Deputy CM: డిప్యూటీ సీఎంకు బాంబు బెదిరింపు.. రంగంలోకి పోలీసులు
ABN , Publish Date - Feb 20 , 2025 | 02:54 PM
మొన్న ఎయిర్ పోర్టులకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. ఆ తర్వాత ఇటివల ప్రధాని మోదీ ప్రయాణించిన విమానం సమయంలో కూడా అదే జరిగింది. ఆ తర్వాత తాజాగా ఇప్పుడు డిప్యూటీ సీఎంకు కూడా బెదిరింపు మెయిల్ వచ్చింది. ఆ వివరాలేంటో ఇక్కడ చూద్దాం.

దేశంలో బాంబు బెదిరింపు ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇటివల ప్రధాని మోదీ అమెరికాకు వెళ్లిన క్రమంలో ఆయన ప్రయాణిస్తున్న విమానానికి బాంబు బెదిరింపులు వచ్చాయి. అవి మరువకముందే తాజాగా మరొకటి వెలుగులోకి వచ్చింది. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే(Eknath Shinde)కు బాంబు బెదిరింపు మెయిల్ వచ్చింది. ఓ గుర్తు తెలియని వ్యక్తి ఆయన వాహనాన్ని పేల్చివేస్తానని బెదిరించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయం తెలుసుకున్న ముంబై పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేస్తున్నారు. దీంతో మెయిల్ చేసిన వ్యక్తి ఎవరు, ఎందుకు చేశారనే వివరాలను ఆరా తీస్తున్నారు.
పోలీసులు చెబుతున్న వివరాల ప్రకారం గోరేగావ్ పోలీస్ స్టేషన్, మంత్రాలయ, జేజే మార్గ్ పోలీస్ స్టేషన్ సహా అనేక ప్రాంతాలకు ఇమెయిల్ వచ్చింది. ఆ క్రమంలో మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్ షిండే వాహనంపై దాడి జరిగే ఛాన్స్ ఉన్నట్లు ఇమెయిల్ మెసేజ్ వచ్చింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు వాటిని పంపించిన వారి వివరాల గురించి దర్యాప్తు చేస్తున్నారు. అయితే ప్రాథమిక దర్యాప్తులో నకలీ మెయిల్ కావచ్చని అధికారులు భావిస్తున్నారు. కానీ ఒకవేళ నిజం అయితే ఎలా అని, డిప్యూటీ సీఎం భద్రతను పెంచడంతోపాటు నిఘా బృందాలను అప్రమత్తం చేశారు.
ఈ క్రమంలో ఇమెయిల్, IP చిరునామా ద్వారా బెదిరింపు మెయిల్స్ పంపించిన వారి గురించి సమాచారం సేకరిస్తున్నారు. మరోవైపు ఇటివల డిప్యూటీ సీఎం నివాస పరిధిలో ఎవరైనా అనుమానాస్పదంగా కనిపించారా అనే విషయాలను కూడా పోలీసులు తెలుసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పంపినవారిని గుర్తించడానికి సమగ్ర దర్యాప్తు జరుగుతోందని అధికారులు హామీ ఇచ్చారు. అనుమానితుల కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు చెప్పారు. ఈ క్రమంలో ఏదైనా అనుమానాస్పద కార్యకలాపాలు చోటుచేసుకుంటే తెలపాలని కోరారు. దీంతోపాటు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.
ఇవి కూడా చదవండి:
Recharge Offer: నెలకు రూ. 99కే రీఛార్జ్ ప్లాన్.. జియో, ఎయిర్‌టెల్‌కు గట్టి సవాల్
Ponzi Scam: పోంజీ స్కాం పేరుతో రూ. 870 కోట్లు లూటీ..
BSNL: రీఛార్జ్‌పై టీవీ ఛానెల్‌లు ఉచితం.. క్రేజీ ఆఫర్
Read More Business News and Latest Telugu News