిటీలకు అండగా నిలుస్తుందని, రాష్ట్రంలోని మతసామరస్యాన్ని ఎవరూ దెబ్బతీయలేరని, అన్ని మతాలను పరిరక్షించేందుకు ప్రాణత్యాగానికైనా సిద్ధమని అన్నారు. బీజేపీ 'విభజన రాజకీయాలు' చేస్తోందని ఆరోపించారు. కోల్‌కతాలోని రెడ్ రోడ్‌లో సోమవారంనాడు జరిగిన ఈద్ ప్రార్థనల్లో మమతా బెనర్జీ పాల్గొన్నారు.

Sanjay Raut: మోదీ ఆ ప్లాన్‌తోనే ఆర్ఎస్ఎస్ కార్యాలయానికి వెళ్లారేమో..


బీజేపీపై మండిపాటు

బీజేపీ విభజన రాజకీయాలకు పాల్పడుతోందని, వారికి మైనారిటీలతో సమస్య ఏదైనా ఉంటే అందుకోసం దేశ రాజ్యాంగాన్ని మారుస్తారా? అని ప్రశ్నించారు. మీరు హిందువా అని ఎవరైనా ప్రశ్నిస్తే, తాను హిందువునని, ముస్లింనని, సిక్కునని, ఇండియన్‌నని చెబుతానని, ఎవరేమి చేస్తారని నిలదీశారు. విభజించి పాలించాలని బీజేపీ చూస్తోందని, అలా తాము జరగనీయమని చెప్పారు.


''మేము లౌకికవాదులం. ఒకవైపు నవరాత్రులు జరుగుతున్నాయి. వారికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఇలాంటి సమయంలో ఎలాంటి అరాచకాన్ని వ్యాప్తి చేయరాదని కోరుకుంటున్నాం. సామాన్యులు అరాచకాన్ని వ్యాప్తి చేయరు. రాజకీయ పార్టీలు అలాంటి చర్యలకు పాల్పడతాయి. ఇది సిగ్గుచేటు. ఇంతకు ముందు వామపక్షాలు సెక్యులరిజం గురించి స్టేట్‌మెంట్లు ఇచ్చేవి. ఇప్పుడు వామపక్షాలు, బీజేపీ చేతులు కలిపాయి. మేము ఒంటరి పోరాటం చేస్తున్నాం. అన్ని మతాల కోసం మేము ప్రాణత్యాగానికి కూడా సిద్ధం. మైనారిటీలను రక్షించడం మెజారిటీల కర్తవ్యం. మెజారిటీలతో కలిసి జీవించడం మైనారిటీల కర్తవ్యం'' అని మమత పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి..

Kunal Kamra Row: కునాల్‌కు శివసేన స్టైల్‌లో స్వాగతం చెబుతాం.. రాహుల్ కనల్

వాట్సాప్‌లో కాదు.. పుస్తకాలు చదివి చరిత్ర తెలుసుకొండి: రాజ్‌ఠాక్రే

Monalisa Director: మోనాలిసా డైరెక్టర్‌పై కేసు.. అత్యాచారం, ఆపై అసభ్య వీడియోలతో వేధింపులు

For National News And Telugu News

Updated Date - Mar 31 , 2025 | 05:45 PM