Share News

BJP: ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు బీజేపీ సై

ABN , Publish Date - Apr 08 , 2025 | 01:58 PM

రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు బీజేపీ సై అంటోంది. దీనిలో భాగంగా ఇక రాష్ట్రవ్యాప్తంగా వివిధ ఆందోళనలు నిర్వహించేందుకు సిద్ధమైంది. కాగా.. రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నింటా విఫలం చెందిందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి మండిపడ్డారు

BJP: ప్రభుత్వ వైఫల్యాలపై పోరుకు బీజేపీ సై

బెంగళూరు: రాష్ట్రంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అన్నింటా విఫలం చెందిందని, ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తోందని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి మండిపడ్డారు. మైసూరులో సోమవారం జనాక్రోశ ర్యాలీని ప్రారంభించారు. నిత్యావసర ధరలు పెరిగాయని, మరోవైపు మతానికి అనుగుణంగా ప్రభుత్వ కాంట్రాక్టులలో 4శాతం రిజర్వేషన్లను ముస్లింలకు కేటాయించడం సరికాదన్నారు. రాష్ట్రప్రభుత్వం తప్పిదాలను కప్పి పుచ్చుకునేందుకు రోజుకో విధంగా వ్యవహరిస్తోందన్నారు.

ఈ వార్తను కూడా చదవండి: Raind: బంగాళాఖాతంలో అల్పపీడనం.. 12 వరకు వర్షసూచన


డీజిల్‌పై రాత్రికి రాత్రి చార్జీలు పెంచారని మండిపడ్డారు. తొలుత చాముండేశ్వరి ఆలయంలో పూజలు జరిపి అనంతరం మైసూరు నగరవీధుల్లో ర్యాలీ జరిపారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు విజయేంద్ర, ప్రతిపక్షనేతలు అశోక్‌, చలవాది నారాయణస్వామి, మాజీ మంత్రులు అశ్వత్థనారాయణ, సీటీ రవి, శ్రీరాములు(Achyuta Samanta, C.T. Ravi, Sri Ramulu), వేలాదిమంది కార్యకర్తలు పాల్గొన్నారు. కేంద్రమాజీ మంత్రి సదానందగౌడ, ఎంపీ పీసీ మోహన్‌, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. డ్రమ్ము వాయించి కేంద్రమంత్రి ప్రహ్లాద్‌జోషి ర్యాలీ ప్రారంభించగా నగరవ్యాప్తంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు హోరెత్తాయి.


pandu1.jpg

కాగా.. సీఎం సిద్దరామయ్య బీజేపీ ర్యాలీని ఉద్దేశించి మీడియాతో మాట్లాడుతూ కేవలం పార్టీ అధ్యక్షుడు విజయేంద్ర ఉనికి కోసమే యాత్రలు చేస్తున్నారన్నారు. ప్రధానమంత్రి నరేంద్రమోదీ పెట్రోల్‌, డీజిల్‌తోపాటు వంటగ్యాస్‌ ధర పెంచారని, జనాక్రోశ యాత్ర జరిపే బీజేపీ నాయకులు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై కేంద్రం వద్ద నిలదీసే సత్తా ఎవరికీ లేదన్నారు. విజయేంద్రది పేమెంట్‌ సీట్‌ అని సొంతపార్టీవారే ఆరోపిస్తున్నారన్నారు. అతడికి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు లేదన్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

బిల్లుల కోసం సత్యాగ్రహం చేస్తాం

ఉదయం ఎండ .. సాయంత్రం వాన

నగరంలో కొత్తగా 6 ఎంఎంటీఎస్‌ ట్రైన్‌ లైన్లు

Read Latest Telangana News and National News

Updated Date - Apr 08 , 2025 | 01:58 PM