Share News

Women's Rights: అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరం

ABN , Publish Date - Mar 18 , 2025 | 04:18 AM

ఎలాంటి అంగీకారం తీసుకోకుండానే తన ఫొటోను ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించారని పేర్కొంటూ నమ్రత అంకుశ్‌ కవాలే అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ జి.ఎ్‌స.కులకర్ణి, జస్టిస్‌ అద్వైత్‌ సేత్నాల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది.

Women's Rights: అనుమతి లేకుండా మహిళల ఫొటోల వినియోగం ఆందోళనకరం

కేంద్రం, తెలంగాణ సహా 4 రాష్ట్రాలకు బాంబే హైకోర్టు నోటీసులు

ముంబై, మార్చి 17: ఎలాంటి అనుమతి తీసుకోకుండా మహిళల ఫొటోలను ప్రకటనల్లో ఉపయోగించడం చట్టవ్యతిరేకమని బాంబే హైకోర్టు వ్యాఖ్యానించింది. వాటిని ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించినా అది‘ వాణిజ్యపర దోపిడీ’ కిందకే వస్తుందని తెలిపింది. ఎలాంటి అంగీకారం తీసుకోకుండానే తన ఫొటోను ప్రభుత్వ ప్రకటనల్లో ఉపయోగించారని పేర్కొంటూ నమ్రత అంకుశ్‌ కవాలే అనే మహిళ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన జస్టిస్‌ జి.ఎ్‌స.కులకర్ణి, జస్టిస్‌ అద్వైత్‌ సేత్నాల ధర్మాసనం ఈ వ్యాఖ్యలు చేసింది. సమాధానం చెప్పాలంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, తెలంగాణ, మహారాష్ట్ర, కర్ణాటక, ఒడిసా రాష్ట్రాల ప్రభుత్వాలు, కాంగ్రెస్‌ పార్టీ, అమెరికాకు చెందిన షట్టర్‌స్టాక్‌ వెబ్‌సైట్‌, టోటల్‌ డెంటల్‌ కేర్‌ ప్రైవేటు లిమిటెడ్‌, సంబంధిత ఫొటోగ్రాఫర్‌, ఇతరులకు నోటీసులు పంపించింది. ఈ నెల 24లోగా సమాధానం ఇవ్వాలని ఆదేశించింది. నమ్రత కవాలే గ్రామానికే చెందిన తుకారాం కార్వే అనే ఫొటోగ్రాఫర్‌ ఆమె ఫొటో తీశాడు. ఆమె నుంచి ఎలాంటి అనుమతి తీసుకోకుండానే షట్టర్‌స్టాక్‌ వెబ్‌సైట్‌లో పెట్టాడు. ఈ వెబ్‌సైట్‌ నుంచి ఎవరైనా ఫొటోలు కొనుక్కొని డౌన్‌లోడ్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. దాంతో ఆమె ఫొటోను ఉపయోగించుకొని ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటనలు విడుదల చేయడంతో పాటు, హోర్డింగ్‌లు కూడా పెట్టాయి. తన అనుమతి లేకుండానే ఫొటోలను ఉపయోగించడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆమె పిటిషన్‌ దాఖలు చేశారు. ఇకపై తన ఫొటోను ఉపయోగించకూడదంటూ ఆదేశాలు ఇవ్వాలని కోరారు.


ఇవి కూడా చదవండి...

Nishanth Dongari: ఇంధన నిల్వ విభాగంలో సరికొత్త ఉత్పత్తుల ఆవిష్కర్ణకు రంగం సిద్ధం

YSR Kadapa District: కేబినెట్‌లో కీలక నిర్ణయం.. వైఎస్ఆర్ జిల్లా పేరు మార్పు

PM Modi: మోదీ వ్యాఖ్యలపై స్పందించిన చైనా

CM Revanth Reddy: కేబినెట్ నుంచి మంత్రులను తొలగిస్తేనేనా..

Tirumala: శ్రీవారి దర్శనానికి తిరుపతి వెళ్తున్నారా .. టేక్ కేర్

CM Revanth Reddy: అసెంబ్లీలో బీసీ రిజర్వేషన్ బిల్లు.. సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు

Droupadi Murmu: రాష్ట్రపతి భవన్‌లో విందు.. హాజరైన ఏపీ ఎంపీలు

CM ChandraBabu: అందుకే ఈ డాక్యుమెంట్‌ రూపొందించాం

Raghurama serious: సభ్యులపై డిప్యూటీ స్పీకర్ సీరియస్

Updated Date - Mar 18 , 2025 | 04:18 AM